ట్రంప్ పదవి ఊడుతుందా? అమెరికా అధ్యక్షుడి అభిశంసన ప్రక్రియ ఎలా సాగుతుంది? అసలు అభిశంసన అంటే ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్‌లోని హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో బహిరంగ విచారణలు బుధవారం ప్రారంభమయ్యాయి.
తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో తన విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు ట్రంప్ అక్రమంగా ఉక్రెయిన్ సాయం అభ్యర్థించారన్న ఆరోపణలు కేంద్రంగా ఈ ప్రక్రియ సాగుతోంది.
అసలు ట్రంప్‌పై అభిశంసన ఎందుకు జరుగుతోంది? ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలున్నాయా? అభిశంసనకు గురైతే ట్రంప్ పదవి కోల్పోతారా? అసలు ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది?.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చూద్దాం..
- ‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్
- ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్
ఆరోపణలివి..
వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌పై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ గతంలో ఓ ఉక్రెయిన్ గ్యాస్ సంస్థలో పనిచేశారు.
జో బిడెన్, హంటర్ బిడెన్‌ల ప్రతిష్ఠను దెబ్బతీసేలా విచారణలు చేపట్టాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ట్రంప్ ఒత్తిడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, ఇది చట్ట విరుద్ధమని డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆధారాలు ఉన్నాయా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో జులై 25న ట్రంప్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ గురించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఓ అజ్ఞాత ఫిర్యాదు అందింది.
గుర్తు తెలియని నిఘా అధికారి ఆ ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత వైట్ హౌస్ ఆ ఫోన్ సంభాషణ వివరాలను బహిర్గతం చేసింది. జో బిడెన్, హంటర్ బిడెన్‌లపై విచారణలు చేపట్టాలంటూ జెలెన్స్కీని ట్రంప్ కోరినట్లు అందులో ఉంది.
ఉక్రెయిన్‌కు సైనికపరమైన సాయాన్ని నిలుపుదల చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఫోన్ సంభాషణ జరిగింది.
బిడెన్‌పై విచారణ చేపడితేనే ఆ సాయాన్ని విడుదల చేస్తామని జెలెన్స్కీకి ట్రంప్ స్పష్టం చేశారని ఓ సీనియర్ అధికారి వాంగ్మూలం ఇచ్చారు. అయితే, వైట్ హౌస్ మాత్రం ఇది నిజం కాదని అంటోంది.
- అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా
- ట్రంప్ అభిశంసన: ప్రతినిధుల సభ తీర్మానం, ఇప్పుడేం జరగొచ్చు
ట్రంప్ ఏమని సమర్థించుకుంటున్నారు?
జెలెన్స్కీతో తన ఫోన్ కాల్ అంతా సవ్యంగా సాగిందని ట్రంప్ అంటున్నారు.
సైనికపరమైన సాయాన్ని అడ్డుపెట్టుకుని తాను జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చానన్న ఆరోపణ అవాస్తవమని చెబుతున్నారు.
డెమొక్రటిక్ పార్టీ నాయకులు, మీడియాలోని కొన్ని వర్గాలు పనిగట్టుకుని తనపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నమే అభిశంసన విచారణ అని అన్నారు.
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- ‘ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు.. ప్రపంచం కళ్లు మూసేసుకుంది’
అభిశంసన ప్రక్రియ ఎలా సాగుతుంది?
అధ్యక్షుడిని తొలగించడానికి అమెరికా చట్టసభ చేపట్టే రెండు దశల ప్రక్రియలో అభిశంసన అనేది మొదటిది.
దేశద్రోహం, అవినీతి, తీవ్రమైన తప్పులు, నేరాలు చేసినట్లు తేలితే అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చని అమెరికా రాజ్యాంగం చెబుతోంది.
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ అభిశంసన ప్రక్రియను మొదలుపెడుతుంది. మొదట అభిశంసన విచారణ జరుపుతుంది.
అధ్యక్షుడి నేరాలకు తగిన ఆధారాలుంటే, ఓటింగ్ నిర్వహిస్తారు.
ఇందులోని సభ్యులు సాధారణ మెజార్టీతో అభిశంసనలోని అధికరణాలను ఆమోదించినా, ట్రంప్ అభిశంసనకు గురవుతారు.
అయితే, అభిశంసనకు గురైనంత మాత్రాన అధ్యక్ష పదవి పోదు.
అప్పుడే రెండో దశ మొదలవుతుంది. అభిశంసనలో పేర్కొన్న అభియోగాలపై సెనేట్ విచారణ జరుపుతుంది. ఓటింగ్ నిర్వహిస్తుంది.
సభలో మూడింట రెండొంతుల మెజార్టీ సభ్యులు దోషి అని తేల్చితే, అధ్యక్షుడు పదవి కోల్పోతారు.
అయితే, ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ సొంత పార్టీదే ఆధిపత్యం. ఆయన పదవి కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ.
ఒకవేళ ట్రంప్ పదవి కోల్పోతే, ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారు.
అమెరికా రాజ్యంగం ప్రకారం.. అధ్యక్షుడు పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా, మరణించినా.. ఉపాధ్యక్షుడు ఆ స్థానంలో మిగతా పదవీ కాలాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయలేని 5 పనులు
- యూఎస్ఎస్ గ్రేబ్యాక్: 75 ఏళ్ల తర్వాత దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి జలాంతర్గామి
ఇదివరకు అభిశంసనలు జరిగాయా?
అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఇద్దరు అధ్యక్షులు మాత్రమే అభిశంసనకు గురయ్యారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్. అయితే, సెనేట్ దోషులుగా తేల్చకపోవడంతో ఆ ఇద్దరూ పదవులు కోల్పోలేదు. 1868లో ఆండ్రూ జాన్సన్ సెనేట్‌లో ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు.
1994లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్.. అభిశంసనకు గురవక ముందే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారు’.. గద్దె దించేందుకు అభిశంసన తీర్మానం పెట్టిన డెమోక్రాట్స్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు యూఎన్‌కు స్పష్టం చేసిన అమెరికా
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
- తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్
- "రామాలయ నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతాయి"
- సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి?
- ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం
- రాత్రంతా మేలుకునే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారెందుకు
- ఆర్ఎస్ఎస్తో గాంధీకి ఉన్న అసలు బంధం ఏమిటి?
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా
- ‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)