ఈ కుక్క మృతదేహం 18 వేల ఏళ్లుగా చెక్కుచెదరలేదు

  • 26 డిసెంబర్ 2019
18 వేల ఏళ్ల నాటి కుక్క Image copyright LOVE DALEN

మృతదేహాలను కొన్ని రోజులు లేదా నెలల వరకూ ఫ్రీజ్ చేసి ఉంచొచ్చు. కానీ సైబీరియాలో 18 వేల ఏళ్ల నాటి ఒక కుక్క మృత దేహం దొరికింది. అది ఇన్నేళ్లనుంచీ మంచుతో కప్పుకుపోయి ఉండిపోయింది.

అయితే, పరిశోధకులు ఈ మృతదేహం కుక్కదా లేక తోడేలుదా అని ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ కుక్క చనిపోయినప్పుడు దాని వయసు రెండేళ్లని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.Image copyright SERGEY FEDOROV

రేడియోకార్బన్ థెరపీ ద్వారా చనిపోయినప్పుడు ఈ కుక్క వయసు ఎంత, అది ఎన్నేళ్ల నుంచి మంచు అడుగున కూరుకుపోయుంది అనేది తెలుసుకున్నారు.

వేల ఏళ్లపాటు మంచు అడుగున ఉన్నప్పటికీ ఈ కుక్క వెంట్రుకలు, ముక్కు, దంతాలు చెక్కుచెదరలేదు.

ఈ కుక్క మృతదేహం తోడేళ్లు, ఆధునికకుక్కల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే ఒక గొలుసులా పనిచేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Image copyright SERGEY FEDOROV

స్వీడన్ సెంటర్ ఫర్ పెలియోజెనెటిక్స్‌లో పరిశోధకులు డేవ్ స్టెంటన్ సీఎన్ఎన్‌తో "ఈ కుక్క డీఎన్ఏ సీక్వెన్సింగ్ వల్ల ఇది తోడేళ్లకు సమానమైన పూర్వాపరాలు ఉన్న జాతికి సంబంధించిన కుక్క అని తెలిసింది" అన్నారు.

"మాకు దీని కళేబరం నుంచి చాలా సమాచారం లభించింది. దాని ఆధారంగా మనం ఆ కుక్క ఏ జాతికి చెందిందో తెలుసుకోవచ్చు" అన్నారు.

అదే సెంటర్‌లో మరో పరిశోధకుడు డెలన్ ఒక ట్వీట్‌లో "ఈ కళేబరం తోడేలు పిల్లదా, లేక అత్యంత పురాతన కుక్క జాతికి సంబంధించినదా? అని ప్రశ్నించారు.

Image copyright LOVE DALEN

ఈ కుక్కకు 'డోగర్' అనే పేరు పెట్టారు. అంటే, యాకూట్ భాషలో స్నేహితుడు అని అర్థం

ఆధునిక కుక్కలను తోడేళ్ల వంశానికి చెందినవిగా భావిస్తారు. కానీ కుక్క ఎప్పుడు పెంపుడు జంతువుగా మారింది అనే అంశంపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది.

2017లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కుక్కలు 20 నుంచి 40 వేల ఏళ్ల క్రితం పెంపుడు జంతువులుగా మారాయని తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత

‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు ఐసీజే ఆదేశం

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందా

రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా

బెజోస్ ఫోన్ హ్యాకింగ్: అమెజాన్ బిలియనీర్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?

రాజధాని రగడ-రాజకీయ క్రీడ : ఎడిటర్స్ కామెంట్