పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- అపర్ణా సింగ్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఆరాధించే స్వతంత్ర ప్రాచీన సంప్రదాయాలను పౌరసత్వ సవరణ చట్టం పునఃస్థాపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యతిరేకతల్లో రెండు లోపాలు ఉన్నాయి.
మొదటిది, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోంది.
పార్లమెంటులో ఆరు గంటల చర్చ తర్వాత ఈ బిల్లును చట్టం చేసినపుడు, ఇలా దానిని వ్యతిరేకించడంలో ఎలాంటి అర్థం లేదు. బీజేపీయేతర పార్టీలు నాలుగు గంటలు సభలో చర్చించాయి. ఇది 1976లో కొన్ని నిమిషాల్లోనే రాజ్యాంగంలో రెండు మాటలు జోడించడం లాంటి అలాంటి సవరణ కాదు.
ఇక రెండోది, ఈ వ్యతిరేకత విపక్షాల స్థూల అవకాశవాద ప్రదర్శనే. 2003లో అప్పటి ప్రధానమంత్రి పాకిస్తాన్‌లో మైనారిటీలపై వేధింపులు జరుగుతున్నాయనే విషయాన్ని పార్లమెంటులో అంగీకరించారు. మన్మోహన్ సింగ్ తన ప్రసంగాన్ని అమలు చేయాలని కోరుతూ 2012 మే 23న ప్రకాశ్ కారత్ ఆయనకు ఒక లేఖ రాశారు.
చారిత్రక పరిస్థితుల వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఉంటున్న మైనారిటీలు హింసను భరించాల్సి వస్తోందని సీపీఎం కూడా అంది. ఆర్థిక కారణాలతో వచ్చిన శరణార్థులకు, అణచివేతకు గురైన శరణార్థులకు తేడా ఉందని చెప్పింది. కానీ ఈరోజు విపక్షాలు వ్యతిరేక మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
సీఏఏ, ఎన్ఆర్సీ వాస్తవాలను రాజ్యాంగ దర్పణంలో చూస్తుండడానికి కారణం ఇదే.
ఫొటో సోర్స్, Getty Images
ఎన్ఆర్సీ చరిత్ర ఏమిటి?
ఎన్ఆర్సీపై చర్చించాలంటే మనం ఆంగ్లేయులు అస్సాం రెవెన్యూను పెంచడానికి పొరుగు దేశాల(ప్రస్తుతం బంగ్లాదేశ్) నుంచి ముస్లింలను భారీ సంఖ్యలో అక్కడ వ్యవసాయం చేయడానికి పిలిపించిన ఆ కాలంలోకి వెళ్లాలి. కానీ, పొలం దున్ని జీవించాల్సిన బంగ్లాదేశ్ ముస్లింలు, వాటిని కబ్జా చేయడం తమ హక్కుగా భావించారు.
"ఇంత భారీ సంఖ్యలో వలసదారులు రావడం వల్ల అస్సాం లక్షణాలను శాశ్వతంగా మారిపోతాయని, స్థానికుల నాగరికత నిర్మాణానికి అది నష్టం కలిగిస్తుందని" 1931లో జనభాలెక్కల అధికారి సీఎస్ మ్యూలర్ అన్నారు.
ఆ పరిస్థితి వల్ల 1936 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం లీగ్‌కు ప్రయోజనం లభించింది. ఆ తర్వాత అస్సాంలోకి చొరబాటుదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అస్సాంలో బోర్డోలై ప్రభుత్వం ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం తన హోంశాఖ ద్వారా 1951లో జనాభాగణనలో ఎన్ఆర్సీ గురించి చెప్పింది. ఎందుకంటే అప్పటికి 1946 ఫారినర్స్ చట్టం జరగలేదు. దాంతో పాకిస్తానీలను విదేశీయులుగా ప్రకటించేందుకు, ఎలాంటి సెక్షన్లూ ఉండేవి కావు. దాంతో ఎన్ఆర్సీ క్షేత్రస్థాయిలో అమలుకాలేకపోయింది.
బొర్డోలై మృతి తర్వాత సంతృప్తిపరిచే రాజకీయాలు చేసిన కాంగ్రెస్ కూడా ఎన్ఆర్సీని పక్కనపెట్టింది. అక్రమ చొరబాటుదారుల వల్ల సీపీఐ, టీఎంసీ రెండింటికీ రాజకీయ లబ్ధి చేకూరింది. కానీ 1978లో మంగల్దోయీ ఉప ఎన్నికల్లో అక్రమ చొరబాటుదారుల అంశం మళ్లీ దేశం ముందుకు వచ్చింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ 'ఆసు' ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ కొత్తగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.
ఈ ఉద్యమం 1979లో హింసాత్మకగా మారింది. అప్పుడు 885 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమానికి 1985 ఆగస్టు 15న జరిగిన అస్సాం అకార్డ్ ముగింపు పలికింది. ఇందులో ఒక నిర్ధారిత సమయ పరిమితి వరకూ అక్రమ చొరబాటుదారులను గుర్తించాలని 1966-1971(యుద్ధ సమయంలో) మధ్య వచ్చిన వారికి 10 ఏళ్ల పాటు ఓటు వేసే హక్కు ఉండదని, 1971 తర్వాత వచ్చిన చొరబాటుదారులను తిరిగి బంగ్లాదేశ్ పంపించివేయాలని ఆసు, అస్సాం గణ పరిషత్, ప్రభుత్వం మూడు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్-అస్సాం ఒప్పందం
ఈ ఒప్పందం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఐఎండీటీ యాక్ట్(1983) కింద ప్రజలను గుర్తించాలని నిశ్చయించింది. ఈ యాక్ట్ ప్రకారం, ప్రజలను అక్రమ చొరబాటుదారులుగా నిరూపించే బాధ్యతలు పోలీసులకు అప్పగించారు. అంతకు ముందే ఉన్న ఫారినర్స్ యాక్ట్(1946) కింద విదేశీయులను గుర్తించాల్సిన ఒక నిబంధన ఉంది. అందులో చొరబాటుదారులు తమను పౌరులుగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.
ఐఎండీటీ యాక్ట్ విఫలమైన చట్టంగా నిరూపితమైంది. సర్బానంద్ సోనోవాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఈ చట్టాన్ని నిందించిన అత్యున్నత న్యాయస్థానం 2005 జులై 12న ఇది రాజ్యాంగవిరుద్ధంగా ఖరారు చేసింది. దానికింద పనిచేస్తున్న అన్ని ట్రిబ్యునళ్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది.
దానితోపాటు అక్రమ చొరబాటుదారులను ఫారినర్స్ యాక్ట్(1946) కింద గుర్తించాలని కూడా ఆదేశించింది.
అస్సాం అకార్డ్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంతో 1990 నుంచి 2010 వరకూ మొత్తం 17 త్రైపాక్షిక సమావేశాలు జరిగాయి. అన్నిట్లో ఎన్ఆర్సీ పట్ల నిబద్ధత చూపించారు. కానీ 2013 వరకు ఆ ప్రభుత్వం దానిని అమలు చేయలేనంతగా, ఏ పరిస్థితులు ఎదురయ్యాయి, అనే విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు.
చివరికి 2013లో ఇందులో జోక్యం చేసుకున్న అత్యున్నత న్యాయస్థానం కాలపరిమితి ప్రకారం 2018 నాటికి ఎన్ఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అస్సాం అకార్డ్ ప్రకారం పౌరసత్వ చట్టంలో సవరణ చేసి 1985 సెక్షన్ 6ఏ జోడించారు. ఇందులో అస్సాం ప్రజల పౌరసత్వం కోసం వేరే నియమాలు రూపొందించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పౌరసత్వాన్ని సెక్షన్ 3,4,5,6 ప్రకారం నిర్ధారిస్తారు.
1956 పౌరసత్వ నియమావళి సెక్షన్ 17 మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ గురించి చెబుతుంది. దానిలోని నియమావళి 19 కేవలం అస్సాం ఎన్ఆర్సీ గురించి చెబుతుంది. 2004 నవంబర్ 3న సెక్షన్ 14ఏ రూపొందించి జాతీయ ధృవపత్రం గురించి చెప్పారు. ఇది మొత్తం దేశమంతా అమలవుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
అస్సాం ఎన్ఆర్సీ వేరు
ఇలా, అస్సాం వ్యవస్థ, మిగతా దేశ వ్యవస్థ చట్టాల్లో తేడాలున్నాయి. ఎందుకంటే రెండు నేపథ్యాల్లో ప్రాథమిక వైవిధ్యం ఉంది. అస్సాం ఎన్ఆర్సీ అప్లికేషన్ ఆధారితమైనది. అంటే పౌరులు ఫాం-18లో అన్ని పాయింట్లను నింపి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మిగతా దేశంలో ఎన్ఆర్సీ జనగణన ఆధారంగా ఉంటుంది. అంటే ప్రభుత్వమే మీ కుటుబం దగ్గరకు వెళ్లి అవసరమైన సమాచారం సేకరిస్తుంది. అస్సాంలో ఎన్ఆర్సీలో పేరు లేకపోతే, మీపై ఫారినర్స్ యాక్ట్(1946) కింద దర్యాప్తు జరుగుతుంది. మిగతా దేశంలో ఎన్ఆర్సీలో పేరు లేకపోతే ఏమవుతుంది అనేదానిపై ఎలాంటి చర్చ జరగలేదు, దానిని ఏ నియమావళిలో పేర్కొనలేదు.
ఇక పౌరసత్వ సవరణ చట్టం 2019 విషయానికి వస్తే, భారత భూమిపై మొట్టమొట యూదులకు తమ ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించారు. దేశ విభజన జరిగినప్పుడు నెహ్రూ, లియాకత్ రెండు దేశాల్లో ఉంటున్న మైనారిటీలకు మత స్వేచ్ఛను అందిస్తామని భరోసా ఇచ్చారు.
భారత విభజన
భారత్ తన చిరకాల పరంపరను పరిచయం చేస్తూ, తమ దేశంలో మైనారిటీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ముందుకు వెళ్లడానికి సమాన అవకాశాలను కల్పించింది. కానీ పాకిస్తాన్ అలా చేయలేకపోయింది. మైనారిటీలు అక్కడ అంతరించిపోతూ వచ్చారు.
ఈ ఒప్పందం జరగకపోయుంటే మైనారిటీలు పాకిస్తాన్‌లోనే ఉండేవారు కాదు, వారికి ఈ దశ వచ్చేది కాదు. అలాంటప్పుడు వారికి విభజన సమయంలో ఉన్నట్టు తమ దేశం ఎంచుకునే స్వతంత్రం ఉండాలి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది మన బాధ్యతల నుంచి వెనక్కుతగ్గడమే. భారత్ మళ్లీ 'రైట్ టు- వర్షిప్ అనే తమ పురాతన సంస్కృతిని స్థాపించింది.
మైనారిటీలు అనే మాట మన రాజ్యాంగం, దేశానికి కొత్త కాదు. మైనారిటీల సంరక్షణ, వారు ముందుకు వెళ్లడం కోసం తగిన అవకాశాలు ఇస్తున్నట్లు కూడా రాజ్యాంగంలో చెప్పారు.
దీని ఆధారంగానే మనం 'ప్రార్థించే హక్కు' ఇస్తున్నప్పుడు ఇక్కడ మైనారిటీలకు అది తప్పుగా అనిపించకూడదు.
మన ముస్లిం సోదరులకు వారి మతం పేరిట పొరుగు దేశంలో ఉన్న వారి ముస్లిమేతర సోదరులను హింసిస్తుంటే బాధ కలగదా?
ఫొటో సోర్స్, Getty Images
టిబెటన్లను ఎందుకు చేర్చలేదు
అహ్మదీల విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రభుత్వం 1970లో వారిని మైనారిటీలుగా ప్రకటించిందనే విషయం అందరూ తెలుసుకోవాలి. వారు తమను స్వయంగా ఇస్లాం మతానికి అనుచరులుగా భావిస్తారు. రోహింగ్యాలు అంటే వారు ఇతర దేశాల్లో చొరబడిన సమూహాలు, వారి సొంత దేశం మయన్మార్ మతం ఆధారంగా ఉన్న దేశం కాదు. అదే ఆధారంగా టిబెట్, బర్మా, శ్రీలంక, నేపాల్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వలేం. ఎందుకంటే వారి గురించి మన నెహ్రూ-లియాకత్ ఒప్పందంలో ఎలాంటి బాధ్యతలూ లేవు.
వారికోసం భారత ప్రభుత్వం ప్రత్యేక శరణార్థి చట్టం చేయాల్సిన అవసరం ది. సీఏఏ తర్వాత ఎన్ఆర్సీ వస్తే హిందువులకు పౌరసత్వం లభిస్తుందని, ముస్లింలకు ఉండదని ప్రజల్లో భ్రమలు వ్యాప్తి చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే,, అస్సాంలో కూడా ఎవరి పేరు ఎన్ఆర్సీలో రాలేదో, వారికి 10 ఏళ్ల వరకూ ఓటు హక్కు ఉండదు. మిగతా అన్ని సౌకర్యాలూ వెనక్కు తీసుకుంటారు. 1971 తర్వాత వచ్చినవారిని మాత్రమే విదేశీయులని అంటున్నారు. వారిని తిరిగి పంపించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
కానీ మన పౌరసత్వ నియమావళి(2003) ప్రకారం మొత్తం దేశంలో ఎన్ఆర్సీ అమలు చేయాల్సుంటే, దేశంలో ఎన్ఆర్సీ ప్రక్రియ ఇప్పటికీ పూర్తిగా రూపొందించలేదు. దానిని చదివితే అందులో ఎక్కడా ఫారినర్స్ యాక్ట్ పేర్కొనడం ఉండదు. అందుకే అస్సాం ఎన్ఆర్సీ ఆధారంగా మొత్తం దేశాన్ని అంచనా వేయడం తప్పు. దాని ప్రక్రియ ఎక్కడా ప్రకటించలేదు. కటాఫ్ తేదీ ఏది, పేరు రానివాళ్లను ఏం చేస్తారు, ప్రభుత్వం ఇంటికొచ్చి సమాచారం అడుగుతుందా, ఏమేం పత్రాలు కావాలి, అసలు ఇవ్వాలా.. వద్దా, ఇలా ఎన్నో విషయాలపై ఇప్పటికీ ఆలోచించలేదు.
మేధావులు అని చెప్పుకునే కొందరు హిందువులకు పౌరసత్వం లభిస్తుంది, ముస్లింలకు ఇవ్వరు అనడం, స్పష్టంగా ముస్లింలను తప్పుదోవ పట్టేంచే ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఏ మూడు పొరుగు ఇస్లామిక్ దేశాల మైనారిటీ శరణార్థులు ఇక్కడ ఉంటున్నారో, వారికి ఐదేళ్లలో, మిగతావారికి 11 ఏళ్లలో నేచురలైజేషన్ కింద పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం తెచ్చారు.
మైనారిటీలకు త్వరగా పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి దేశాల్లో వారు మతం పేరుతో హింస భరించాల్సి వస్తోంది. ఇక్కడ పౌరసత్వం అనేది ఒక ముస్లింకు మెరుగైన ప్రత్యామ్నాయం కావచ్చు. కానీ, మతపరమైన హింస ఆధారంగా కాదు. అంటే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం, ఒకే ఒక ప్రత్యామ్నాయం కోసం మరో ఆరేళ్లు ఎదురుచూడలేరా?
(ఇందులో వెల్లడించిన అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం రాష్ట్రీయ సేవికా సమితికి సంబంధించిన అపర్ణా సింగ్ వ్యక్తిగతం. వీటిలో ఉన్న వాస్తవాలు, ఆలోచనలు బీబీసీవి కావు. దీనికి బీబీసీ ఎలాంటి బాధ్యత వహించదు)
ఇవికూడా చదవండి:
- CAA: నిరసనకారుల రాళ్ల దాడి నుంచి పోలీసులను కాపాడిన ముస్లిం మహిళ
- CAA: కాన్పూర్ నిరసనల్లో ఇద్దరి మరణానికి ముందు ఏం జరిగింది - గ్రౌండ్ రిపోర్ట్
- పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకమన్న మలేసియా ప్రధాని.. తప్పుపట్టిన సొంత దేశం నేతలు
- 144 సెక్షన్‌ను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
- దేశంలో ముస్లింల భయాందోళనల గురించి మోదీ ప్రభుత్వంలో మంత్రి నఖ్వీ ఏం చెప్పారు?
- CAA-సోనియా గాంధీ: ప్రజాందోళనను బీజేపీ అణచివేయాలని చూస్తోంది
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలపై అంతర్జాతీయ కోర్టుకు మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూచీ
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- బెంగళూరులో బొమ్మ పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ
- మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?
- మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
- అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా?
‘ఎన్పీఆర్, ఎన్ఆర్సీ నియమాలు భిన్నం. ఎన్పీఆర్ డేటాను ఎన్ఆర్సీకి వినియోగించలేం. ఇది 2021-జనాభా లెక్కలతో ముడిపడిన ప్రక్రియ' అని ప్రభుత్వం అంటోంది. ఇందులో నిజమెంత?