పాకిస్తాన్ కమ్యూనికేషన్స్ టవర్ నుంచి కశ్మీర్‌కు సిగ్నల్స్ : అజిత్ డోభాల్

 • 8 సెప్టెంబర్ 2019
అజిత్ డోభాల్ Image copyright AFP

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ శనివారం కశ్మీర్‌లో అశాంతి, లోయలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఒక ప్రకటన చేశారు.

గత కొన్నిరోజులుగా బీబీసీ సహా కొన్ని మీడియా గ్రూపుల నుంచి కశ్మీర్‌లో హింస, అశాంతితో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనే వార్తలు వస్తున్నాయి.

అమెరికా విదేశాంగ శాఖ కూడా శుక్రవారం కశ్మీర్ గురించి ఒక ప్రకటన జారీ చేసింది.

అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ వోర్టగస్ "కశ్మీర్లో రాజకీయ నేతలు, వ్యాపారులను పెద్ద సంఖ్యలో అదుపు తీసుకోవడం గురించి మాకు ఆందోళనగా ఉంది" అన్నారు.

Image copyright TWITTER/STATEDEPT
చిత్రం శీర్షిక అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో

"స్థానికులపై ఉన్న ఆంక్షలు కూడా మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఆపేశారని మాకు వార్తలు వచ్చాయి" అని మోర్గాన్ చెప్పారు.

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత షెహ్లా రషీద్ కూడా లోయలో సామాన్యులపై వేధింపులకు సంబంధించి కొన్ని ట్వీట్స్ చేశారు.

ఆ తర్వాత ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. సైన్యం వరసగా ఇలాంటి వార్తలను ఖండిస్తూ వస్తోంది.

కానీ డోభాల్ శనివారం కొందరు జర్నలిస్టులతో మాట్లాడుతూ కశ్మీర్‌లో పరిస్థితి చేజారడానికి పాకిస్తానే కారణం అని ఆరోపించారు.

అయితే డోభాల్ తన ప్రకటనలో అమెరికా విదేశాంగ శాఖ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ శుక్రవారం అమెరికా వైపు నుంచి వచ్చిన ప్రశ్నలన్నింటికీ అందులో సమాధానాలు ఉన్నాయి.

Image copyright ABID BHAT

డోభాల్ ఏం చెప్పారు

 • కశ్మీర్‌లోని మెజారిటీ జనాభా ఆర్టికల్ 370ని తొలగించడానికి అనుకూలంగా ఉన్నారని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
 • ఆర్టికల్ 370పై భారత్ నిర్ణయం తర్వాత తమకు మెరుగైన అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు, యువకులకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని కశ్మీరీలు ఎదురు చూస్తున్నారు.
 • కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరికీ ఇది సామాన్యుల గళం అనిపిస్తోంది. అది పూర్తిగా నిజం కాదు.
 • కశ్మీర్‌లో సైన్యం వేధించడం అనే ప్రశ్నే లేదు. అక్కడ శాంతిస్థాపనకు జమ్ము-కశ్మీర్ పోలీస్, కేంద్ర భద్రతా బలగాలను మోహరించాం. భారత సైన్యం తీవ్రవాదంతో పోరాడ్డానికే మాత్రమే అక్కడ ఉంది.
 • జమ్ము-కశ్మీర్‌లో ఏ నేతపైనా ఎలాంటి చార్జ్ లేదా దేశద్రోహం కేసుల పెట్టలేదు. వారిని గృహనిర్బంధంలో మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామ్యం కోసం సరైన వాతావరణం ఏర్పడేవరకూ వాళ్లు అక్కడ నిర్బంధంలోనే ఉంటారు. అలాంటి పరిస్థితి త్వరలోనే వస్తుందని నాకు అనిపిస్తోంది.
 • కొంతమందిని ముందు జాగ్రత్తతో అదుపులోకి తీసుకున్నాం. బహిరంగ సభలు జరిగితే తీవ్రవాదులు దానిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అలా శాంతిభద్రతలు చూసుకోవడం కష్టం కావచ్చు.
 • నేతలందరినీ చట్టం పరిధిలోనే అదుపులోకి తీసుకున్నాం. వారు తమ నిర్బంధం గురించి కోర్టులో సవాలు చేయవచ్చు.
 • సరిహద్దుకు 20 కిలోమీటర్ల అవతల పాకిస్తాన్ కమ్యూనికేషన్ టవర్ ఉంది. పాకిస్తాన్ అక్కడి నుంచి సందేశాలు పంపిస్తోంది. మేం కొన్ని ఇంటర్‌సెప్ట్ విన్నాం. వాళ్లు "ఇన్ని ఆపిల్ ట్రక్కులు ఎలా నడుస్తున్నాయి. మీరు వాటిని కూడా ఆపలేరా. ఏం ఇప్పుడు మమ్మల్ని గాజులు పంపించమంటారా?" అన్నారు.
 • కశ్మీర్‌లో పరిస్థితులు ఆశించిన దానికంటే ముందే సర్దుకుంటాయనే నాకు అనిపిస్తోంది. ఆగస్టు 6న ఒకే ఒక్క గొడవ జరిగింది. అందులో ఒక యువకుడు మృతిచెందాడు. కానీ అతడు బుల్లెట్ తగలి చనిపోలేదు.
 • మేం అన్ని ఆంక్షలూ తొలగించాలనే కోరుకుంటున్నాం. కానీ అది పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
 • పాకిస్తాన్ తన పద్ధతి మార్చుకుంటే, భయభ్రాంతులు సృష్టించడం మానేస్తే, చొరబాట్లను ఆపేస్తే, తమ సెల్ టవర్ల నుంచి కశ్మీర్‌లో ఉన్న తమ ఫైటర్స్‌కు సందేశాలు పంపకుండా ఉంటే... మేం ఈ ఆంక్షలు తొలగించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది.. నేనేం నేరం చేశానో చెప్పకుండా కేసు పెట్టారు’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్

చంద్రబాబుపై ఏసీబీ కోర్టు విచారణ.. లక్ష్మీపార్వతి 14 ఏళ్ల కిందట వేసిన కేసులో కదలిక

World Toilet Day: కడుక్కోవడమా.. తుడుచుకోవడమా

'శబరిమల ఆలయంలోకి వెళ్తా. నన్ను అడ్డుకోలేరు’ - తృప్తి దేశాయ్

హ్యాకింగ్: భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా

మలం మ్యూజియం: రోజూ వెయ్యి మందికి పైగా సందర్శకులు వస్తున్నారు

గ్రీన్‌హౌస్‌ ఫామ్‌ల్లో నత్తల్ని సాగుచేసి రెస్టారెంట్లకు అమ్ముతున్న హెలీకల్చరలిస్ట్

ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని