ఊరు దాటాలంటే వాగు దాటాలి.. వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ఊరు దాటాలంటే వాగు దాటాలి.. వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి

  • 7 నవంబర్ 2019

ఒడిషాలోని గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌లోని ఏడు గిరిజన గ్రామాలకు సరైన దారి లేదు. ఈ గ్రామాల ప్రజలు వేరే ఊరు వెళ్లాలంటే గెడ్డ(వాగు)ను దాటాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉధృతంగా ప్రవహించే నది గుండా వెళ్లాలి. ఏడాదిలో దాదాపు ఆరు నెలలు వారిది ఇదే పరిస్థితి.

మామిడి చెట్టే వంతెన

రాయగడ బ్లాక్‌ మొత్తం గిరిజన ప్రాంతమే. ఐటీడీఏ పరిధిలోకి వచ్చే ఈ బ్లాక్‌లో ఎటుచూసినా పచ్చని చెట్లు, పంట పొలాలు, కొండలు కనివిందు చేస్తాయి.

కానీ, ఈ కొండల నడుమ ఉండే లిమర్ సింగ్, తబతర్ సింగ్, పతిలొడ, గడజుబ, అల్జర్, కింతే సింగ్, దిబ్రిసాయి గ్రామాల పరిస్థితి దారణం.

వీరంతా బయటి ప్రపంచం చూడాలంటే పంట పొలాలు, కొండలు మధ్య ఉన్న ప్రమాదకర గెడ్డ దాటాలి. దాని కోసం ఒక చెట్టు ఎక్కాలి.

బయటకు వెళ్లడానికి వారికి ఉన్న ఏకైక మార్గం 60 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గెడ్డ ఒక్కటే కావడంతో బడికెళ్లే చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఈ దారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ గెడ్డ దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. గెడ్డను దాటడానికి వారంతా ఈ చెట్టునే నమ్మకున్నారు. ప్రవాహం దాటడానికి వారికి ఈ పెద్ద చెట్టు వంతెనలా పనిచేస్తోంది. ఏడాదిలో ఆరు మాసాలు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. దీంతో ఈ ఆరు నెలలూ ఆ మామిడి చెట్టే వారికి వంతెన. ఈ చెట్టు కొమ్మ గెడ్డపైన సగభాగం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)