నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ: ‘‘ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు’’

సంక్షేమానికి చేటు చేసే చెడ్డ విధానాలను తాను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తానని ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు.

ఈ విషయంలో తనకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించటం సరైనది కాదని ఆయన బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

‘‘మేం ప్రొఫెషనల్స్ మాత్రమే. మాకు ఏ రకమైన రాజకీయ నిబద్ధతలూ ఉండవు. మా వరకు చెడ్డ విధానాలు చెడ్డ విధానాలే. మంచి విధానాలు మంచి విధానాలే. మేం చెడ్డ విధానాలను వ్యతిరేకిస్తాం. ప్రతిఘటనను ఎవరు మొదలుపెట్టారన్న దాంతో మాకు సంబంధం లేదు’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)