144 సెక్షన్‌ను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా?

  • 21 డిసెంబర్ 2019
144 సెక్షన్ Image copyright AFP

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను నియంత్రించేందుకు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బెంగళూరు సహా కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. వందల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయని భావించినప్పుడు, నలుగురి కన్నా ఎక్కువ మంది ఒక్క చోట చేరుకుండా ఆంక్షలు విధించే అధికారాన్ని 144 సెక్షన్ ప్రభుత్వాలకు, స్థానిక పోలీసులకు కల్పిస్తోంది. ఆ ఆంక్షలను మీరితే క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు.

అయితే, నిరసనలను అణిచివేసేందుకు ఈ చట్టం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి.

వాక్ స్వాతంత్ర్యం, సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కులతో 144 సెక్షన్‌ను కలిపి చూసినప్పుడు అనేక సమస్యలు కనిపిస్తాయని రాజ్యాంగ నిపుణుడు గౌతమ్ భాటియా అంటున్నారు.

Image copyright Reuters

శాంతి భద్రతల నిర్వహణ కోసం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించే అవకాశం ప్రభుత్వానికి రాజ్యాంగం ఇస్తోంది.

అయితే, ఏది సహేతుకమన్న అంశంపై ఇదివరకే కోర్టుల్లో వాదోపవాదాలు నడిచాయి. హింసను గానీ, అశాంతిని గానీ ప్రేరేపించే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు విధించవచ్చని కోర్టులు నిర్దేశించాయి.

''ప్రభుత్వం ఆంక్షలు విధించకముందే, శాంతికి విఘాతం కలిగే ముప్పు చాలా స్పష్టంగా ఉందని చూపించాల్సి ఉంటుంది'' అని భాటియా అన్నారు.

''ఉదాహరణకు ఓ చోట కొంత మంది సమావేశమవుతున్నారనుకుందాం. విధ్వంసానికి పాల్పడాలని పిలుపునిస్తూ అందులో ప్రసంగాలు ఉండబోతున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వం ఆ సమావేశం జరగకుండా అడ్డుకోవచ్చు. కానీ, ఏదైనా సమావేశం హింసాత్మకంగా ఎప్పుడైనా మారొచ్చన్న భయంతో ఆంక్షలు విధించకూడదు. అలాంటప్పుడు అసలు హక్కులు ఉండి ఏ లాభం?'' అని భాటియా ప్రశ్నించారు.

Image copyright Reuters

గురువారం బెంగళూరులో 144 సెక్షన్ అమలైంది. అక్కడ ఇటీవలి నిరసనల్లో హింసేమీ చోటుచోసుకోలేదు. 144 సెక్షన్‌ను విధించేందుకు అవసరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడలేదని కొందరు వాదిస్తున్నారు.

''ఇది అధికార దుర్వినియోగం. ప్రాథమిక హక్కులను కాలరాయడమే. కోర్టుల్లో దీన్ని సవాలు చేయొచ్చు'' అని భాటియా అన్నారు.

144 సెక్షన్ అత్యవసర పరిస్థితుల్లో విధించేందుకు ఉద్దేశించిన చట్టమని, అది విధించేందుకు అవసరమైన పరిస్థితులు లేకున్నా తరచూ దీన్ని ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయని తక్షశిలా ఇన్‌స్టిట్యూషన్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ రీసెర్చ్ ఓ పరిశోధనా పత్రంలో అభిప్రాయపడ్డాయి.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును నిరాకరించడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన అవినాశ్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కేంద్ర బడ్జెట్ 2020: గత ఏడాది హామీల సంగతేమిటి? ఈసారి బడ్జెట్ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు?

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఆర్టికల్ 370 రద్దుపై ఈయూ పార్లమెంటులో చర్చలు.. భారత్‌ వ్యతిరేక ప్రతిపాదనలు

India vs New Zealand: టీ-20 మ్యాచ్ టై... ఉత్కంఠగా సాగిన సూపర్ ఓవర్‌లో న్యూజీలాండ్‌పై భారత్ విజయం

డోనల్డ్ ట్రంప్: ఎట్టకేలకు వెలుగు చూసిన మధ్యప్రాచ్య శాంతి ఒప్పంద ప్రణాళిక

సైనా నెహ్వాల్: భారతీయ జనతా పార్టీలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

కరోనా వైరస్‌కు చైనా వాక్సిన్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదం - ‘మా’లో ఏం జరుగుతోంది.. సమస్య ఎక్కడ మొదలైంది

నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..