దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?

  • 27 అక్టోబర్ 2019
దీపావళికి పేలే ఈ టపాసులు Image copyright Getty Images

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పట్టణాలు, నగరాలు దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి.

దీపావళి రోజున జనం టపాకాయలు కాల్చడం కూడా సంప్రదాయంగా మారింది.

అయితే బాణాసంచా పేలుళ్లు భారత్‌లోకి ఎక్కడ నుంచి వచ్చాయి, అవి, ఎలా మొదలయ్యాయో మీకు తెలుసా?

భారత చరిత్రలో టపాకాయలు లేదా బాణాసంచా ప్రస్తావన ఉందా? ప్రాచీన గ్రంధాల్లో వీటి గురించి చెప్పారా?

బీబీసీ ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు ప్రముఖ ప్రొఫెసర్లు, చరిత్రకారులతో మాట్లాడింది.

ప్రాచీన గ్రంథాల్లో బాణాసంచా ప్రస్తావన

బాణాసంచా పేలుళ్లతో, శబ్దాలతో భయపెట్టేవారని, చెడు ఆత్మలను తరిమేసేవారని రుగ్వేదంలో గానీ, వేరే గ్రంథాల్లో గానీ ఎక్కడా రాయలేదు.

అయితే, ఇలాంటి వాటి గురించి భారత్‌లో ప్రాచీన కాలం నుంచీ అవగాహన ఉంది.

రెండు వేల ఏళ్ల క్రితమే ఇలాంటివి ఉన్నాయని పురాతన ఇతిహాసాల్లో చెప్పున్నారు.

కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కూడా బాణాసంచాకు వాడే లాంటి చూర్ణాల గురించి వివరణలు ఉన్నాయి. అవి చాలా త్వరగా మండేవని చెప్పారు.

ఆ చూర్ణం వల్ల మంటలు కూడా వచ్చేవని, దానిని ఒక గొట్టంలో నింపి బాణాసంచాలా ఉపయోగించేవారని వర్ణించారు.

Image copyright Bc

ఉప్పుతో టపాకాయలు

బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం తర్వాత ఎండిన భూమిపై ఒక ఉప్పు పొర లాంటిది లభిస్తుంది.

ఈ ఉప్పును మండే పౌడర్‌లా చేసేందుకు మెత్తగా నూరుతారు.

సల్ఫర్, బొగ్గు నూరి దీనికి తగిన పాళ్లలో కలిపితే దాని మండే గుణం పెరుగుతుంది.

ఉప్పు ఎక్కడా దొరకనప్పుడు ఒక ప్రత్యేక రకం కట్టెను కాల్చి బూడిద చేసి దానిని కడిగి అలా ఉపయోగిస్తారు.

కొన్ని వ్యాధులు నయం చేయడానికి వైద్య రంగంలో కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు.

దాదాపు మొత్తం దేశమంతా ఈ చూర్ణాన్ని, దానితో తయారైన మందుగుండును (సల్ఫర్, బొగ్గు) ఉపయోగిస్తారు. కానీ అది టపాకాయల్లో ఉపయోగించినట్లు కనిపించడం లేదు.

ఈ మందుగుండును శత్రువులకు వ్యతిరేకంగా మంటలు వచ్చేలా ఉపయోగించినట్లు కూడా చెప్పలేదు.

మందుగుండును మొట్టమొదట సిరియా రసాయన శాస్త్రవేత్త 1920లో ప్రస్తావించారు.

దీపావళికి ఇళ్లలో దీపాలు వెలిగించినా, ఆ రోజున బాణాసంచా పేలుస్తారని ఎక్కడా ప్రస్తావించలేదు. నేతితో పెట్టిన దీపాలు వెలిగించేవారని మాత్రం చెప్పారు.

మొఘలులు టపాసులు పేల్చేవారా?

చరిత్రకారులు బాబర్ 1526లో దిల్లీపై దాడి చేసినప్పుడు, అతడు ఉపయోగించిన ఫిరంగుల శబ్దాలు భారత సైనికులు ఉలిక్కిపడేలా చేశాయని చెబుతారు.

ఆలయాల్లో, నగరాల్లో బాణాసంచా పేల్చే సంప్రదాయం ఉంటే, బహుశా భారత సైనికులు అంత భయపడి ఉండేవారు కాదు.

మొఘలుల తర్వాతే టపాసులు పేల్చడం మొదలైందని కొందరు చెబుతారు. కానీ, అలా అనడానికి ఆధారాలు లేవంటున్నారు చరిత్రకారులు.

మొఘలులకు ముందే బాణాసంచా

టపాకాయలు పేల్చడం భారత్‌లో అంతకు ముందే ఉండేదని మొఘలుల చరిత్ర బోధించే ప్రొఫెసర్ నజఫ్ హైదర్ అంటారు.

అప్పట్లో బాణాసంచా పేల్చడం విస్తృతంగా ఉండేది కాదు. కానీ భారత్‌లోకి మొఘలులే వాటిని తీసుకొచ్చారనడం మాత్రం సరికాదు అన్నారు.

దారా షికోహ్ వివాహ చిత్రాల్లో జనం బాణాసంచా పేలుస్తూ కనిపిస్తారు. కానీ మొఘలులు భారత్ రాకముందే ఇక్కడ టపాకాయలు పేల్చేవారు అని ఆయన చెప్పారు.

ఫిరోజ్ షా సమయంలో కూడా చాలాసార్లు బాణాసంచా పేల్చిన సందర్భాలు ఉన్నాయి.

తర్వాత గన్ పౌడర్ భారత్ చేరింది. కానీ, మొఘలులకు ముందే ఇక్కడ బాణాసంచా ఉందని కచ్చితంగా చెప్పొచ్చు.

ఏనుగులను భయపెట్టి, దూరంగా తరిమేయడానికి, లేదా వేట కోసం వాటిని విస్తృతంగా ఉపయోగించేవారు.

మొఘలుల కాలంలో వివాహాలు, ఇతర వేడుకల్లో కూడా టపాసులు పేల్చడం, బాణాసంచా మెరుపులు కనిపించేవని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు