ఉప ఎన్నికల ఫలితాలు: 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ సీట్లు, రెండు రాష్ట్రాల్లోని 2 లోక‌సభ సీట్లలో ఎవరు గెలిచారు

సైదిరెడ్డి

ఫొటో సోర్స్, facebook/sanampudiSaidireddy

మహారాష్ట్ర, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 17 రాష్ట్రాల్లోని 51 శాసనభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

బిహార్‌లోని సమస్తిపూర్, మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.

ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 11 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగ్గా.. గుజరాత్‌లో 6, బిహార్, కేరళ రాష్ట్రాల్లో అయిదేసి శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.

తెలంగాణలో హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఉప ఎన్నిక జరిపారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు.

ఏ పార్టీకి ఎన్ని

* ఉత్తరప్రదేశ్‌లో ఉపఎన్నిక జరిగిన 11 నియోజకవర్గాల్లో బీజేపీ 7, సమాజ్‌వాది పార్టీ 3, అప్నాదళ్(సోనేలాల్ వర్గం) ఒకటి గెలిచాయి.

* గుజరాత్‌లోని ఆరు స్థానాల్లో 3 చోట్ల కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ విజయం సాధించాయి.

* కేరళలోని 5 సీట్లలో.. సీపీఎం 2, కాంగ్రెస్ 2, ముస్లింలీగ్ ఒకటి గెలుచుకున్నాయి.

* బిహార్‌లో 5 స్థానాలకు గాను రెండు చోట్ల రాష్ట్రీయ జనతాదళ్, ఒక స్థానంలో ఎంఐఎం విజయం సాధించాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, మరో స్థానంలో జేడీయూ అభ్యర్థి గెలిచారు.

* పంజాబ్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో మూడు కాంగ్రెస్, ఒకటి శిరోమణి అకాలీదళ్ గెలిచాయి.

* అస్సాంలో నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 3, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక స్థానం గెలిచాయి.

* తమిళనాడులోని రెండు సీట్లను అన్నా డీఎంకే గెలుచుకుంది.

* రాజస్థాన్‌లోని 2 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీలు చెరొకటి గెలిచాయి.

* హిమాచల్‌ప్రదేశ్‌లోని రెండు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది.

* సిక్కింలో రెండు బీజేపీ, ఒకటి సిక్కిం క్రాంతికారీ మోర్చా గెలిచాయి.

* ఛత్తీస్‌గఢ్‌లో ఉపఎన్నిక జరిగిన చిత్రకూట్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది.

* మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరిగిన జబువాలో కాంగ్రెస్ విజయం సాధించింది.

* మేఘాలయలో ఒక స్థానానికి ఎన్నిక జరగ్గా యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది.

* ఒడిశాలోని బిజేపూర్ స్థానాన్ని బిజూ జనతాదళ్ నిలబెట్టుకుంది.

* పుదుచ్చేరిలోని ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది.

* తెలంగాణలోని ఒక సీట్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.

* అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.

శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సతారాలో ఉదయన్‌రాజె భోంస్లే ఓటమి పాలయ్యారు.

రెండు రాష్ట్రాల్లో లోక్‌సభ ఉప ఎన్నికలు

మహారాష్ట్రలోని సతారా నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో ఎంపీగా గెలిచిన ఉదయన్‌రాజె భోంస్లే ఇటీవల తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో ఉదయన్‌రాజె ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నేత శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్ ఆయనపై విజయం సాధించారు.

బిహార్‌లోని సమస్తిపూర్‌‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014లో గెలిచిన లోక్‌జనశక్తి పార్టీ నేత రామచంద్రపాసవాన్ మృతితో అక్కడ ఉపఎన్నిక నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)