దిశ అత్యాచారం, హత్య కేసు ఫాస్ట్ ట్రాక్ విచారణకు ప్రత్యేక కోర్టు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • 4 డిసెంబర్ 2019
హైదరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం

హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ సమీపంలో దిశ అత్యాచారం, హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టును నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

నవంబర్ 27వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ అయిన ఆ యువతిపై శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్న నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఆమె స్కూటీకి పంక్చర్ వేసి, దానిని బాగు చేయిస్తామని చెప్పి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, చనిపోయిన తర్వాత పెట్రోలు, డీజిల్ పోసి కాల్చామని ఆ యువకులు తెలిపారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది.

యువతి పేరును ‘దిశ’గా పరిగణించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.

ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. రాష్ట్ర హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది.

Image copyright Govt of Telangana
చిత్రం శీర్షిక ప్రత్యేక కోర్టు నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖను అనుసరించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి ఎ సంతోష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

‘‘షాద్ నగర్ పోలీసు స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 784/2019 కింద నమోదైన దిశ అత్యాచారం, హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు’’ ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహబూబ్ నగర్ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జికి ఈ బాధ్యతల్ని అప్పగించారు.

నిందితులకు వారం రోజులు పోలీసు కస్టడీ

దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ షాద్ నగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ నలుగురు నిందితలు ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు గురువారం వీరిని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.

ఫేస్‌బుక్‌లో అశ్లీల కామెంట్లు.. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాగా, దిశ అత్యాచారం, హత్యకు సంబంధించి ఒక ప్రముఖ మహిళను కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో అశ్లీల, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు బుధవారం తెలిపారు.

సోమవారం ఈ కామెంట్లు చూసిన ఒక మహిళా డాక్టర్ రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశమని, నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామంలో నివశిస్తున్న అనిల్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని, అనంతరం తొమ్మిదవ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ‘ఎన్‌కౌంటర్’... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?