పొంగుతున్న వాగులు... ఇబ్బందుల్లో విశాఖ ఏజెన్సీ ప్రజలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: పొంగుతున్న వాగులు... ఇబ్బందుల్లో విశాఖ ఏజెన్సీ ప్రజలు

  • 11 సెప్టెంబర్ 2019

విశాఖ ఏజెన్సీలో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తోన్న వర్షానికి ఏజెన్సీలోని వాగులు, గెడ్డలు (చిన్నపాటి ప్రవాహాలను స్థానికంగా ఇలా పిలుస్తారు) పొంగి పొర్లుతున్నాయి. గెడ్డలను దాటడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హుకుంపేట మండలం మత్స్యపురానికి చెందిన రాణి జ్వరంతో బాధపడుతున్న తన 11 నెలల బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పెద్ద సహాసమే చేయాల్సి వచ్చింది. గెడ్డ పొంగటంతో మత్స్యపురం పెద్ద గరువు మధ్య కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో తల్లి సహాయంతో అతికష్టం మీద ఆమె గెడ్డను దాటి ఆసుపత్రికి వెళ్లారు.

ఇదే గ్రామానికి చెందిన శివ తండ్రి జబ్బుపడటంతో ఆయనను డోలిలో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)