Indian GDP: ఆరేళ్ళలో అధమంగా 4.5 శాతానికి ఎలా పడిపోయింది... దీని ప్రభావం ఎలా ఉంటుంది? - అభిప్రాయం

  • 30 నవంబర్ 2019
జీడీపీ గ్రోత్ Image copyright Getty Images

గత త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గ్రోత్ గణాంకాలు విడుదలయ్యాయి.

అనకున్నంతా అయింది. అంచనా నిజమేనని తేలింది. జీడీపీ గ్రోత్ రేటు పతనమై నాలుగున్నర శాతానికి చేరింది.

కొంతకాలం ముందు రాయిటర్స్ వార్తా సంస్థ ఆర్థికవేత్తలతో ఒక సర్వే చేసింది. అందులో ఈ రేటు ఐదు శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేశారు. కానీ వారు కూడా ఈ గణాంకాలు 4.7 శాతం వరకే ఉంటాయని భావించారు.

ఇప్పుడు వచ్చిన గణాంకాలు, శాస్త్రవేత్తల అంచనాల కంటే మరింత ఘోరంగా ఉన్నాయి. గత ఆరేళ్లలో అత్యంత ఘోరమైన గణాంకాలు ఇవే. ఇంతకు ముందు 2013లో జనవరి నుంచి మార్చి మధ్య ఈ రేటు 4.3 శాతం దగ్గర ఉంది.

ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, జీడీపీ పెరగాల్సినప్పుడు వరుసగా ఆరో త్రైమాసికం ఈ పతనం నమోదైంది. అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే, ఇండస్ట్రీ గ్రోత్ రేటు 6.7 శాతం పతనమై సగం పర్సెంట్ మాత్రమే ఉండిపోయింది.

ఇందులో కూడా మానుఫ్యాక్చరింగ్, అంటే పరిశ్రమల్లో తయారయ్యే వస్తువుల వృద్ధి స్థానంలో సగం పర్సెంట్ పతనం నమోదైంది. అటు వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4.9 నుంచి పడిపోయి 2.1 శాతానికి, సర్వీసెస్ రేటు కూడా 7.3 శాతం నుంచి పడిపోయి 6.8కి చేరింది.

Image copyright Getty Images

జీడీపీని ఎలా అర్థం చేసుకోవాలి?

జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. తెలుగులో దీనిని స్థూల జాతీయోత్పత్తి అంటారు.

దీనికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా, ఏదైనా, ఎంత తయారవుతున్నా, ఎవరైనా ఎంతైనా సంపాదిస్తున్నా, వాటన్నిటి పూర్తి మొత్తం అని అర్థం. ఆదాయాన్ని బట్టి చూస్తే దీన్ని లెక్కలేయడం అంత సులభం కాదు. అందుకే ఇక్కడ ఖర్చు ప్రకారం లెక్కలు వేయడం సులభంగా ఉంటుంది. ఏదైనా కొనడానికి అయిన మొత్తం ఖర్చు జీడీపీ అవుతుంది.

జీడీపీలో వృద్ధినే జీడీపీ గ్రోత్ రేట్ అంటారు. దాని ప్రకారం దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో లెక్కలు వేస్తారు. ఇక్కడ దానితోపాటు పర్ కాపిటా జీడీపీ అంటే దేశంలో తలసరి జీడీపీ ఎంతుంది, అనే గణాంకాలు కూడా జారీ చేస్తారు. ఈ తలసరి లేదా పర్ కాపిటా గణాంకాలు దిగువన ఉంటే, దేశ పౌరులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారి అవసరాలు తీర్చుకోవడం కష్టం అవుతోందని, లేదా అవసరాలు తీరడం లేదని నేరుగా అర్థం చేసుకోవచ్చు.

ఈ గణాంకాలు ఎక్కువగా ఉంటే పౌరుల జీవితం మెరుగ్గా ఉందని అర్థం. అంతమాత్రాన దేశంలో పేదరికం, పస్తులు లేవనే అర్థం రాదు. ఎందుకంటే అది సగటు అవుతుంది. అమెరికా సగటు పర్ కాపిటా జీడీపీ 55 వేల డాలర్లకు దగ్గరగా ఉంటుంది. కానీ అక్కడ కూడా దాదాపు 10 శాతం జనాభాకు పూటగడవడం కష్టంగా ఉంది.

Image copyright Getty Images

గణాంకాలు కలిగిస్తున్న ఆందోళన

భారత్‌లో తలసరి జీడీపీ ఈ ఏడాది మార్చిలో 2041 డాలర్లు అంటే సుమారు ఒక లక్ష 40 వేల రూపాయలు. ఈ వార్షికాదాయంతో చాలా మంది ముంబయి లాంటి నగరాలలో ఇప్పటికీ కుటుంబాలను పోషిస్తున్నారు.

కానీ ఇది సగటు. అంటే కొంతమంది దీనికంటే వేలు, లక్షల రెట్లు సంపాదిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. దేశ జనాభాలోని ఒక పెద్ద భాగం ఇందులో పదో వంతు, లేదా వందో వంతు భాగం కూడా సంపాదించలేకపోతోంది. కానీ అది సమానత్వంపై చర్చ, అది పూర్తిగా వేరే అంశం కూడా.

జీడీపీ త్రైమాసికం గణాంకాలు ఎందుకు ఇంత ఆందోళన కలిగిస్తున్నాయి అంటే, గత ఏడాదిన్నరలో ఇది అంతకంతకూ పడిపోతూ గత ఆరేళ్లలో అత్యంత బలహీనమైన స్థాయికి చేరుకుంది. దీనితోపాటూ మరో అతిపెద్ద ఆందోళన ఏంటంటే ప్రస్తుత స్థితిని మెరుగుపరిచే అవకాశం కూడా అనిపించడం లేదు.

చాలామంది ఆర్థికవేత్తలకు అనిపిస్తున్న దాని ప్రకారం ఈసారీ పతనం పెరగడం అంటే మొత్తం ఏడాదిలో దాన్ని మెరుగుపరచడం కష్టం అని అర్థం. అంటే వారు మొత్తం ఆర్థిక సంవత్సరం అభివృద్ధి వేగంలో ఇప్పుడే పతనం చూస్తున్నారు. అది కూడా, దీనిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఒకటి కాదు ఎన్నో చర్యలు చేపడుతున్న సమయంలో..

ప్రభుత్వం ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థికవ్యవస్థను రూపొందించాలని ఒక లక్ష్యం పెట్టుకుని కూచుంది. కాలుక్యులేటర్లో లెక్కలు చేస్తే, దానికి జీడీపీ గ్రోత్ రేట్ 12 శాతానికి పైన ఉండాలని తెలుస్తుంది. భారత్ గత పదేళ్ల నుంచీ 10 శాతం పర్సెంట్ గ్రోత్ కలలు కంటోంది. సాధారణంగా ఏడాదికి 7 నుంచి 8 మధ్య పెరుగుతూ కూడా వచ్చింది.

గత ఏడాది రేటు పతనమైప్పటికీ అది 7 శాతం ఉంది. కానీ, ఇప్పుడు ఇందులో మరింత పతనం వస్తే తీవ్రంగా ఆందోళన కలిగించే లక్షణం అవుతుంది.

Image copyright Getty Images

ఉద్యోగాలు పోతాయనే భయం

ఇక్కడ, ఆందోళనకలిగించే అంశం ఏంటంటే, ఖర్చుల్లో అత్యంత వేగంగా పతనం కనిపిస్తోంది. అది కూడా సామాన్యుల ఖర్చులు అంటే కంజుమర్ స్పెండింగ్‌లో ఉంది. అంటే జనం వస్తువులు కొనడం లేదు. ఖర్చులో కోతలు పెట్టుకుంటున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బును బాగా ఆలోచించి ఖర్చు పెడుతున్నారు.

దాని ప్రభావం వల్ల ఖర్చు లేకపోతే వస్తువుల అమ్మకం ఉండదు. అమ్మకాలు లేకుంటే, తయారీదారులు, వ్యాపారులు, కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. వీళ్లు కష్టాల్లో ఉండే వారి ఉద్యోగులు కూడా సమస్యల్లో ఉంటారు. జీతాలు పెరగవు. అశలు రాకపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాలు పోతాయనే భయం కూడా ఉంటుంది. చాలామంది ఉద్యోగాలు పోయాయి కూడా. చుట్టూ అలాంటి వార్తలు వినిపిస్తుంటే, ప్రజలు దేశంలో అభివృద్ధి జరగలేదనే నమ్మకంతో ఉన్నారనే అర్థం.

ఇప్పటివరకూ ప్రభుత్వం ఏం చేసిందో, అదంతా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే, డబ్బులు సిస్టంలోకి రావడం, పరిశ్రమలను వృద్ధి చెందితే అభివృద్ధి పెరుగుతుంది అనే దారిలోనే సాగింది.

కానీ రుణాలు చౌకగా ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో మాంద్యం లేదు అంటారు. ఆర్థికశాస్త్రం సిద్ధాంతాల ప్రకారం ఆమె మాట నిజమే కావచ్చు. నిర్వచనాల ప్రకారం ఇది మాంద్యం కాదు. దీనిని ఇంగ్లీషులో రిసెషన్ అంటారు. ఆర్థిక మంత్రి ఇది బహుశా స్లో- డౌన్ అన్నారు. స్లో డౌన్‌ను మందగమనం అటారు.

Image copyright Ani

మందగమనం వాదన

ఇప్పుడు ఈ స్లో డౌన్‌కు పరిష్కారం ఏంటనేదే ప్రశ్న. వినియోగదారుల మనసులో తాము జేబుపై చేయి వేసుకుని మరీ డబ్బులు ఖర్చు పెట్టచ్చు అనే నమ్మకం ఎలా కలిగిస్తారు. దానికి ఒకే ఒక దారుంది. జాబ్ మార్కెట్‌లో వృద్ధి తీసుకురావడం.

ప్రజలకు చేతుల్లో ఒక ఉద్యోగం ఉందని కనిపించినపుడు, తమ ముందు రెండు ఆఫర్లు కూడా ఉన్నాయని అనిపించినప్పుడు వారిలో ఒక ఉత్సాహం వస్తుంది. సంపాదించే ముందే ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు.

ఈ పరిస్థితి ఎలా వస్తుంది. దానికి నిపుణులు చాలా సూచనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు ఏ సూచన కనిపిస్తే దానిని అమలు చేసి చూసేద్దామనే మరో సమస్య కూడా కనిపిస్తోంది.

దానివల్ల షేర్ మార్కెట్ నడిచిపోతుండవచ్చు. కానీ ఆర్థికవ్యవస్థను ముందుకు నడపడం కష్టం.

ఇప్పుడు ఆర్థిక సలహా మండలిలో కొత్తగా వచ్చిన నిపుణులకు చాలా అనుభవం ఉంది. వారు చాలా పనికొచ్చే కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం కనీసం ఆ సూచనలపై అయినా దృష్టి పెట్టాలి.

Image copyright Getty Images

నోట్లరద్దు జరిగిన వెంటనే జీడీపీ గ్రోత్ రేటులో ఒకటి నుంచి ఒకటిన్నర శాతం పతనం రావచ్చని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంచనా వేశారు. ఇప్పుడు అది నిజమవుతూ కనిపిస్తోంది. కనీసం ఆయనతో మాట్లాడైనా ఈ వ్యాధికి చికిత్స ఏంటో అడగవచ్చు.

తాజా గణాకాలు వచ్చాక.. మాంధ్యం, మందమనం లాంటి సాంకేతిక పరిభాషలో, రిసెషన్ లేదా స్లో డౌన్ లాంటి పదాల తేడాలు చూపించడంలో పడిపోకుండా ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ప్రభుత్వం తీవ్రంగా అనుకోవాలి.

ఈ పరిస్థితి నుంచి బయటపడ్డానికి పార్టీలను పక్కనపెట్టి అందర్నీ కలుపుకుని పోవాలి. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే వైపు మందుకువెళ్లాలి.

(రచయిత సీఎన్‌బీసీ ఆవాజ్ మాడీ ఎడిటర్. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులతో 226కు చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం

కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు