వీడియో: ‘ఇమ్రాన్ ఖాన్.. నువ్వు భారతీయ ముస్లింల గురించి ఆందోళన చెందకు, పాకిస్తాన్ గురించి ఆలోచించుకో’ - అసదుద్దీన్‌ ఒవైసీ

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడారు.

భారతదేశ ముస్లింల గురించి ఆందోళన చెందడం ఆపేయాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి అసదుద్దీన్ అన్నారు. పాకిస్తాన్ జాతిపిత జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తుంటారని, బంగ్లాదేశ్ వీడియోలను చూపించి అది ఇండియా అంటుంటారని తప్పుపట్టారు.

‘మిస్టర్ ఖాన్.. నీ స్వదేశం గురించి ఆలోచించుకో. మమ్మల్ని అసలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవద్దు. మేం భారతీయ ముస్లింలుగా గర్విస్తున్నాం. మేం సగర్వ భారతీయ ముస్లింలుగానే ఉంటాం. మా పౌరసత్వాన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆ హక్కును మాకు ఇచ్చింది’’ అని అసదుద్దీన్ అన్నారు.

కాగా, పాకిస్తాన్ పంజాబ్‌లో సిక్కు గురుద్వారాలపై దాడులు చేస్తున్న వారిని ఆపాలని, సిక్కులను గౌరవించడం నేర్చుకోవాలని ఇమ్రాన్ ఖాన్‌కు అసదుద్దీన్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)