స్వీటీ కుమారి: అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించి, అనుకోకుండా రగ్బీకి..

బిహార్‌లోని నవాడా అనే గ్రామానికి చెందిన స్వీటీ కుమారి ఇప్పుడు భారత మహిళల రగ్బీ జట్టు తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు.

ఈ మధ్యే మహిళల రగ్బీ మ్యాచ్‌ల వార్తలు అందించే స్క్రమ్‌క్వీన్స్ వెబ్‌సైట్ ఆమెకు 'ఇంటర్నేషనల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు ఇచ్చింది.

మొదట్లో అథ్లెట్‌గా కెరీర్‌గా ప్రారంభించిన తాను, అనుకోకుండా రగ్బీ వైపు మళ్లానని అన్నారు స్వీటీ.

అలా మారడం వెనుకున్న కారణం, తన కుటుంబ పరిస్థితుల గురించి కూడా ఆమె బీబీసీతో చెప్పారు.

మునుపటి కన్నా తాను బాగా మెరుగయ్యానని, ఆటలో ప్రత్యర్థులకు ఆ విషయం చూపిస్తానని స్వీటీ చెప్పారు.

ఇంకా ఆమె బీబీసీతో చెప్పిన విషయాలు పైవీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)