రోహిత్ శర్మ: టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ బ్రేక్

  • 5 అక్టోబర్ 2019
రోహిత్ శర్మ Image copyright Getty Images

టెస్టు మ్యాచుల్లో ప్రదర్శన గురించి ఎప్పుడూ విమర్శలు ఎదుర్కుంటూ వచ్చిన రోహిత్ శర్మ వాటన్నిటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనే మూడ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు.

భారత పిచ్, దక్షిణాఫ్రికా సగటు బౌలింగ్ అతడి సవాలును మరింత సులభంగా మార్చేయడంతో విశాఖపట్టణంలో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ సెంచరీలు చేశాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 127 రన్స్ చేశాడు. ఇది అతడి టెస్ట్ కెరీర్లో ఐదో శతకం.

Image copyright AFP/GETTY IMAGES

మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు. ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.

వసీం అక్రం 1996లో ఒక టెస్టులో 12 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.

2015లో అజింక్య రహానే తర్వాత భారత్ నుంచి ఒక ఆటగాడు ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి.

అయితే, రోహిత్ శర్మ కంటే ముందు విజయ్ హజారే, సునీల్ గావస్కర్(మూడు సార్లు), రాహుల్ ద్రవిడ్(రెండు సార్లు), విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఈ ఫీట్ చేశారు.

ముఖ్యంగా సునీల్ గావస్కర్ తర్వాత ఓపెనర్‌గా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు చేసిన ఘనత సాధించిన ఒకే ఒక భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)