కేరళ: క్షణాల్లో నేలమట్టమైన ఆకాశహర్మ్యాలు

కేరళలో తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు ఆకాశహర్మ్యాలను అధికారులు శనివారం 'నియంత్రిత పేలుడు(కంట్రోల్డ్ ఇంప్లోజన్)' పరిజ్ఞానంతో కొన్ని క్షణాల్లో నేలమట్టం చేశారు.

మరదు మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌2వో హోలీ ఫైత్ కాంప్లెక్స్, ఆల్ఫా సెరీన్ ట్విన్ టవర్లు అనే ఈ అపార్టుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఒక కమిటీ నిర్ధరించిన తర్వాత వీటి కూల్చివేతకు 2019లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఆదివారం ఇలాంటి మరో రెండు ఆకాశహర్మ్యాలను అధికారులు తొలగించనున్నారు.

ఈ వారాంతంలో మొత్తం రెండు వేల మంది నివాసాలైన ఇంచుమించు 343 ఫ్లాట్లను కూల్చివేయనున్నారు. భారత్‌లో ఇప్పటివరకు పెద్దయెత్తున చేపట్టిన నివాస భవనాల తొలగింపు కార్యక్రమాల్లో ఇది ఒకటని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)