విశాఖలో కార్మికులకు చేతినిండా పని దొరకడం లేదు..ఎందుకు..
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

విశాఖలో కార్మికులకు చేతినిండా పని దొరకడం లేదు..ఎందుకు..

  • 9 సెప్టెంబర్ 2019
ఆర్థిక మాంద్యం

విశాఖపట్టణంలోని ఓ పెయింట్స్ గోదాములో రాము దినసరి కూలీ. గాజువాకలోని ఆటోనగర్‌లో ఈ గోదాము ఉంది.

పెయింట్స్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బాలను వేర్ హౌస్‌లకు తీసుకువెళ్లే బళ్లలో ఎక్కించడం రాము పని.

నాలుగు నెలల క్రితం వరకూ రోజుకు రూ.500-600 వరకూ ఆయన సంపాదించునేవారు.

కానీ, గత మూడు నెలలుగా పనులు సరిగ్గా లేవు. ఇప్పుడు రోజుకు కనీసం రూ.150 కూలీ రావడం కూడా గగనమైపోయిందని రాము వాపోతున్నారు.

ఆటోనగర్‌లోనే ఉన్న ఓ వెల్డింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న రామభద్రానిది కూడా ఇదే పరిస్థితి.

గతంలో ఆయనకు రోజూ పని ఉండేది. అప్పుడప్పుడు ఓవర్ టైమ్ చేసి కూడా డబ్బులు సంపాదించుకునేవారు.

ఇప్పుడు వారంలో నాలుగైదు రోజులే పని దొరకుతోందని రామభద్రం అంటున్నారు.

విశాఖ నగరంపై ఇప్పుడిప్పుడే ఆర్థిక మాంద్యం చూపుతున్న ప్రభావం ఆనవాళ్లు ఇవి.

చిన్న పరిశ్రమలపై మాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మూతపడేంత తీవ్రమైన పరిస్థితి లేకపోయినా, ఒకప్పటిలా కార్మికులకు చేతినిండా పని మాత్రం దొరకడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)