భోపాల్ విషాదానికి 35 ఏళ్లు... ఫోటోలు చెప్పే విషాద చరిత

  • 2 డిసెంబర్ 2019
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW

యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన టన్నుల కొద్ది విష వాయువులకు భోపాల్ నగరంలోని ప్రజలు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషాద చరిత్రకు నేటితో 35 ఏళ్ళు,

విషవాయువులు విడుదలైన 24 గంటల్లోనే 3 వేల మందికి పైగా చనిపోయారని అంచనా. ఆ తరువాత మరి కొన్ని వేల మంది ఆ విషపు గాలులకు, అనంతర పరిణామాలకు బలయ్యారు. అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక విధ్వంసం.

బతికి ఉన్న వాళ్ళలో కూడా వేలాది మంది ఆ ప్రభావానికి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యారు. జీవితాంతం వెంటాడే వైకల్యాలను భరించారు.

ఆ రసాయన కర్మాగారం అవశేషాల చీకటి నీడల్లో చితికిపోయిన జీవితాలను ఫోటోగ్రాఫర్ జుడా పాసోవ్ తన కెమేరాలో బంధించారు.

ఇవీ చరిత్ర మరువని విషాదానికి చెరగని సాక్ష్యాలు.

భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక శ్వాసకోశ సమస్యలతో షకీర్ అలీ ఖాన్ ఆస్పత్రిలో ఎక్స్-రే తీయించుకుంటున్న ఈ వ్యక్తి యౌవనంలో విషవాయువు ప్రభావానికి గురయ్యారు.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక గ్యాస్ లీక్ వల్ల దాదాపు 20,000 మంది చనిపోయారని సామాజిక ఉద్యమకారులు చెబుతున్నారు. ఆ గాయాలు ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతున్నాయి.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక రసాయన కర్మాగారం గోడ పక్కనే ఉండే బ్లూమూన్ ప్రాంతవాసి. ఈ ప్రాంతంలో 1984లో 5,50,000 మంది... అంటే భోపాల్ జనాభాలో మూడింట రెండు వంతులు ఉండేవారు.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక అక్కడి నేలలో, భూగర్భ జలాల్లో రసాయనాల ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ భావిస్తున్నారు. అందుకే, నీటిని ఇలా పైపులతోనే సరఫరా చేస్తున్నారు.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక ఆనాటి విషవాయుల ప్రభావానికి ఇప్పటికీ పిల్లలు వైకల్యంతోనే పుడుతున్నారని బాధితులు చెబుతున్నారు.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక ప్రాచీ చుగ్‌కు మెదడు పెరగని వ్యాధి వచ్చింది. అది ఆమె తల్లి భోపాల్‌లో ఆ రాత్రి విషవాయులు పీల్చిన ఫలితం.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక భారతీయ సంప్రదాయ ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్న సంభావన ట్రస్ట్ క్లినిక్‌లో ఆవిరి చికిత్స
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక భోపాల్‌లోని చింగారీ ట్రస్ట్ క్లినిక్‌లో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు చికిత్స పొందిన చిన్నారులు చేతి ముద్రలు
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక భోపాల్‌లోని ఒరియా ప్రాథమిక పాఠశాలలో ఆడుకుంటున్న విద్యార్థులు. డామినిక్ లాపియెర్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఈ బడిని స్థాపించారు. లాపియెర్, జేవియర్ మోరో కలిసలి రచించిన 'ఫైవ్ పాస్ట్ మిడ్‌నైట్' పుస్తకం మీద వచ్చిన లాభాలతోనే ఈ పౌండేషన్ సంభావన క్లినిక్‌కు కూడా అండగా నిలిచింది.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక ఈ బడి ఉంటుందో లేదో తెలియని పరిస్థితి.
భోపాల్ విషాదం Image copyright JUDAH PASSOW
చిత్రం శీర్షిక బాధితలకు చెల్లించిన నష్టపరిహారం న్యాయంగానే ఉందని భారత సుప్రీం కోర్టు 1989లో ఆమోదించింది. కానీ, చెల్లించాల్సిన పరిహారాలు ఇంకా ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయాల్సి ఉంది. ఈ విషాదానికి 34 ఏళ్ళు అయిన సందర్భంగా గత ఏడాది భోపాల్‌ వీధుల్లో జరిగిన నిరసన ప్రదర్శన.

అన్ని ఫోటోలు: జుడా పాసోవ్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం