భారత్ Vs దక్షిణాఫ్రికా: మయాంక్ అగర్వాల్ సెంచరీ.. పుజారా, కోహ్లీ అర్ధ శతకాలు..

  • 10 అక్టోబర్ 2019
మయాంక్ అగర్వాల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక మయాంక్ అగర్వాల్

దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఈ రోజు సెంచరీ కొట్టాడు. చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ శతకాలతో రాణించారు.

మయాంక్ 183 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తిచేశాడు. 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పుడు భారత్ స్కోరు 198 పరుగులు.

మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన మొదటి టెస్టులో సాధించిన విజయంతో టీమిండియా పుణెలో గురువారం ఉత్సాహంగా బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అర్ధ సెంచరీ చేసిన పుజారా

మొదటి టెస్టులో రెండు సెంచరీలతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ, ఈ రోజు 14 పరుగులకే వెనుదిరిగాడు.

రోహిత్ గత మ్యాచ్లో అసాధారణ ప్రదర్శనతో, 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా దిగిన మొదటి టెస్టులోనే రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు.

రోహిత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ సాధించాడు. అతడు 112 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి, నిష్క్రమించాడు.

మయాంక్, పుజారా, రోహిత్ ముగ్గురూ రబడ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యారు.

విరాట్ కోహ్లీ 63 పరుగుల(పది ఫోర్లు)తో, అజింక్య రహానే 18 పరుగుల(మూడు ఫోర్లు)తో నాటౌట్‌గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి

టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య