CAA: నిరసనకారుల రాళ్ల దాడి నుంచి పోలీసులను కాపాడిన ముస్లిం మహిళ

  • 22 డిసెంబర్ 2019
ముస్లిం మహిళ పోలీసులను కాపాడింది Image copyright Ani

భారత కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అహ్మదాబాద్ నగరంలో రోడ్లపై గుమిగూడిన జనం పోలీసులపై రాళ్లు రువ్వారు.

వ్యతిరేక ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారినపుడు, అక్కడున్న పోలీసులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు.

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోలో జనం పోలీసులపై రాళ్లు రువ్వడం, ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీసులు పారిపోతూ కనిపిస్తారు.

రాళ్ల నుంచి కాపాడుకోవడానికి పోలీసులు దుకాణాలు, చిన్న తోపుడుబండ్ల వెనక్కు వెళ్లి దాక్కున్నారు.

వందల మంది ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.

చిత్రం శీర్షిక ఫరీన్ బానో

పోలీసులను మా ఇంట్లోకి తీసుకొచ్చాం: ఫరీన్

అదే ప్రాంతంలో ఉన్న కొంతమంది మహిళలు కూడా నిరసనకారుల దాడి నుంచి పోలీసులను కాపాడారు.

"జనం పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. కొంతమంది పోలీసులు దగ్గరే ఉన్న ఒక షాపులో దాక్కోవడానికి వెళ్లారు. మా ఇంటి దగ్గరున్న కొంతమంది ఆ పోలీసులను లోపలికి తీసుకొచ్చారు" అని స్థానికురాలు ఫరీన్ బానో బీబీసీకి చెప్పారు.

"మేం పోలీసుల గాయాలకు ఐస్ పెట్టి చికిత్స చేశాం. వారికి కాస్త ఉపశమనం లభించింది. గాయపడ్డ వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. ఆమెను కూడా ఇంట్లోకి తీసుకొచ్చాం" అని ఫరీన్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

"ఆ మహిళా కానిస్టేబుల్ చాలా భయపడిపోయింది. ఆమె తలకు రాయి తగిలింది. ఏడుస్తోంది. మరో పోలీస్ అధికారి చేతికి రాయి తగిలింది. ఆయన కూడా బెదిరిపోయి ఉన్నారు. మేం వాళ్లను ఊరడించాం" అన్నారు.

మరో పోలీస్ అధికారి తన తలపై పెద్ద గాయమవడంతో రక్తం కారుతోందని చెప్పారు. మేం అక్కడ దూది పెట్టి రుమాలుతో కట్టుకట్టాం అని ఫరీన్ చెప్పారు.

"ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్‌ను మేం మా ఇంట్లోనే ఉంచాం. ముగ్గురినీ ఇంట్లో వెనక ఉన్న గదిలోకి పంపించి వేశాం. ఎందుకంటే వాళ్లు చాలా భయపడిపోయి కనిపించారు. పరిస్థితి కుదుటపడ్డాక గాయపడ్డ పోలీసులు వారి ఇళ్లకు వెళ్లిపోయారు" అన్నారు.

మన ముందు ఎవరున్నారు అనేది తర్వాత, మనం మానవతా దృష్టితో వాళ్లకు సాయం చేయాలి అన్నారు ఫరీన్ బానో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

#Live ఏపీకి మూడు రాజధానులు.. పాలనకు విశాఖ, అసెంబ్లీకి అమరావతి, కర్నూలులో హైకోర్టు

థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు

మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు

‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లల ఫొటో చూసి ఆగిపోయా’ - టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్

భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ

భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా, జంతువులు కూడా నొప్పితో బాధపడుతాయా

వాతావరణ మార్పు: రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు గత దశాబ్దంలోనే..

పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన