అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే

  • 19 జనవరి 2020
అసదుద్దీన్ ఒవైసీ Image copyright Twitter.com/aimim_national

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెబుతున్న 'ఇద్దరు పిల్లల విధానం'పై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "దేశంలోని అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ" అని ఈ హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యానించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఒవైసీ, "నాకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. బీజేపీ నాయకులలో చాలా మందికి ఇద్దరికి మించి పిల్లలున్నారు. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ ముస్లింల జనాభా నియంత్రించాలని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మోహన్ భగవతి ఇద్దరు పిల్లల విధానం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. ఉపాధి అవకాశాల్లేక 2018లో రోజుకు సగటున 36 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం" అని అన్నారు.

"దేశ జనాభాలో 60 శాతం మంది 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని, కానీ, గత అయిదేళ్ళలో మీరు ఎవరికీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. ఆ విషయాలేవీ మీరు మాట్లాడరు. ఇది మీరు సిగ్గు పడాల్సిన విషయం" అని ఒవైసీ విమర్శించారు.

Image copyright European photopress agency
చిత్రం శీర్షిక మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, "దేశంలో ఇద్దరు పిల్లల చట్టాన్ని తీసుకురావాలన్నదే మా తదుపరి ప్రతిపాదన" అని అన్నారు. ప్రస్తుతానికి ఇది సంఘ్ ఆలోచనే అని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: అశోక్ నగర్‌లో మసీదుపై జాతీయ జెండా, కాషాయ జెండా ఎగరేసింది ఎవరు - గ్రౌండ్ రిపోర్ట్

బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు

దిల్లీ హింస: ‘దేశాన్ని ప్రేమించేవాళ్లంతా మీ పొరుగువాళ్లను, సమాజాన్ని కూడా ప్రేమించండి’ - అజిత్ డోభాల్

హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు

దిల్లీ హింస: అల్లర్ల నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారా.. రాష్ట్ర పరిధిలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవా

కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం

పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది

దిల్లీ హింస వెనక కుట్ర ఉందన్న సోనియా గాంధీ; 20కి చేరిన మృతులు