IND Vs WI: కటక్ వన్డేలో వెస్టిండీస్‌పై 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

  • 22 డిసెంబర్ 2019
విరాట్ కోహ్లీ Image copyright Reuters

భారత్-వెస్టిండీస్ మధ్య కటక్‌లో జరిగిన చివరి, నిర్ణయాత్మక వన్డేలో భారత్ 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

మరో 9 బంతులు మిగిలుండగానే 316 లక్ష్యాన్ని అందుకుంది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ(85) అవుటైనా రవీంద్ర జడేజా(39), శార్దూల్ ఠాకూర్(17) జట్టుకు విజయాన్ని అందించారు. నాటౌట్‌గా నిలిచారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది.

వెస్టిండీస్ బౌలర్లలో కీమో పాల్ 3 వికెట్లు పడగొట్టగా కాట్రెల్, హోల్డర్, జోసెఫ్ తలో వికెట్ తీశారు.

విరాట్ కోహ్లీ వీర విహారం

కెప్టెన్ విరాట్ కోహ్లీ 71 బంతుల్లో 85 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం విశేషం.

గ్రౌండ్ షాట్సే ఆడిన కోహ్లీ మొత్తం 9 ఫోర్లు కొట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు.

286 పరుగుల దగ్గర విరాట్ కోహ్లీ ఆరో వికెట్‌గా అవుట్ అయ్యాడు.

85 పరుగులు చేసిన తర్వాత పాల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

జట్టు స్కోరు 228 పరుగుల దగ్గర కేదార్ జాధవ్(9) కాట్రెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

201 స్కోరు దగ్గర రిషబ్ పంత్ నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

పంత్(7) కూడా పాల్‌ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

188 పరుగుల దగ్గర భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

శ్రేయస్ అయ్యర్ 7 పరుగులకే కీమో పాల్ బౌలింగ్‌లో జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

Image copyright FACEBOOK/KL RAHUL
చిత్రం శీర్షిక కేఎల్ రాహుల్

167 దగ్గర భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

రాహుల్ కూడా కీపర్ హోప్‌కే క్యాచ్ ఇచ్చాడు.

122 పరుగుల దగ్గర భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

ఓపెనర్ రోహిత్ శర్మ 63 పరుగులకు ఔట్ అయ్యాడు. హోల్డర్ బౌలింగ్‌లో కీపర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 16వ ఓవర్లో వంద పరుగుల మైలురాయిని చేరుకుంది.

Image copyright Getty Images

వెస్టిండీస్ 315/5

టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

వెస్టిండీస్ ఆటగాళ్లలో దూకుడుగా ఆడిన నికొలస్ పూరన్(83) కెప్టెన్ కీరన్ పొల్లార్డ్(74 నాటౌట్) జట్టు స్కోరును 300 దాటించారు.

షై హోప్ 42 పరుగులు చేయగా, రోస్టన్ చేజ్ 38, హెట్‌మెయర్ 37 పరుగులు చేశారు.

144 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన జట్టును పూరన్, పొల్లార్డ్ ఆదుకున్నారు. జట్టు స్కోరును 279 వరకూ తీసుకెళ్లారు.

64 బంతుల్లో 89 పరుగులు చేసిన పూరన్ 3 సిక్సర్లు, 10 ఫోర్లు కొట్టగా, 51 బంతుల్లో 74 పరుగులు చేసిన పొల్లార్డ్ 7 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు.

పూరన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన హోల్డర్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో నవదీప్ శైనీ రెండు విగెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు ఒక్కో వికెట్ లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి

ఉత్తర కొరియా భారీ ఎత్తున రిసార్టులు, స్పాలు ఎందుకు నిర్మిస్తోంది

కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా.. చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా

INDvsNZ రెండో టీ20: న్యూజీలాండ్‌పై భారత్ విజయం

‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్‌పింగ్‌ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు

తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం.. ఫలితాలు ఏం చెబుతున్నాయి

రోడ్డుపై వేగంగా వెళ్లడానికి కారులో అస్థిపంజరాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు

పూజా హెగ్డే: ‘నడుము చూపిస్తే తప్పులేదా? కాళ్లు చూపిస్తే తప్పా?.. ఇలాంటి వాళ్లను ఎడ్యుకేట్ చేయడం నా బాధ్యత’

పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్