ఆర్టీసీ కార్మికుల ‘చలో ట్యాంక్‌బండ్’ ఉద్రిక్తం.. అరెస్ట్‌లు, రాళ్లదాడి, లాఠీఛార్జ్

  • 9 నవంబర్ 2019
ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న వామపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు Image copyright Facebook/Y Vikram
చిత్రం శీర్షిక ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న వామపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు

ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌బండ్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలతో పాటు, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు, తెలంగాణ జేఏసీ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.

అయితే, ఉదయం నుంచే ఈ నిరసన కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన పార్టీ నాయకులను పోలీసులు నిర్బంధించారు.

Image copyright Facebook/Y Vikram

పలువురు నాయకులు, ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌వద్దకు చేరుకోగా వారిని అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

Image copyright Facebook/Y Vikram

ట్యాంక్ బండ్‌వైపు వెళుతున్న ఆర్టీసీ కార్మికులు, టీజేఏసీ, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.

కార్మికుల రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జిల్లో ఇరు వర్గాల్లో పలువురికి గాయాలు అయ్యాయి.

Image copyright facebook/TelanganaJanaSamithiParty
చిత్రం శీర్షిక ఇందిరా పార్కు వద్ద కోదండరాం, తదితరులను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు

ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ్‌పై రాకపోకల్ని నిలిపివేసిన పోలీసులు సాయంత్రం ఆంక్షలు ఎత్తేసి, రాకపోకలకు అనుమతి ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ట్రంప్ పదవి ఊడుతుందా.. అసలు అభిశంసన అంటే ఏంటి

‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్

World Kindness Day: ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు

అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం

సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి

తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్