వీడియో: ‘దళితుడిని పెళ్లాడిందని తల్లిదండ్రులే చంపేశారు’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ‘దళితుడిని పెళ్లాడిందని తల్లిదండ్రులే చంపేశారు’

  • 23 అక్టోబర్ 2019

హృదయ విహారి బండి

బీబీసీ కోసం

ఆ ఊళ్లో చీకటి పడింది. ఇళ్లలో దీపాలు వెలిగించారు. అలాగే, ఆ ఊరి చివర కూడా ఒక చితి వెలిగింది. ఆ చితిలో కాలుతున్నది, 17 ఏళ్ల అమ్మాయి చందన. ఆమె చావుకు, ఈ చితికి కారణం తను ఓ దళితుడిని ప్రేమించడమే! అతడి చేత తాళి కట్టించుకోవడమే! చందన.. బోయ కులానికి చెందిన కుటుంబం నుంచి వచ్చింది.

దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులే కన్నకూతురిని హత్య చేసి, పోలీసులకు తెలియకుండా కాల్చేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ, చందన ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

దీనిపై విచారణ చేసిన పోలీసులు చందనది హత్యేనని తేల్చారు. డీఎస్పీ ఆరిఫుల్లా కేసు వివరాలు మీడియాకు తెలిపారు. ''చందన తన తల్లిదండ్రులకు తెలియకుండా దలితుడిని వివాహం చేసుకోవడంతో పాటు తమ మాట వినకపోవడంతో తల్లి అమరావతి, తండ్రి వెంకటేశు ఇద్దరు కలిపి చందన గొంతు నులిమి చంపారు. ఆత్మహత్య గా చిత్రీకరించాలని చూశారు. రాత్రికి రాత్రే శవాన్ని మాయం చేయలని మృతురాలి పెదనాన్న, అతని కుమారుడి సహకారంతో ఊరి చివరకు శవాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అక్కడ ఆనవాళ్లు లేకుండా బూడిదను మాయం చేయాలని సంచుల్లో మూటకట్టి కర్నాటక రాష్ట్రంలోని క్యాసంబల్ల వద్ద ఒక చెరువులో పడేశారు. అక్కడ గ్రామస్థులు అడ్డుకోవడంతో విషయం బయట పడింది. బూడిద బస్తాలను స్వాధీనం చేసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. నిందితులను రిమాండ్‌కు తరలించాం'' అని డీఎస్పీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)