ఐపీఎల్ 2020 వేలం: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లకు అత్యధిక ధర, పాట్ కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా

 • 19 డిసెంబర్ 2019
`ఐపీఎల్ వేలం Image copyright '
చిత్రం శీర్షిక `

ఐపీఎల్ 2020 వేలం ఆసక్తికరంగా సాగింది. మేటి ఆటగాళ్ల కోసం 8 జట్లూ పోటీపడ్డాయి.

ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ.15.5 కోట్లకు సొంతం చేసుకుంది.

అతడి తర్వాత స్థానంలో మరో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇతడిని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

వికెట్ పడగానే సెల్యూట్ కొట్టి ఆకట్టుకునే విండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. అతడిని రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది.

వెస్టిండీస్-భారత్ సిరీస్‌లో బంతిని అవలీలగా బౌండరీ అవతలకు బాదుతూ టీమిండియా బౌలర్లను భయపెడుతున్న హెట్‌మెయర్ కోసం ఐపీఎల్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి దిల్లీ కాపిటల్స్ అతడిని రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది.

Image copyright EPA
చిత్రం శీర్షిక గ్లెన్ మాక్స్‌వెల్‌

ఐపీఎల్‌లో మొదట అమ్ముడైన విదేశీ ఆటగాడు క్రిస్ లిన్. ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ముంబై ఇండియన్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ కోసం జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి కోల్‌కతా అతడిని 5 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకుంది.

భారత ఆటగాడు రాబిన్ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ 3 కోట్లకు కొనుగోలు చేయగా, 50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ హనుమ విహారిపై ఏ జట్లూ ఆసక్తి చూపలేదు.

ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్ రాయ్‌ను దిల్లీ కాపిటల్స్ కోటిన్నరకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా ఆటగాడు ఆరాన్ ఫించ్ కోసం జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని 4 కోట్ల 40 లక్షలకు సొంతం చేసుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కోట్రెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8.5 కోట్లకు సొంతం చేసుకుంది

ఇంగ్లండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్‌ను దిల్లీ కాపిటల్స్ 1.5 కోట్లకు దక్కించుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను ఆర్సీబీ 10 కోట్లకు సొంతం చేసుకుంది.

ఇంగ్లండ్ క్రికెటర్ శామ్ కరన్‌ను చెన్నై 5.5 కోట్లకు దక్కించుకుంది.

పీయూష్ చావ్లా 6.75 కోట్లు

భారత క్రికెటర్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌ను రాజస్తాన్ రాయల్స్ 3 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా ఆటగాడు నాదన్ కౌల్టెర్ నైల్‌ను ముంబై ఇండియన్స్ 8 కోట్లకు కొనుగోలు చేయగా, ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ కేరీని దిల్లీ కాపిటల్స్ 2.4 కోట్లకు సొంతం చేసుకుంది.

భారత స్పిన్నర్ పీయూష్ చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ 6.75 కోట్లకు కొనుగోలు చేసింది.

సన్ రైజర్స్ జట్టులో భారత అండర్ 19 కెప్టెన్

విరాట్ సింగ్, అండర్ 19 కెప్టెన్ ప్రియం గార్గ్‌లను సన్ రైజర్స్ 1.90 కోట్లకు సొంతం చేసుకుంది.

హార్డ్ హిట్టర్ దీపక్ హుడాను పంజాబ్ 50 లక్షలకు కొనుగోలు చేయగా, రాహుల్ త్రిపాఠీని కోల్‌కతా 60 లక్షలకు దక్కించుకుంది.

డేవిడ్ మిల్లర్‌ను రాజస్థాన్ 75 లక్షలకు కొనుగోలు చేస్తే, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను సన్ రైజర్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది.

సౌరభ్ తివారీని ముంబై ఇండియన్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ వేలం సెకండ్ సెషన్‌లో మొదట అమ్ముడుపోని కొందరు ఆటగాళ్లను జట్లు కొనుకోలు చేశాయి.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ టామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది.

శ్రీలంక ఆటగాడు ఇసురు ఉదనను ఆర్సీబీ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టైను రాజస్థాన్ రాయల్స్ రూ.1 కోటికి సొంతం చేసుకుంది.

దక్షిణాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్‌ను ఆర్సీబీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్‌ను 4.8 కోట్లకు దిల్లీ కాపిటల్స్ కొనుగోలు చేసింది.

భారత ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మను దిల్లీ కాపిటల్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్‌ను కింగ్ ఎలెవన్ పంజాబ్ రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌ను ఆర్సీబీ 4 కోట్లకు దక్కించుకుంది.

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఓషానే థామస్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

మొదట అమ్ముడుకాని చాలామంది భారత యువ క్రికెటర్లు` చాలా మందిని సెకండ్ సెక్షన్ వేలంలో జట్లు కొనుగోలు చేశాయి.

అన్ కాప్డ్ ఆటగాళ్లకు డిమాండ్

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఆడని ఆటగాళ్లను సొంతం చేసుకోడానికి కూడా ఐపీఎల్ జట్లు పోటీపడ్డాయి.

వికెట్ కీపర్ అనుజ్ రావత్‌ను 80 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌ కోసం పోటీపడింది. చివరికి అతడిని 2.40 కోట్లకు సొంతం చేసుకుంది.

ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ సింగ్‌ను కూడా రాజస్థాన్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

ఇప్పటివరకూ అత్యధిక ఖరీదైన ఆటగాళ్లు

 1. పాట్ కమిన్స్-కోల్‌కతా - 15.50 కోట్లు
 2. గ్లెన్ మాక్స్‌వెల్-పంజాబ్-10.75 కోట్లు
 3. క్రిస్ మోరిస్-బెంగళూరు-10 కోట్లు
 4. షెల్డన్ కాట్రెల్-పంజాబ్-8.5 కోట్లు
 5. నాధన్ కౌల్టెర్ నైల్-ముంబై-8 కోట్లు
 6. హెట్‌మెయర్ -దిల్లీ-7.75 కోట్లు
 7. పీయూష్ చావ్లా-చెన్నై-6.75 కోట్లు
 8. శామ్ కరన్-చెన్నై-5.50 కోట్లు
 9. మార్గాన్-కోల్‌కతా-5.25 కోట్లు

ఇప్పటివరకూ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు

 1. టిమ్ సౌథీ(న్యూజీలాండ్)
 2. మార్టిన్ గప్తిల్(న్యూజీలాండ్)
 3. కొలిన్ డీ గ్రాండ్‌హోమే(న్యూజీలాండ్)
 4. మార్టిన్ గప్తిల్(న్యూజీలాండ్)
 5. కాలిన్ మున్రో(న్యూజీలాండ్)
 6. ఆడం జంపా(ఆస్ట్రేలియా)
 7. ఆండీ పెహ్లుఖ్వాయో(దక్షిణాఫ్రికా)
 8. ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)
 9. కుశాల్ పెరీరా(శ్రీలంక)
 10. షై హోప్స్(వెస్టిండీస్)
 11. ఎవిన్ లూయిస్(వెస్టిండీస్)
 12. నమన్ ఓజా(భారత్)
 13. స్టువర్ట్ బిన్నీ(భారత్)
 14. యూసఫ్ పఠాన్(భారత్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్

ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే సీఏఏపై బీజేపీ రాజకీయం: కేసీఆర్

అమరావతిలో జర్నలిస్టులపై నిర్భయ కేసు: ఆ రోజు మందడం స్కూల్లో ఏం జరిగింది?

కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు

CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు

కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది

టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు, 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు

కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'