CAA - NRC: చెన్నైలో ముగ్గులతో నిరసనలు.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • 29 డిసెంబర్ 2019
సీఏఏ నిరసన Image copyright INSTRAGRAM/GUNAVATHY

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు ఏడుగురిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. గంటన్నర తర్వాత వారిని విడుదల చేసినట్లు పేర్కొంది.

సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముగ్గులు వేసిన గాయత్రి, ఆర్తి, కల్యాణి, ప్రగతి, మదన్‌లతోపాటు వారికి సహకరించిన మరో ఇద్దరు న్యాయవాదులను ఇలా అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

బీసెంట్ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో వాళ్లు ఈ ముగ్గులు వేశారు. 'సీఏఏ వద్దు.. ఎన్ఆర్‌సీ వద్దు' అంటూ వాటిలో నినాదాలు రాశారు.

నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని డీఎంకే నాయకుడు ఎమ్‌కే స్టాలిన్ ఖండించారు.

''ఏడీఎంకే ప్రభుత్వ అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారు. నిరసన తెలిపే హక్కును కూడా వారికి ఇవ్వడం లేదు'' అంటూ ట్వీట్ చేశారు.

Image copyright twitter/DMKITwing

సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిని నియంత్రించేందుకు తమకు అధికారాలున్నాయని.. చిన్న, చిన్న జన సమూహాలు పెద్ద గుంపులుగా పెరిగి శాంతి భద్రతల సమస్యకు దారితీయొచ్చని ఓ పోలీసు అధికారి అన్నారు. నిరసనలు అదుపు తప్పకముందే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

గత వారం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నిరసనలకు మద్దతుగా చెన్నైలో చాలా మంది సామాజిక కార్యకర్తలు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు కలిసి ఓ సంగీత కార్యక్రమం కూడా నిర్వహించారు. పోలీసుల ఆంక్షల మధ్యే ఈ కార్యక్రమం జరిగింది.

సీఏఏకు వ్యతిరేకంగా చెన్నైలో ఓ పెద్ద ర్యాలీ కూడా జరిగింది. 650 అడుగుల పొడవైన జెండాను ఈ ర్యాలీలో ప్రదర్శించారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్

ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే సీఏఏపై బీజేపీ రాజకీయం: కేసీఆర్

అమరావతిలో జర్నలిస్టులపై నిర్భయ కేసు: ఆ రోజు మందడం స్కూల్లో ఏం జరిగింది?

కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు

CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు

కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది

టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు, 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు

కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'