వీడియో: ఉప్పల‌పాడు పక్షుల పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి?

ప్రతి ఏటా ఖండాలు దాటుకుని వలస వచ్చే దేశదేశాల పక్షులకు ఉప్పలపాడు వల‌స‌ ప‌క్షుల సంర‌క్ష‌ణ కేంద్రం ఆవాసం. దీనికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వ‌చ్చింది. అయినా, అందుకు త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు లేక‌పోవ‌డంతో వ‌ల‌స‌ ప‌క్షుల సంఖ్యతో పాటు ప‌ర్యట‌కుల సంఖ్య‌ కూడా రానురాను త‌గ్గుతోంది.

ఆంధ్ర‌ప‌దేశ్ రాజ‌ధాని ప్రాంతానికి చేరువ‌లో గుంటూరు శివార్లలో ఉంటుంది ఉప్ప‌ల‌పాడు గ్రామం.

ఈ గ్రామంలోని మంచినీటి చెరువును ఒక‌ప్పుడు గ్రామ అవ‌స‌రాల‌కు వినియోగించేవారు. అయితే, వివిధ ర‌కాల వ‌ల‌స ప‌క్షులు సీజ‌న్ల వారీగా ఇక్క‌డికి వస్తుండటంతో ఆ చెరువు ఇప్పుడు ప‌క్షుల‌ సంరక్షణ కేంద్రంగా మారిపోయింది.

ఆస్ట్రేలియా, సైబీరియా, ద‌క్షిణాఫ్రికా, శ్రీలంక‌, నేపాల్ వంటి దేశాల‌తో పాటు హిమాల‌యాల నుంచి కూడా ప‌క్షులు ఆయా కాలాల‌ను బ‌ట్టి వ‌ల‌స వ‌స్తూ ఉంటాయి. దీంతో ఉప్పల‌పాడు ఎప్పుడూ ప‌క్షుల సంద‌డితో కళకళలాడుతుంటుంది.

సుమారు 10 ఎక‌రాల విస్తీర్ణంలో చెరువు, మ‌ధ్య‌లో లంక‌ల మాదిరిగా మ‌ట్టి దిబ్బ‌లు, వాటిపై తుమ్మ చెట్లు గుబురుగా పెరిగి ఉంటాయి. ఆ చెట్ల మీద వేలాది ప‌క్షుల సంద‌డి చూడానికి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)