వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి: ఎన్‌ఆర్‌సీకి మేము వ్యతిరేకం, ఏపీలో అమలు చేయం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, fb/ysjagan

జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్‌సీ) అమలుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్‌ఆర్‌సీని రాష్ట్రంలో అమలు చేయబోమని తెలిపారు. కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు.

'ఎన్‌ఆర్‌సీ అమలు గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా గతంలో ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫునే ఆయన ఆ ప్రకటన చేశారు. దానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కచ్చితంగా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగానే ఉంటాం. దానికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదని ముస్లింలకు మరోసారి హామీ ఇస్తున్నాను" అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం అస్సాంలో మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేసే అవకాశం ఉందంటూ నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు పార్లమెంటులో వైసీపీ, టీడీపీలు మద్దతు తెలిపాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఎన్‌ఆర్‌సీని ఏపీలో అమలు చేయబోమని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)