తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కార్మికుల నిరాహార దీక్షలు... అశ్వత్థామరెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులు

  • 16 నవంబర్ 2019
ఆర్టీసీ సమ్మె Image copyright Ashok

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారానికి 43వ రోజుకు చేరింది. జేఏసీ నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ నాయకులు, కార్మికులు నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు దిగిన వారిని కొన్ని చోట్ల పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

జేఏసీ కన్వీనర్ రాజిరెడ్డి తన నివాసంలో నిరాహార దీక్ష ప్రారంభిస్తుండగా ఉదయాన్నే పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, తాను నిరహార దీక్ష కొనసాగిస్తున్నట్లు రాజిరెడ్డి ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మె విషయం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని అశ్వత్థామరెడ్డి అన్నారు. తన నివాసంలో పలువురు కార్మికులతో కలసి దీక్ష కొనసాగిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో తాము దీక్ష చేస్తుంటే ప్రభుత్వం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. రాత్రి మూడు గంటల నుంచి తమ అపార్ట్‌మెంట్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారని చెప్పారు. ఇంట్లో నుంచే నిరవధిక నిరహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనం అంశాన్ని తాము తాత్కాలికంగా పక్కన పెట్టామని తెలిపారు. తమ పీఎఫ్‌ను కూడా ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు.

Image copyright Ashok

'ప్రభుత్వం పరిష్కరించలేక పెద్దది చేస్తోంది'

ఒక చిన్న పారిశ్రామిక వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించలేక కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తుందని ఎన్‌ఎంయూ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అశోక్ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''మేం సమ్మే విషయంపై ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చాం, ప్రభుత్వానికి కాదు. కానీ, సమ్మె మొదలైన రెండో రోజే ప్రభుత్వం మమ్మల్ని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. మా సమ్మె ప్రభుత్వం మీద కాదు యాజమాన్యం మీద. యాజమాన్యంతో చర్చలు విఫలమైతే లేబర్ కమిషన్ రావాలి. కానీ, ప్రభుత్వమే తన చేతులోకి తీసుకుంది. ఇది సరైన విధానం కాదు'' అని పేర్కొన్నారు.

Image copyright Rajireddy

అదనపు అఫిడవిట్ సమర్పించిన యాజమాన్యం

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో అదనపు అఫిడవిట్ సమర్పించారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె ప్రారంభించడమే చట్ట విరుద్ధమని, సమ్మెను చట్ట విరుద్ధమని ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

యూనియన్ నేతలు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, చర్చల ద్వారా డిమాండ్లను పరిష్కరించేందుకు కార్మిక శాఖ మధ్యవర్తిత్వం చేపట్టినప్పటికీ వారు ఓపిక పట్టలేదని కూడా కౌంటర్‌లో తెలిపారు.

ఇలాంటి సమ్మెలను ప్రోత్సహించకూడదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఆదేశాలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ తన అఫిడవిట్‌లో హైకోర్టును కోరారు.

'ఇదే సరైన సమయం... చర్చలే పరిష్కారం'

పారిశ్రామిక వివాదాలను చర్చల ద్వారా తప్ప మరేవిధంగానూ పరిష్కరించలేమని, చర్చలను వాయిదా వేసి ప్రభుత్వం కూడా చేసేదేమీ లేదని సీనియర్ జర్నలిస్టు జింకా నాగరాజు అన్నారు.

ఆర్టీసీ సమ్మెపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు పక్కన పెట్టి ఒక మెట్టు దిగివచ్చాయి, కాబ్టటి ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి రావాలి. వారిని చర్చలకు ఆహ్వానించాలి. ప్రభుత్వం, కార్మికులు పట్టువిడవకుండా ఎంతకాలం పోరాటం చేసినా చిరవకు రావాల్సిందే చర్చలకే. కానీ, చర్చలను వాయిదా వేసి ప్రభుత్వం చేసేదేమీ లేదు. ఇప్పటికే సమ్మె 43వ రోజుకు చేరింది. ఈ సమయంలో కూడా చర్చలు వాయిదా వేయడమంటే ప్రభుత్వ తీరును శంకించాల్సి వస్తుంది'' అని ఆయన విశ్లేషించారు.

Image copyright Ashok

''ఆర్టీసీ కార్మికుల డిమాండ్ న్యాయమైనదని ప్రజలు కూడా భావిస్తున్నారు. అందుకే సమ్మె వల్ల బాధపడుతున్నామని వారు ఉద్యమించడం లేదు. ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించాలి. ఇక ఏమాత్రం ఉపేక్షికుండా కార్మికులను చర్చలకు ఆహ్వానించాలి. చర్చలకు ఇదే సరైన సమయం'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

అభిప్రాయం: 'పౌరసత్వ బిల్లును పార్టీలు జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి'

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?

రాజ్యసభలో పౌరసత్వ బిల్లుకు వైసీపీ, టీడీపీ మద్దతు

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి

నానావతి కమిషన్: గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్

సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని

పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా.. శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా