భారతదేశం ఆర్థిక మాంద్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉందా? - అభిప్రాయం

  • 15 డిసెంబర్ 2019
మంద్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉందా? Image copyright Getty Images

సరిగా దాచదు, స్పష్టంగా కనిపించదు

ఆ అందమైన తెరను అడ్డంగా వేసి కూర్చున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఏదో ఒక రోజు ఇలాంటి స్థితికి చేరుతుందని ఆ కవి ఎప్పుడు, ఎలా ఊహించాడో తెలీదు. ఇప్పుడు ఆర్థికవ్యవస్థ, మాంద్యం సంబంధం గురించి అర్థమయ్యేలా చెప్పడానికి వేరే సులభమైన దారులు కూడా లేవు.

అన్ని వైపుల నుంచి వచ్చే వార్తలు వస్తున్నాయి. వెలువడుతున్న గణాంకాలు అన్నీ, పరిస్థితులు సరిగా లేవనే చెబుతున్నాయి. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఐఐపీ అంటే పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు, వాహనాల అమ్మకాల నుంచి కంజ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఫ్రిజ్, టీవీ లాంటి వస్తువుల అమ్మకాల వరకూ పతనం, అక్కడక్కడా ఉద్యోగాలు పోయాయనే వార్తలు. రకరకాల పరిశ్రమలు, వ్యాపార సంస్థల ప్రకటనలు, అన్నీ పరిస్థితులు సరిగా లేవనే సంకేతాలే ఇస్తున్నాయి.

కానీ మీరు ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం అటూ ఇటూ తిరిగి మళ్లీ మొదటికే వస్తుంది. అప్పుడు ఒక అక్బర్-బీర్బల్ కథ గుర్తొస్తుంది.

అక్బర్ చక్రవర్తి ఒకసారి తన దర్బారులోని ఒకరికి ఆవును బహుమతిగా ఇచ్చాడు. దానిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. దానికి ఏదైనా జరిగితే ఒప్పుకోనని హెచ్చరించాడు. అంతే కాదు.. అది చచ్చిపోయిందని ఎవరైనా చెబితే వాళ్ల తల తీసేస్తా అన్నాడు.

దురదృష్టవశాత్తూ ఆ ఆవు, కొన్నిరోజుల తర్వాత చనిపోయింది. అది చక్రవర్తికి ఎవరు చెబుతారు? చెబితే ప్రాణాలు పోతాయని భయపడ్డారు. దాంతో ఆ బాధ్యత బీర్బల్ తీసుకున్నాడు. ఆయన "హుజూర్ మీరు బహుమతిగా ఇచ్చిన ఆవుందే.. అది చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. తినడం లేదు, తాగడం లేదు, కదలడం లేదు, శబ్దం కూడా చేయడం లేదు, అంతే కాదు ప్రభూ.. అది ఊపిరి కూడా తీసుకోవడం లేదు" అన్నాడు.

అక్బర్ చక్రవర్తి కోపంగా 'అంటే చనిపోయిందా?' అన్నారు. బీర్బల్ "అది నేనెలా చెప్పగలను ప్రభూ, అలా చెబితే మరణశిక్ష పడుతుంది కదా" అన్నాడు.

Image copyright Getty Images

మాంద్యం పేరు చెప్పడం నేరం

అక్కడ విషయం తెలిసింది, అయిపోయింది. బీర్బల్ పేరున మరో కథ నిలిచిపోయింది. కానీ ఇక్కడ పరిస్థితి అంత సులభంగా లేదు. ఇక్కడ జోకును కూడా సీరియస్‌గా తీసుకోవచ్చు. కాబట్టి... మాంద్యం పేరెత్తడమే నేరం అయిపోయింది.

సమస్య ఏంటంటే తెలుగులో మాంద్యం అన్నా, తిరోగమనం అన్నా వినడానికి ఒకేలా ఉంటాయి. చక్రం ఆగిపోయిందని అంటే, అప్పుడు విషయంలో దమ్ముంటుంది. అభివృద్ధి బండి వ్యతిరేక దిశలో నడుస్తోందని చెబితే అది, రాజకీయ నినాదంలా అనిపిస్తుంది.

నిజమేంటంటే, బండి వ్యతిరేక దిశలో నడిస్తే దానిని ఇంగ్లిష్‌లో 'రిసెషన్' అంటారు. ఏళ్ల నుంచీ దానిని తెలుగులో మాంద్యం అనే అనువదిస్తున్నారు. అంటే అలలు వెనక్కు తగ్గుతున్నప్పుడు రిసీడ్ అనేదే రిసెషన్.

ఏదైనా పరిశ్రమ, లేదా దేశంలోని పరిశ్రమల వ్యాపారం పెరగడానికి బదులు తగ్గుతోంది అంటే, ఆ పరిస్థితిలో అవి ఉన్నాయంటే, అది మాంద్యమే కదా?

Image copyright Getty Images

దేశంలో మాంద్యం అని ఎప్పుడు భావించాలి?

ఇప్పుడు ఐఐపీ అంటే పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వచ్చాయి. వాటిలో వరుసగా మూడో నెల పతనం నమోదైంది. కానీ సిద్ధాంతాల ప్రకారం ఇది మాంద్యం పరిభాషలోకి రాదు. కారణం, ఆంగ్లేయులు, అంటే ఇంగ్లండ్ ఆర్థికవేత్తలు మొత్తం దేశ జీడీపీ వరుసగా రెండు త్రైమాసికాలు పతనం కనిపిస్తే దానిని రిసెషన్ అంటే మాంద్యం అంటారని చెప్పారు.

అంటే 23 మే నుంచి 17 పరిశ్రమల సమూహాల గ్రోత్‌లో పతనానికి బదులు వాటి వ్యాపారంలో పతనం కనిపించింది. ఈ పతనం ఎక్కడో 20 శాతం వరకే ఉంది. కానీ మాంద్యం అని ప్రభుత్వం ప్రకటించాలంటే ఇంకా కనీసం ఆరు నెలలు అలాంటి పరిస్థితే కొనసాగాలి.

ఈసారీ అభివృద్ధిని పట్టాలెక్కించకపోతే మళ్లీ కనీసం ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి వరకూ అది మెరుగుపడుతుందనే ఆశలు వదులుకోవాల్సిందేనని దేశంలోని చాలామంది ప్రముఖ ఆర్థికవేత్తలు గత నెల ఒకేసారి చెప్పారు.

ఇక ఈ నెలలో ద్రవ్యోల్బణం 40 నెలల్లో ఎప్పుడూ లేనంత కొత్త ఎత్తులకు చేరుకుంది. ఐఐపీలో 3.8 పర్సెంట్ పతనం కూడా కనిపించింది. దాంతో ఈ దిగులు రెండు వైపులా పదునున్న ఒక కత్తిలా మారింది. ఆ కత్తికి హ్యాండిల్ కూడా విరిగిపోయింది. మనం దాన్ని ఎక్కడ పట్టుకున్నా తెగుతుందనే భయం ఉంటుంది.

ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, కాపిటల్ గూడ్స్‌ పతనం వేగంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అంటే దానికి స్పష్టంగా వినియోగం తక్కువైందని, కొత్త పెట్టుబడులకు డిమాండ్ కూడా లేదని అర్థం.

ఏ వస్తువులను ఇతర వస్తువుల ఉత్పత్తికి ఉపయోగిస్తారో వాటిని కాపిటల్ గూడ్స్ అంటారు. వాటిని అమ్మలేరు. అంటే మెషిన్లు, భవన నిర్మాణానికి పనికొచ్చే పెద్ద మెషిన్లు, పరిశ్రమలు లేదా ఆఫీసుల్లో ఫర్నిచర్ లాంటి వస్తువులు. ఈ రెండింటిలో పతనం మంచిది కాదు. ఇది సుదీర్ఘకాలం ఉంటే, అది ఒక అపశకునం. స్పష్టంగా చెప్పాలంటే గ్రహణ సంకేతం.

Image copyright Getty Images

ఇప్పుడు దేనిపై ఆశలు పెట్టుకోవాలి?

శుక్రవారం మీడియా సమావేశంలో ఆర్థికమంత్రి ఎకానమీని తిరిగి పట్టాలెక్కించడానికి ఎన్ని చేశారో అన్నీ లెక్కపెట్టించారు. ఆమె సలహాదారులు, కార్యదర్శులు కూడా తమ గణాంకాలు చూపించి అంతా బాగానే ఉందని నిరూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏదీ సరిగా కాకపోతే, అలాంటి స్థితిలో జోక్యం చేసుకోడానికి ఆర్థికమంత్రి పూర్తి సిద్ధంగా ఉన్నారు.

కానీ ఆర్థికవ్యవస్థపై ఎలాంటి ఆశలు పెట్టుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం అందరూ అటూఇటూ చూసుకున్నారు. ఇప్పుడు ఆర్థికవ్యవస్థ ఏ పరిస్థితిలో ఉంది? దానిని ఏమంటారు? దాని నుంచి బయటపడగలమని ఎప్పటివరకూ ఆశలు పెట్టుకోవచ్చు? అనే ప్రశ్నలకు కూడా సమాధానం దొరకలేదు.

ఏ పరిశ్రమలకైనా అవసరమైతే వాటికి సాయం అందించడానికి ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగా ఉందని ఆర్థికమంత్రి ఒక ప్రకటన అయితే చేశారు. కానీ, ఆ మొత్తం బడ్జెట్‌లోనే ఉంటుందని ఇప్పుడు ఎక్కువమంది నిపుణులు భావిస్తున్నారు.

ఇక బడ్జెట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందుకే, దానిని కూడా ఒక నమూనాగా చూడాలనేదే ఈ సంభాషణల ఒక ఉద్దేశం అని ఆర్థికమంత్రి అన్నారు. గత కొన్ని నెలల్లో ఆర్థికవిధానంలో ఎన్ని మార్పులు జరిగాయో, ఇక వాటి ప్రభావం చూడాల్సిన సమయం ఆసన్నమైంది. అయినా, బడ్జెట్‌పై మళ్లీ చాలా ఎక్కువ ఒత్తిడి ఉండబోతోంది.

ఇక అతిపెద్ద ప్రశ్నేంటంటే ఈ ఏడాది ప్రభుత్వం డబ్బు ఎక్కడనుంచి తీసుకొస్తుంది? ఒకవేళ, ఎక్కడనుంచైనా సమకూర్చుకున్నా, ఆ డబ్బును ఖర్చు చేస్తే, మనం ఈ మాంద్యం లాంటి స్థితి నుంచి విజయవంతంగా బయటపడగలమా? లేక అప్పటికే చికిత్సకు చాలా ఆలస్యం అయిపోయుంటుందా..?

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్: ఈఎస్ఐ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్.. అచ్చెన్నాయుడు పాత్ర ఎంత

‘మత స్వేచ్ఛ మాకు ముఖ్యం... ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తుతారు’

‘‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటూ బాధపడ్డ బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

పోలవరం గ్రౌండ్‌ రిపోర్ట్: జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి

ప్రెస్ రివ్యూ: 'ఏపీలో దొరకని మందు.. తెలంగాణకు కాసుల విందు'

మహిళా క్రికెట్ ప్రపంచ కప్: తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్