భారతీయ భాషలు: దేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని?

  • 24 సెప్టెంబర్ 2019
హిందీ Image copyright Getty Images

ప్రతి మైలుకీ నీరు మారిపోతుంది.. ప్రతి నాలుగు మైళ్లకీ భాష మారిపోతుంది. సువిశాల భారతదేశంలో భాషల భిన్నత్వానికి అద్దం పట్టే ప్రాచీన నానుడి ఇది.

భారతదేశంలో పదేళ్లకి ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణలో భాగంగా ప్రజల మాతృభాషల వివరాలు కూడా సేకరిస్తారు. ఇలా సేకరించిన వివరాలను భాషాశాస్త్ర సిద్ధాంతాలను అన్వయించి.. ఆయా మాతృభాషలను కొన్ని ప్రధాన భాషలుగా వర్గీకరిస్తారు.

ఇలా సేకరించి, క్రోడీకరించిన గణాంకాల ప్రకారం.. 2011లో దేశ జనాభాలో అత్యధికంగా 43.63 శాతం మంది (దాదాపు 53 కోట్ల మంది) హిందీ ప్రధాన భాషగా మాట్లాడేవారు ఉన్నారు.

అయితే.. హిందీ భాషా వర్గం కింద చేర్చిన మాతృభాషల్లో హిందీ మాతృభాషగా చెప్పినవారు 32.22 కోట్ల మంది ఉంటే.. భోజ్‌పురి (5 కోట్ల మందికి పైగా), ఛత్తీస్‌గఢీ (1.6 కోట్ల మందికి పైగా), మగధి (1.2 కోట్ల మందికి పైగా), రాజస్థానీ (2.5 కోట్ల మందికి పైగా) తదితర 60 పైగా భాషలు ఉన్నాయి.

మరో విశేషమేమిటంటే.. 1971 నాటికి హిందీ భాషా వర్గం కిందే ఉన్న మైథిలి భాషను 1991లో వేరుచేసి ప్రత్యేక భాషగా వర్గీకరించారు. ఇప్పుడు మైథిలి (1.35 కోట్ల మంది) కూడా షెడ్యూల్డు భాషల జాబితాలో 13వ స్థానంలో ఉంది.

ఇక భాషా పరంగా హిందీ తర్వాత రెండో స్థానంలో బెంగాలీ (9.72 కోట్ల మంది), మూడో స్థానంలో మరాఠీ (8.30 కోట్ల మంది) ఉన్నారు. భాషా ప్రాతిపదికన తెలుగు ప్రజలు (8.11 కోట్ల మంది) నాలుగో స్థానంలో నిలిచారు.

తెలుగు భాషా వర్గం కింద 8.11 కోట్ల మంది ఉండగా.. వారిలో తెలుగు మాతృభాషగా ఉన్న వారు 8.09 కోట్ల మంది అయితే.. మిగతా 20 లక్షల మంది వదరి, ఇతర భాషలు మాతృభాషగా ఉన్న వారు ఉన్నారు.

భారతదేశానికి ఒక జాతీయ భాషగా హిందీ ఉండాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయ భాషలు, వాటి విస్తృతి మీద మరోసారి చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో భాషలు, వాటి విస్తృతి, ఆయా భాషల వర్గీకరణలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం.

Image copyright Getty Images

మొత్తం నమోదైన మాతృభాషలు.. 19,569

దేశంలో భాషలు, అవి మాట్లాడే ప్రజల సంఖ్యకు సంబంధించి 2011 జనగణన ఆధారంగా భారత రిజిస్ట్రార్ జనరల్ తాజాగా రూపొందించిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.

ఈ నివేదికలో మాతృభాష అంటే.. ఒక వ్యక్తి బాల్యంలో అతడితో అతడి తల్లి మాట్లాడే భాషగా నిర్వచించారు. ఒకవేళ బాల్యంలో తల్లి లేనట్లయితే ఆ వ్యక్తి కుటుంబంలో ప్రధానంగా మాట్లాడే భాషను మాతృభాషగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.

2011 జనగణన ప్రకారం.. దేశంలో 19,569 మాతృభాషలు నమోదయ్యాయి. భాషాశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా వీటిని పరిశీలించి.. మొత్తం 1,369 మాతృభాషలుగాను, మరో 1,474 'వర్గీకరించని' ఇతర మాతృభాషలుగానూ కుదించారు.

Image copyright Getty Images

పది వేల మంది పైగా జనం ఉన్న మాతృభాషలు 270

ఈ విధంగా వర్గీకరించిన మాతృ భాషలన్నిటినీ మళ్లీ వడపోసి.. 10,000 మంది, అంతకన్నా ఎక్కువ మంది మాట్లాడే 270 గుర్తించగల మాతృభాషలు జాబితాను రూపొందించారు.

ఆ 270 భాషలను.. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన 22 అధికారిక భాషల కింద మరోసారి వర్గీకరించి.. 123 మాతృభాషలు ఆయా ప్రధాన భాషల కింద చేర్చారు.

మిగిలిన 147 మాతృభాషలను 'షెడ్యూలులో చేర్చని' ప్రధాన భాషలుగా పేర్కొంటూ 99 భాషల కింద వర్గీకరించి మరో జాబితాలో చేర్చారు.

ఇక 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడే మాతృభాషలను.. వాటికి సంబంధించిన ప్రధాన భాషా వర్గాల్లో 'ఇతర భాషలు'గా పేర్కొన్నట్లు చెప్పారు.

జనగణన నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో 96.71 శాతం మంది 22 షెడ్యూల్డు భాషల్లో ఏదో ఒకటి తమ మాతృభాషగా చెప్పారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ మాతృభాషలుగా పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని 22 షెడ్యూల్డు భాషలు, వాటి కింద వర్గీకరించిన మాతృభాషలు, అవి మాట్లాడే జనాభా వివరాలు ఇవీ...
ప్రధాన భాష, ఆ భాష కింద వర్గీకరించిన మాతృభాషలు ఆయా మాతృభాషలు మాట్లాడేవారి సంఖ్య
అస్సామీ (ASSAMESE) 1,53,11,351
అస్సామీ (Assamese) 1,48, 16,414
ఇతర భాషలు (Others) 4,94,937
బెంగాలీ (BENGALI) 9,72,37,669
బెంగాలీ (Bengali) 9,61,77,835
చక్మా (Chakma) 2,28,281
హైజాంగ్/హాజాంగ్ (Haijong/Hajong) 71,792
రాజ్‌బన్సీ (Rajbangsi) 4,75,861
ఇతర భాషలు (Others) 2,83,900
బోడో (BODO) 14,82,929
బోడో (Bodo) 14,54,547
కచారీ (Kachari) 15,984
మేచ్/మేచ్చియా (Mech/Mechhia) 11,546
ఇతర భాషలు (Others) 852
డోగ్రీ (DOGRI) 25,96,767
డోగ్రీ (Dogri) 25,96,763
ఇతర భాషలు (Others) 4
గుజరాతీ (GUJARATI) 5,54,92,554
గుజరాతీ (Gujarati) 5,50,36,204
గుజ్రావ్/గుజ్రావు (Gujrao/Gujrau) 15,431
పఠానీ (Pattani) 16,510
పోంచీ (Ponchi) 13,812
సౌరాష్ట్ర/సౌరాష్ట్రీ (Saurashtra/Saurashtri) 2,47,702
ఇతర భాషలు (Others) 1,62,895
హిందీ (HINDI) 52,83,47,193
అవధి (Awadhi) 38,50,906
బఘతి/బఘతి పహారీ (Baghati/Baghati Pahari) 15,835
బఘేలీ/బఘేల్ ఖాందీ (Bagheli/Baghel Khandi) 26,79,129
బాగ్రీ రాజస్థానీ (Bagri Rajasthani) 2,34,227
బంజారీ (Banjari) 15,81,271
భరద్వాహీ (Bhadrawahi) 98,806
భగోరియా (Bhagoria) 20,924
భరామౌరీ/ గద్దీ (Bharmauri/Gaddi) 1,81,069
భోజ్‌పురి (Bhojpuri) 5,05,79,447
బిష్నోయ్ (Bishnoi) 12,079
బ్రజ్‌భాష (Brajbhasha) 15,56,314
బుందేలీ బుందేల్‌ఖాండీ (Bundeli Bundelkhandi) 56,26,356
చాంబేలీ/చామ్రాలీ (Chambeali/Chamrali) 1,25,746
ఛత్తీస్‌గఢీ (Chhattisgarhi) 1,62,45,190
చౌరాహీ (Churahi) 75,552
ధున్‌ధారీ (Dhundhari) 14,76,446
గర్వాలీ (Garhwali) 24,82,089
గవారీ (Gawari) 19,062
గోజ్రీ/గుజ్జారీ/గుజార్ (Gojri/Gujjari/Gujar) 12,27,901
హందూరీ (Handuri) 47,803
హారా/హారౌతీ (Hara/Harauti) 29,44,356
హర్యాన్వీ (Haryanvi) 98,06,519
హిందీ (Hindi) 32,22,30,097
జౌన్పురీ/జౌన్సారీ (Jaunpuri/Jaunsari) 1,36,779
కాంగ్రీ (Kangri) 11,17,342
ఖారీ బోలీ (Khari Boli) 50,195
ఖోర్తా/ఖోట్టా (Khortha/Khotta) 80,38,735
కుల్వీ (Kulvi) 1,96,295
కుమౌనీ (Kumauni) 20,81,057
కుర్మాలీ థార్ (Kurmali Thar) 3,11,175
లామానీ/లంబాడీ/లబానీ (Lamani/Lambadi/Labani) 32,76,548
లారియా (Laria) 89,876
లోధీ (Lodhi) 1,39,180
మగధి/మగహి (Magadhi/Magahi) 1,27,06,825
మాల్వీ (Malvi) 52,12,617
మందేలీ (Mandeali) 6,22,590
మార్వాడీ (Marwari) 78,31,749
మేవాడీ (Mewari) 42,12,262
మేవాటీ (Mewati) 8,56,643
నాగ‌పురియా (Nagpuria) 7,63,014
నిమాడీ (Nimadi) 23,09,265
పడారీ (Padari) 17,279
పహాడీ (Pahari) 32,53,889
పాల్ముహా (Palmuha) 23,579
పాంచ్ పర్గానియా (Panch Pargania) 2,44,914
పాండో/పాండ్వానీ (Pando/Pandwani) 15,595
పంగ్వాలీ (Pangwali) 18,668
పవాడీ/పొవాడీ (Pawari/Powari) 3,25,772
పూరణ్/పూరణ్ భాషా (Puran/Puran Bhasha) 12,375
రాజస్థానీ (Rajasthani) 2,58,06,344
సదన్/సద్రీ (Sadan/Sadri) 43,45,677
శిర్మౌడీ (Sirmauri) 1,07,401
సోండ్వారీ (Sondwari) 2,29,788
సుగాలీ (Sugali) 1,70,987
సుర్గుజియా (Surgujia) 17,38,256
సూర్జాపురీ (Surjapuri) 22,56,228
ఇతర భాషలు (Others) 1,67,11,170
కన్నడ (KANNADA) 4,37,06,512
బడగ (Badaga) 1,33,550
కన్నడ (Kannada) 4,35,06,272
కురుబ/కురుంబ (Kuruba/Kurumba) 24,189
ప్రాక్రిత/ప్రాక్రిత భాష (Prakritha/Prakritha Bhasha) 12,257
ఇతర భాషలు (Others) 30,244
కశ్మీరీ (KASHMIRI) 67,97,587
దాద్రీ (Dardi) 25,600
కశ్మీరీ (Kashmiri) 65,54,369
కీష్త్వారీ (Kishtwari) 39,748
సిరాజీ (Siraji) 1,24,896
ఇతర భాషలు (Others) 52,974
కొంకణి (KONKANI) 22,56,502
గోర్బోలీ/గోరు/గోర్వానీ (Gorboli/Goru/Gorwani) 50,259
కొంకణి (Konkani) 21,46,906
కుడుబి/కుడుంబి (Kudubi/Kudumbi) 17,209
మాల్వానీ (Malwani) 23,617
నావైత్ (Nawait) 13,123
ఇతర భాషలు (Others) 5,388
మైథిలి (MAITHILI) 1,35,83,464
మైథిలి (Maithili) 1,33,53,347
పూర్వీ మైథిలి (Purbi Maithili) 11,116
థారు (Tharu) 53,575
థాటీ (Thati) 1,65,420
ఇతర భాషలు (Others) 6
మలయాళం (MALAYALAM) 3,48,38,819
మలయాళం (Malayalam) 3,47,76,533
పానియా (Pania) 22,808
ఎరవ (Yerava) 26,563
ఇతర భాషలు (Others) 12,915
మణిపురి (MANIPURI) 17,61,079
మణిపురి (Manipuri) 17,60,913
ఇతర భాషలు (Others) 166
మరాఠీ (MARATHI) 8,30,26,680
ఆరె (Are) 53,879
కోలి (Koli) 13,809
మరాఠీ (Marathi) 8,28,01,140
ఇతర భాషలు (Others) 1,57,852
నేపాలీ (NEPALI) 29,26,168
నేపాలీ (Nepali) 29,25,796
ఇతర భాషలు (Others) 372
ఒడియా (ODIA) 3,75,21,324
భాట్రీ (Bhatri) 3,34,258
భూయియా/భూయాన్ [ఓరి] (Bhuiya/Bhuyan[Ori]) 32,126
భూమిజాలీ (Bhumijali) 34,651
దేశియా (Desia) 2,27,313
ఒడియా (Odia) 3,40,59,266
ప్రోజా [ఓరి] (Proja [Ori]) 1,56,354
రెల్లి (Relli) 12,969
సంబల్పురి (Sambalpuri) 26,30,381
ఇతర భాషలు (Others) 34,006
పంజాబీ (PUNJABI) 3,31,24,726
బాగ్రీ (Bagri) 16,56,588
భటేలీ (Bhateali) 23,970
బిలాస్పురీ కహ్లూరి (Bilaspuri Kahluri) 2,95,805
పంజాబీ (Punjabi) 3,11,44,095
ఇతర భాషలు (Others) 4,268
సంస్కృతం (SANSKRIT) 24,821
సంస్కృతం (Sanskrit) 24,709
ఇతర భాషలు (Others) 112
సంతాలీ (SANTALI) 73,68,192
కర్మాలీ (Karmali) 3,58,579
మహీలీ (Mahili) 26,399
సంతాలీ (Santali) 69,73,345
ఇతర భాషలు (Others) 9,869
సింధీ (SINDHI) 27,72,264
భాటియా (Bhatia) 22,409
కచ్చీ (Kachchhi) 10,30,602
సింధీ (Sindhi) 16,79,246
ఇతరాలు (Others) 40,007
తమిళం (TAMIL) 6,90,26,881
ఇరుల/ఇరులార్ మొళి (Irula/Irular Mozhi) 11,870
కైకడీ (Kaikadi) 25,870
కొరవ (Korava) 10,421
తమిళం (Tamil) 6,88,88,839
ఎరుకల/ఎరుకుల (Yerukala/Yerukula) 58,065
ఇతర భాషలు (Others) 31,816
తెలుగు (TELUGU) 8,11,27,740
తెలుగు (Telugu) 8,09,12,459
వదరి (Vadari) 1,98,020
ఇతర భాషలు (Others) 17,261
ఉర్దూ (URDU) 5,07,72,631
భన్సారీ (Bhansari) 22,806
ఉర్దూ (Urdu) 5,07,25,762
ఇతర భాషలు (Others) 24,063
నోట్: మణిపురి వర్గంలో మైథాయ్, నేపాలీ వర్గంలో గోర్ఖాలీ భాషలు ఉన్నాయి

నాలుగో స్థానంలో తెలుగు ప్రజలు

తెలుగు మాట్లాడే ప్రజలు 2011 జనాభా లెక్కల నాటికి 8.11 మంది ఉన్నారు. భాషా ప్రాతిపదికన నాలుగో స్థానంలో నిలిచారు.

నిజానికి 1961 జనాభా లెక్కల్లో హిందీ తర్వాత రెండో స్థానంలో తెలుగు నిలిచింది. కానీ.. ఆ తర్వాత పదేళ్లకు 1971 నాటికి స్వల్ప తేడాతో బెంగాలీ రెండో స్థానంలోకి రాగా.. తెలుగు మూడో స్థానానికి పడిపోయింది.

2001 వరకూ మూడో స్థానంలోనే ఉన్న తెలుగు ప్రజల సంఖ్య 2011 నాటికి నాలుగో స్థానానికి తగ్గిపోయింది. మరాఠీ ప్రజలు స్వల్ప తేడాతో మూడో స్థానానికి పెరిగారు.

2011 నాటికి తమిళులు (6.90 కోట్లు) ఐదో స్థానంలో, గుజరాతీలు (5.54 కోట్లు) ఆరో స్థానంలో, ఉర్దూ మాట్లాడేవారు (5 కోట్లు) ఏడో స్థానంలో ఉన్నారు.

కోటి మంది కన్నా తక్కువ మంది ఉన్న షెడ్యూల్డు భాషల్లో సంతాళీ, కశ్మీరీ, నేపాలీ, సింధీ, డోగ్రీ, కొంకణి, మణిపురి, బోడో, సంస్కృతం భాషలు ఉన్నాయి.

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన 22 అధికార భాషలు, అవి మాట్లాడే జనాభా సంఖ్యలు గత ఐదు దశాబ్దాలలో ఇలా ఉన్నాయి...
భాష 1971 1981 1991 2001 2011
1. హిందీ 20,27,67,971 (36.99) 25,77,49,009 (38.74) 32,95,18,087 (39.29) 42,20,48,642 (41.03) 52,83,47,193 (43.63)
2. బెంగాలీ 4,47,92,312 (8.17) 5,12,98,319 (7.71) 6,95,95,738 (8.30) 8,33,69,769 (8.11) 9,72,37,669 (8.03)
3. మరాఠీ 4,17,65,190 (7.62) 4,94,52,922 (7.43) 6,24,81,681 (7.45) 7,19,36,894 (6.99) 8,30,26,680 (6.86)
4. తెలుగు 4,47,56,923 (8.16) 5,06,24,611 (7.61) 6,60,17,615 (7.87) 7,40,02,856 (7.19) 8,11,27,740 (6.70)
5. తమిళం 3,76,90,106 (6.88) ** 5,30,06,368 (6.32) 6,07,93,814 (5.91) 6,90,26,881 (5.70)
6. గుజరాతీ 2,58,65,012 (4.72) 3,30,63,267 (4.97) 4,06,73,814 (4.85) 4,60,91,617 (4.48) 5,54,92,554 (4.58)
7. ఉర్దూ 2,86,20,895 (5.22) 3,49,41,435 (5.25) 4,34,06,932 (5.18) 5,15,36,111 (5.01) 5,07,72,631 (4.19)
8. కన్నడ 2,17,10,649 (3.96) 2,56,97,146 (3.86) 3,27,53,676 (3.91) 3,79,24,011 (3.69) 4,37,06,512 (3.61)
9. ఒడియా 1,98,63,198 (3.62) 2,30,21,528 (3.46) 2,80,61,313 (3.35) 3,30,17,446 (3.21) 3,75,21,324 (3.10)
10. మలయాళం 2,19,38,760 (4.00) 2,57,00,705 (3.86) 3,03,77,176 (3.62) 3,30,66,392 (3.21) 3,48,38,819 (2.88)
11. పంజాబీ 1,41,08,443 (2.57) 1,96,11,199 (2.95) 2,33,78,744 (2.79) 2,91,02,477 (2.83) 3,31,24,726 (2.74)
12. అస్సామీస్ 89,59,558 (1.63) ** 1,30,79,696 (1.56) 1,31,68,484 (1.28) 1,53,11,351 (1.26)
13. మైథిలి 61,30,026 (1.12) 75,22,265 (1.13) 77,66,921 (0.93) 1,21,79,122 (1.18) 1,35,83,464 (1.12)
14. సంతాళి 37,86,899 (0.69) 43,32,511 (0.65) 52,16,325 (0.62) 64,69,600 (0.63) 73,68,192 (0.61)
15. కశ్మీరీ 24,95,487 (0.46) 31,76,975 (0.48) # 55,27,698 (0.54) 67,97,587 (0.56)
16. నేపాలీ 14,19,835 (0.26) 13,60,636 (0.20) 20,76,645 (0.25) 28,71,749 (0.28) 29,26,168 (0.24)
17. సింధీ 16,76,875 (0.31) 20,44,389 (0.31) 21,22,848 (0.25) 25,35,485 (0.25) 27,72,264 (0.23)
18. డోగ్రీ 12,99,143 (0.24) 15,30,616 (0.23) # 22,82,589 (0.22) 25,96,767 (0.21)
19. కొంకణి 15,08,432 (0.28) 15,70,108 (0.24) 17,60,607 (0.21) 24,89,015 (0.24) 22,56,502 (0.19)
20. మణిపురి 7,91,714 (0.14) 9,01,407 (0.14) 12,70,216 (0.15) 14,66,705 (0.14) 17,61,079 (0.15)
21. బోడో 5,56,576 (0.10) ** 12,21,881 (0.15) 13,50,478 (0.13) 14,82,929 (0.12)
22. సంస్కృతం 2,212 (N) 6,106 (N) 49,736 (0.01) 14,135 (N) 24,821 (N)
మొత్తం (శాతం) 54,81,59,652 (97.14) 66,52,87,849 (89.23) 83,85,83,988 (97.05) 1,02,86,10,328 (96.56) 1,21,08,54,977 (96.71)

2011 జనగణన ఆధారంగా రూపొందించిన భాషలు, జనాభా నివేదిక ప్రకారం:

  • 1981లో అస్సాంలో అస్థిర పరిస్థితుల కారణంగా జనగణన నిర్వహించలేదు. దీనివల్ల ఆ ఏడాది షెడ్యూల్డు భాషల జనాభా లెక్కల్లో అస్సాం జనాభా లెక్కలు లేవు.
  • తమిళనాడుకు సంబంధించిన 1981 జనగణన రికార్డులు వరదల్లో కొట్టుకుపోవటంతో ఆ వివరాలు అందుబాటులో లేవు.
  • 1991లో జమ్మూకశ్మీర్‌లో అస్థిర పరిస్థితుల కారనంగా జనగణన నిర్వహించలేదు. దీంతో అప్పటి కశ్మీరీ, డోగ్రీ భాషలు మాట్లాడే వారి వివరాలు లేవు.

సంస్కృతం మాట్లాడేవాళ్లలో పదేళ్లకోసారి భారీ హెచ్చుతగ్గులు

దేశంలో కేవలం 24,821 మంది మాట్లాడుతున్నామని చెప్పిన సంస్కృతం.. షెడ్యూల్డు భాషల్లో చిట్టచివరిన 22వ స్థానంలో ఉంది. అయితే.. గత ఐదు జనగణనల్లో సంస్కృతం తమ మాతృభాషగా చెప్పిన వారి సంఖ్యలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.

ఈ భాష కింద 1971లో 2,212 మంది ఉంటే.. 1981లో 6,106కు పెరిగింది.

ఆ తర్వాత పదేళ్లలో 1991 నాటికి ఆ సంఖ్య ఒక్కసారిగా 49,736కు పెరిగిపోయింది. మళ్లీ 2001 నాటికి 14,135కు పడిపోయింది. 2011 జనాభా లెక్కల్లో అది 24,821 మందికి పెరిగింది.

ఇక దేశంలో జాతీయ స్థాయిలో రెండు అధికార భాషల్లో ఒకటైన ఇంగ్లిష్ షెడ్యూల్డులో చేర్చని జాబితాలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి