రాజ్‌కోట్ వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ సూపర్ హిట్... మూడు సెంచరీలు మిస్

  • 18 జనవరి 2020
శిఖర్ Image copyright Getty Images

రాజ్‌కోట్ వన్డేలో భారత జట్టు 36 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించింది.

341 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొత్తం 50 ఓవర్లలో 304 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఆదిలోనే ఇబ్బందుల పాలైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 15 పరుగులు చేసి ఔటయ్యాడు. రువతా మరో ఓపెనర్ పించ్ కూడా 33 పరుగులకే వెనుతిరిగాడు. దాంతో ఆస్ట్రేలియా జట్టు 82 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిది.

అయితే, స్టీవ్ స్మిత్, లబూ షేన్‌లు స్థిరంగా ఆడి 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ దశలో లబూ షేన్‌ను జడేజా ఔట్ చేయడంతో ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బపడింది. ఆ తరువాత క్యారీ 18 పరుగులకే వెనుతిరగడం, సెంచరీకి చేరువలో ఉన్న స్మిత్ 98 పరుగుల వద్ద వికెట్ కోల్పోవడంతో ఆస్ట్రేలియా ఓటమి అప్పటికే దాదాపు ఖరారైపోయింది.

భారత బౌలర్లలో మహ్మద్ షమీ 10 ఓవర్లలో అత్యధికంగా 77 పరుగులు ఇచ్చినప్పటికీ మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు సాధించారు.

Image copyright Getty Images

చెలరేగిన విరాట్ కోహ్లీ, శిఖర్‌ ధావన్

మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. రోహిత్ శర్మ 44 బంతుల్లో ఆరు ఫోర్లతో 42 పరుగులు చేసి శిఖర్ ధావన్‌తో తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆ తరువాత ధావన్, విరాట్ కోహ్లీ జంట 103 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేసింది. అరవై బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ధావన్ ఆ తరువాత స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. సెంచరీకి దగ్గరగా వ్చచి 96 పరుగుల వద్ద రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ధావన్ వెనుతిరిగాడు.

విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో ఎప్పట్లాగే తన దూకుడును ప్రదర్శించాడు. యాభై బంతుల్లో అర్థ సెంచరీ చేసిన కోహ్లీ 78 పరుగుల వద్ద ఔటయ్యాడు. 280 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 38 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన రాహుల్ 80 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రాహుల్ జోరుతో భారత జట్టు చివరి అయిదు ఓవర్లలో 53 పరుగులు సాధించింది.

వాంఖడే వన్డే ఓటమి తరువాత కోహ్లీ సేన రాజ్ కోట్ వన్డేతో లెక్క సరి చేసింది. సిరీస్ గెలుపు ఆశలను సజీవంగా ఉంచింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionజమ్మూ కశ్మీర్‌లో మొట్టమొదటి టీ20 క్రికెట్ టోర్నమెంట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)