ఆర్థిక వ్యవస్థకు బ్రేకులు పడడానికి మోదీ ప్రభుత్వమే కారణమా, ఇప్పుడు ఏం చేయాలి: అభిప్రాయం

  • 4 సెప్టెంబర్ 2019
ఆర్థిక వ్యవస్థకు బ్రేక్ Image copyright Getty Images

మీకు గుర్తుందా? చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కఠిన ఆర్థిక పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్‌లో ఉన్న బంగారాన్ని కుదువ పెట్టారు.

అప్పుడు భారత ఆర్థికవ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఎందుకంటే చంద్రశేఖర్ 1991 ఫిబ్రవరి వరకూ దేశ బడ్జెట్ కూడా పెట్టలేకపోయారు.

ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ అప్పుడు అన్ని సాయాలనూ వెనక్కు తీసుకున్నాయి. 67 టన్నుల బంగారం(40 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో, 20 టన్నులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో) కుదువ పెట్టి ప్రభుత్వం ఆరు కోట్ల డాలర్లు తీసుకున్నారు.

దీనికి బదులు ఐఎంఎఫ్ నుంచి 22 లక్షల డాలర్లు రుణం లభించింది. అప్పుడు ద్రవ్యోల్బణం రేటు 8.4 శాతానికి పడిపోయింది.

1991 నవంబర్ 12న విడుదలైన ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ 'ఇండియా-స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్ క్రెడిట్ రిపోర్ట్' ప్రకారం, ఆ తర్వాతే భారత్‌లో అధికారం మారింది. తర్వాత ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు ఐఎంఎఫ్-వరల్డ్ బ్యాంక్ విధానాలకు పచ్చజెండా ఊపారు.

Image copyright CHANDRASHEKHAR FAMILY

పీవీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ మోడరేట్ ఎకానమీ ద్వారా మూడు చర్యలు తీసుకున్నారు. గ్లోబలైజేషన్, మార్కెట్ ఆర్థికవ్యవస్థ, మూలధన పంపిణీ. ఈ మూడింటి సాయంతో అప్పుడు ప్రపంచబ్యాంక్-ఐఎంఎఫ్ నుంచి భారీ స్థాయిలో రుణాలు అందాయి.

అప్పుడు, ప్రపంచ బ్యాంక్ అన్ని షరతులూ ఒప్పుకున్నారు. మూలధనంలో నిర్మాణ మార్పులు మొదలయ్యాయి. భారతదేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక మొదలైంది. లైసెన్స్ నిబంధనను తొలగించడానికి పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు.

పారిశ్రామిక ఉదారవాదం వేగంగా వ్యాపించింది. పబ్లిక్ సెక్టార్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆలోచన మొదలైంది. చూస్తుండగానే భారత ఎకానమీ మళ్లీ పట్టాలెక్కి పరుగులు తీసింది.

Image copyright Pib

ఆర్థిక సంస్కరణల ఈ మొదటి ఫేజ్‌ను తర్వాత ప్రభుత్వం కూడా కొనసాగించింది. భారత్‌లో 1991 నుంచి ప్రారంభమైన ఆర్థికాభివృద్ధి వేగాన్ని గమనిస్తే 1991 నుంచి 2010 వరకూ వృద్ధి రేటు ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ఒక విధంగా మెరుగ్గానే ఉండేది. అటు ఆర్థికవృద్ధి ఈ నిర్మాణమే భారత్‌లో టాక్స్ పరిధిలోకి రాని వర్గాల్లో కూడా ఊపిరిలూదింది.

మానిటైజేషన్‌కు దూరంగా ఉన్నారని లేదా ఇన్‌ఫార్మల్ సెక్టార్‌ వర్గాలు అనే చోట కూడా మార్కెట్‌లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన కార్మిక వర్గాలు, పూర్తిగా అసంఘటిత రంగంలో ఉన్నవారి పని, వేతనాలు జీడీపీ గ్రోత్‌ను పెంచడానికి సాయం చేశాయి.

ఇక్కడ భారత ఆర్థికాభివృద్ధి మూడు స్థాయిల్లో జరిగిందనేది గమనించవచ్చు. భారత కంపెనీలను బహుళజాతి కంపెనీల్లో చేర్చారు. బహుళజాతి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం మొదలైంది. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఆదాయంలో వేగంగా వృద్ధి వచ్చింది.

Image copyright Getty Images

తర్వాత కూడా కొనసాగిన సంస్కరణలు

తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి పాలన(1998-2004)ను గుర్తుచేసుకుందాం. స్వర్ణ చతుర్భుజి రహదారి పథకంతో పట్టణాలకు దగ్గరగా గ్రామీణ భారత ముఖచిత్రం మారిపోయింది. దేశవ్యాప్తంగా నగరాల బయటి ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా జరిగింది. దానితో ఆయా రహదారుల పక్కన ఉన్న భూముల మానిటైజేషన్ ఎత వేగం అందుకుందంటే, ఆ లాభం నేరుగా ప్రొడక్ట్ అండ్ ప్రొడక్షన్‌కు సంబంధించిన మార్కెట్, ఆ పరిశ్రమలకు చేరింది.

కొన్నిచోట్ల భూములకు లభించిన పరిహరం ద్వారా ఆదాయం వస్తే మరికొన్నిచోట్ల ఎకానమీకి దగ్గరగా ఉండడం వల్ల దేశంలోని సుమారు 3 వేల గ్రామాల ముఖచిత్రం మారిపోయింది.

ప్లానింగ్ కమిషన్ 2001-02 రిపోర్ట్ ప్రకారం ఈ మొత్తం ప్రక్రియలో అసంఘటిత రంగాలకు సంబంధించిన 40 కోట్ల మంది కూడా వినియోగదారులు అయ్యారు. రైతులు-కూలీలు వ్యవసాయం లేక, పంటలు పండక పనుల కోసం గ్రామాల నుంచీ పట్టణాలకు వలస వెళ్లారు. సంపాదనతో వారి కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. దేశీయ కంపెనీల ఉత్పత్తుల డిమాండ్ బిస్కట్-బ్రెడ్ నుంచి సబ్బు, టూవీలర్ వరకూ చేరుకుంది.

Image copyright Getty Images

గణాంకాల ప్రకారం దేశంలో 10 కోట్ల మంది మధ్యతరగతి ప్రజల పరిధి 15 కోట్లకు చేరింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పని దొరక్కపోవడం అనే ఒత్తిడి నుంచి విముక్తి లభించింది.

దాని ప్రభావం బ్యాంకులపై కూడా పడింది. 2003-04 రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం వాజ్‌పేయి పాలన సమయంలో సేవింగ్స్ ఖాతాల్లో 17 శాతం పెరుగుదల నమోదైంది. పీవీ-మన్మోహన్ జోడీ ఉదారవాద ఆర్థికవ్యవస్థ ముఖచిత్రాన్నే వాజ్‌పేయి ప్రభుత్వం కొనసాగించిందనేది ముమ్మాటికీ నిజం.. దానికి 'ఆర్థిక సంస్కరణల ట్రాక్-టూ' అనే పేరు పెట్టారు.

అప్పుడు జిలుగుల ఎకానమీ అని సంఘ్ పరివార్ దానిని వ్యతిరేకించడం గుర్తుందా. బీఎంఎస్-స్వదేశీ జాగరణ్ మంచ్ దేశ ఆర్థికవ్యవస్థను సమర్థించాయి. వాజ్‌పేయి ప్రభుత్వానికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి పరిస్థితి. దాంతో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తన పదవి వీడాల్సి వచ్చింది. కానీ ఆర్థిక సంస్కరణల్లో ఈ జంప్ చేసినప్పుడే వాజ్‌పేయి ప్రభుత్వం 'షైనింగ్ ఇండియా' రాగం అందుకుంది.

అయినా, వాజ్‌పేయి ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ సంఘ్ మద్దతు లభించలేదనే థియరీనే చెప్పారు. వాజ్‌పేయి కాలంలోని ఆర్థిక సంస్కరణలను వామపక్షాల మద్దతుతో ఏర్పడిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమలు చేసింది.

Image copyright Getty Images

సమానాంతర ఆర్థిక వ్యవస్థ

అయితే, వామపక్ష నేత ఎ.బి.బర్ధన్ ఈ పెట్టుబడుల ఉపసంహరణను బహిరంగంగా వ్యతిరేకించారు. అతిపెద్ద విషయం ఏంటంటే, ఈ ఆర్థిక సంస్కరణలకు 2010 వరకూ ఎలాంటి అడ్డంకులూ రాలేదు. ఇన్‌ఫార్మల్ సెక్టార్‌ను ప్రభుత్వం అసలు ముట్టుకోలేదు.

2010లో అమలు చేసిన ఎన్ఎస్ఎస్ఓ గణాంకాల ప్రకారం మార్కెట్ నుంచి ఆదాయం లభించిన తర్వాత అసంఘటిత రంగాలకు సంబంధించిన 40 కోట్ల మంది సంపాదన ఏ ట్యాక్స్ పరిధిలోకి రాలేదు, ఆ డబ్బు ఎవరినీ ఏ వ్యాపారం చేయకుండా అడ్డుకోలేదు. లేదా ఆ వ్యాపారం ప్రభుత్వం నిఘాలోకి రాలేదు.

అంటే, ఫార్మల్ సెక్టార్‌కు సమానాంతరంగా ఒక ఇన్‌ఫార్మల్ ఎకానమీ ఉండేది. అది ప్రభుత్వ ఎకానమీకి సమానాంతరంగా ఉండేది. అదే పరిధిలో చిన్న, మధ్యరకం పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. రియల్ ఎస్టేట్ కూడా మెరిసింది.

Image copyright Getty Images

ఇంకొకటి కూడా చెప్పచ్చు. ఇదే కాలంలో వారు అవినీతికి సంబంధించిన బ్లాక్ మనీ కూడా ఖర్చు చేశారు. ప్రభుత్వ వర్గాల నుంచి ప్రైవేటు రంగంలో ఉద్యోగుల వరకూ ఆ డబ్బు ప్రభుత్వ దృష్టికి వచ్చేది కాదు. వారు సృష్టించిన సమానాంతర ఆర్థికవ్యవస్థ వల్ల, 2008-09లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వచ్చినా భారత్‌ దాని గుప్పిట్లోకి రాలేదు.

అందుకే పబ్లిక్ సెక్టార్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా సంస్థలకు ఆ కాలంలో నష్టాలు లేదా మునిగిపోయే పరిస్థితులు వచ్చాయి. 2010 వరకూ అదే పరంపర కొనసాగింది. అలా లేదని కూడా తోసిపుచ్చలేం.

మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల్లో మన్రేగా, విద్యా గ్యారంటీ లాంటి పథకాలకు అడ్డంకులు వచ్చాయంటే, దానికి కారణం.. ప్రత్యామ్నాయం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

Image copyright Getty Images

అంటే మన్రేగా కోసం గ్రామీణ భారతంలో ఖర్చు చేసే నిధులకు, విద్యా గ్యారంటీ పథకం అమలు ప్రక్రియకు ప్రైవేటు రంగాన్ని దూరంగా ఉంచారు. సీఎస్ఆర్(కార్పొరేట్ సామాజిక బాధ్యత) మొత్తం ద్వారా విద్యా రంగాన్ని ప్రైవేటు మూలధనం ద్వారా విస్తరించి ఉండవచ్చు.

కానీ తర్వాత కూడా గమనిస్తే 2014లో మన్మోహన్ సింగ్ ఓటమి తర్వాత మోదీ ప్రభుత్వానికి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు నష్టాల్లో కనిపించలేదు.

2014లో ప్రైవేటు లేదా పబ్లిక్ సెక్టార్‌లలో ఏవీ పెద్దగా లాభాల్లో లేవు, అలా అని నష్టాల్లో కూడా లేవు. మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల 'ట్రాక్ 3' లేదా 'ట్రాక్ 4'( జనరేషన్ 2 లేదా 4)ను అడాప్ట్ చేసుకోవాలా, లేక సంఘ్ స్వదేశీని అడాప్ట్ చేసుకోవాలా అనే ప్రశ్న అక్కడి నుంచే వస్తుంది.

Image copyright Getty Images

మోదీ ప్రభుత్వం ఏం చేసింది

గమనిస్తే, మోదీ ప్రభుత్వం స్వదేశీ రాగం అస్సలు ఆలపించలేదు. కానీ కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలను అవినీతి దృష్టితోనే చూసింది. ఒక్కొక్కటిగా దాదాపు ప్రతి రంగాన్నీ ప్రభుత్వానికి దగ్గరగా ఉండడం వల్లే లాభాలు దక్కేలా సర్కారు దృష్టి పరిధిలోకి తీసుకొచ్చింది.

దీనితోపాటు కార్పొరేట్ పొలిటికల్ ఫండింగ్ అత్యధికంగా మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరగలేదు, బీజేపీ ఉన్నప్పుడు 90 శాతం జరిగాయి. కానీ కాలంతోపాటు ప్రభుత్వాలు కూడా సెలక్టివ్ అవుతూ వచ్చాయి. ప్రభుత్వ సాయంతో ఎదుగుతున్న కంపెనీలు ప్రైవేటు రంగంలో ఉండాల్సిన పోటీని అంతం చేశాయి.

దానితోపాటు పబ్లిక్ సెక్టార్‌ కంపెనీలను అంతం చేయడానికి ఆ కంపెనీలతో పోటీపడే ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వమే అండగా నిలిచింది. బీఎస్ఎన్ఎల్ దీనికి ఒక మంచి ఉదాహరణ.

ఇదంతా బహిరంగంగా ఏ స్థాయిలో జరిగిందంటే రిలయన్స్ తన జియో కంపెనీకి పబ్లిసిటీ అంబాసిడర్‌గా వేరే ఎవరో కాదు, ఏకంగా ప్రధానమంత్రి మోదీనే పెట్టుకుంది. మరోవైపు అంతకంతకూ నష్టపోతూ వచ్చిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు ఇచ్చే స్థితి కూడా లేకుండాపోయింది.

అలాగే అదానీ గ్రూప్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినా, కేవలం ప్రభుత్వానికి సన్నిహితంగా ఉందనే కారణంతో పోర్టులు, ఎయిర్ పోర్టులు ఇచ్చేశారు. దానివల్ల కూడా ఆర్థికాభివృద్ధిలో పోటీ ఉంటుందనే ఆలోచనను పక్కకెళ్లింది. కానీ దీనిపై విసృత ప్రభావం పడింది మాత్రం నోట్ల రద్దు, జీఎస్టీ వల్లే.

Image copyright Getty Images

నోట్ల రద్దు-జీఎస్టీ దెబ్బ

నోట్లరద్దు సమానాంతర ఆర్థికవ్యవస్థను కొసాగిస్తున్న అసంఘటిత రంగాల నడ్డి విరిచింది. అటు ఆర్థిక సంస్కరణల అభిప్రాయాలను జీఎస్టీ శవపేటికలో పెట్టి మేకులు కొట్టేసింది. దానితో ఇన్‌ఫార్మల్ సెక్టార్ ప్రభుత్వ నిఘాలోకి వచ్చింది. అక్కడ ప్రభుత్వం దానినుంచి కోలుకుంటున్నట్లే కనిపించింది.

వ్యవసాయ భూముల మానిటైజేషన్ ప్రారంభమైనప్పుడు చిన్న-మధ్యరకం పరిశ్రమల వ్యాపారాలు కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. జీఎస్టీ చిక్కుల వల్ల ఉత్పత్తులు మార్కెట్ వరకూ చేరలేదు. మార్కెట్ వరకూ చేరినవి అమ్ముడు కాలేదు. అంటే ఆర్థిక సంస్కరణలు ఎంత వేగంగా దేశంలోని అన్ని వర్గాలనూ కొనుగోలుదారుడుగా మార్చి వారి కొనుగోలు శక్తిని పెంచాయో, దానికి బ్రేక్ పడిపోయింది.

అసంఘటిత రంగంలో 45 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి సంక్షోభం ఎదురైంది. సంఘటిత రంగంలో ఉన్న వారు మూలధనం లేకుండా ఎలా ముందుకు వెళ్లాలనే గందరగోళంలో పడ్డారు. ఈ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ నుంచి అన్ని ఉత్పత్తులూ కర్మాగారాలకే పరిమితమైపోయింది.

గ్రామీణ భారతాన్ని నోట్ల రద్దు కన్నీళ్లు పెట్టిస్తే, జీఎస్టీ పట్టణ భారతాన్ని అతలాకుతలం చేసింది. ఆర్థిక సంస్కరణలను మోదీ ప్రభుత్వం 'క్రోనీ కాపిటలిజం', 'అవినీతి' దృష్టితో చూసినప్పుడు, ఆ వ్యవస్థను అంతం చేసే ప్రక్రియలో సమానాంతరంగా ఉన్న వేరే వ్యవస్థను ఎందుకు అది నిలబెట్టలేకపోయింది అనే అతిపెద్ద ప్రశ్న ఎదురవుతుంది.

Image copyright Getty Images

1991 నుంచి 2019 వరకూ ఏం మారింది

నిజానికి మొదటి నుంచి నడుస్తున్న వ్యవస్థను అంతం చేసేందుకు ఏదైనా కొత్త సమానాంతర వ్యవస్థను నిలబెట్టకపోవడం వల్లే సంక్షోభం మొదలవుతుంది.

1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలు నిజానికి విచ్చలవిడి మూలధన మార్గాన్ని ప్రేరేపించింది. కానీ దానిని అంతం చేయాలనుకున్నప్పుడు. అవినీతి ఆగలేదు, సరికదా అది కొంతమంది చేతులకే పరిమితమైంది. అందులో ఉన్న అతిపెద్ద చేయి రాజకీయ శక్తులదే.

మరోవైపు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి బదులు మోదీ రైతులు-కూలీలను ఊరించేందుకు రాజకీయంగా నిధులు పంపిణీ చేసే సోషలిస్టు మార్గంలో బయలుదేరారు. కానీ ఆ ప్రక్రియలో నిధులు ఎక్కడ్నుంచి వస్తాయి, అనే దానిపై ఏదీ ఆలోచించలేదు.

Image copyright Getty Images

దాంతో, ఆర్థిక సంస్కరణల సమయంలో ఫార్మల్ సెక్టార్ నుంచి ఇన్ఫార్మల్ సెక్టార్‌కు ఎలాంటి లాభాలు అందుతూ వచ్చాయో, అవి ఆగిపోవడమే కాదు, అక్కడ రక్తాశ్రువులు చిందేలా చేశాయి.

జీడీపీ ఇప్పుడు 5 శాతం దగ్గర ఉంది. కానీ ఇన్ఫార్మల్ సెక్టార్ జీడీపీ మన ముందుకు వచ్చే 2022 నాటికి జీడీపీ వేగం 2 శాతం ఉన్నా అది చాలా పెద్ద విషయమే అవుతుంది. (ఇన్‌ఫార్మల్ సెక్టార్ వృద్ధి రేటు ఐదేళ్లకే లభిస్తుంది)

అందుకే, మోదీ ప్రభుత్వం ఇప్పుడు తాము చేసిన ప్రకటనలను వెనక్కు తీసుకుని ఆర్థిక సంస్కరణల దారిలో వెళ్లాలనుకుంటుందా? లేక ఆర్థిక వ్యవస్థ కోసం రాజకీయ చర్యలు చేపడుతుందా? అనే ప్రశ్న ఎదురవుతుంది.

ఎందుకంటే పతనమైన ఆర్థికవ్యవస్థ స్పష్టమైన సంకేతాలను ఇస్తోంది. పొలిటికల్ ఎకానమీ ద్వారా కార్పొరేట్‌ను హాండిల్ చేయడం, దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయాలను నడిపించడం, ఆకాశాన్నంటే నిరుద్యోగం కోసం రాజకీయ జాతీయవాదాన్ని మేల్కొలపడం అనేది కొత్త భారతదేశం ఆలోచన.

(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం