ఉత్తర కొరియా: కిమ్ జాంగ్ ఉన్ మేనత్త బతికే ఉన్నారు... ఆరేళ్ళ ఊహాగానాలకు తెర

  • 27 జనవరి 2020
కిమ్ జాంగ్ ఉన్, రి సోల్ జు, కిమ్ క్యోంగ్ హుయి Image copyright KCNA
చిత్రం శీర్షిక కిమ్ జాంగ్ ఉన్, పక్కనే ఆయన భార్య రి సోల్ జు, మేనత్త కిమ్ క్యోంగ్ హుయి

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ మేనత్త కిమ్ క్యోంగ్ హుయి బతికి ఉన్నారో లేదో అన్న ఊహాగానాలకు తెరపడింది.

ఆరేళ్ల తర్వాత ఆమె తొలిసారి బహిరంగంగా కనిపించారు.

ఉత్తర కొరియా స్థాపకుడు కిమ్ ఇల్ సంగ్‌ కూతురు హుయి. కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్‌కు ఆమె స్వయాన తోబుట్టువు.

హుయి భర్త చాంగ్ సాంగ్ తాయెక్‌కు 2013లో 'దేశద్రోహం' కింద కిమ్ జాంగ్ ఉన్ మరణ శిక్ష అమలు చేయించారు.

అప్పట్లో ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా తాయెక్ ఉండేవారు.

తాయెక్‌ మరణం తర్వాత హుయి బయటకు కనిపించలేదు. ఆమె ఏమైపోయారన్నదాని గురించి చాలా వదంతులు వ్యాపించాయి.

Image copyright KCNA

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హుయి కిమ్ జాంగ్ ఉన్‌తోపాటు ఉన్న ఫొటోలను ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది.

ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ థియేటర్‌లో ఈ వేడుకలు జరిగినట్లు పేర్కొంది. ఆ ఫొటోలో కిమ్ జాంగ్ ఉన్ భార్య కూడా కనిపించారు.

ఉత్తర కొరియాకు సంబంధించిన వార్తలు ప్రసారం చేసే ఎన్‌కే న్యూస్ అనే అమెరికన్ వెబ్‌సైట్ ఎడిటర్ ఒలీవర్ హోథమ్.. హుయి మళ్లీ కనిపించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

''భర్త మరణం తర్వాత హుయి అజ్ఞాతంలోకి వెళ్లి ఉండొచ్చని, లేక ఆమెను కూడా కిమ్ చంపించి ఉండొచ్చని అందరూ భావించారు'' అని రాయిటర్స్ వార్తాసంస్థతో అన్నారు.

హుయి కిమ్ పక్కన కూర్చునే కనిపించడం ఆమె మళ్లీ ప్రభావంతమైన స్థానంలోకి వచ్చి ఉండొచ్చన్న సంకేతాలను ఇస్తోంది. కిమ్‌కు ఆమె సలహాదారుగా కూడా ఉండే అవకాశాలున్నాయి.

''ఉత్తర కొరియా ఎంత విచిత్రమైందో, క్రూరమైందో అన్నదానికి ఇదో ఉదాహరణ. తన భర్తను చంపించిన వ్యక్తి పక్కన కూర్చొని హుయి కనిపించారు'' అని ఒలీవర్ వ్యాఖ్యానించారు.

Image copyright AFP

దశాబ్దం క్రితం తన తండ్రి అనంతరం కిమ్ జాంగ్ ఉన్ దేశ పగ్గాలు చేపట్టినప్పుడు హుయి, ఆమె భర్త తాయెక్ ఉత్తర కొరియాలో కీలక నేతగా ఉన్నారు.

అప్పుడు కిమ్ జాంగ్ ఉన్‌ మార్గదర్శకుల్లో తాయెక్ కూడా ఒకరని భావించేవారు.

కానీ, రెండేళ్ల తర్వాత పరిస్థితులు మారాయి.

నాటకీయ రీతిలో ఓ సమావేశం మధ్యలో ఉండగానే తాయెక్‌ను బయటకు లాక్కెళ్లమని సాయుధ గార్డ్స్‌ను కిమ్ జాంగ్ ఉన్‌ ఆదేశించారు.

తన అధికారానికి ముప్పుగా భావించి తాయెక్‌ను కిమ్ జాంగ్ ఉన్ చంపించి ఉండొచ్చని చాలా మంది పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 200 మందిలో చాలా మందికి కోవిడ్ లక్షణాలు

కరోనావైరస్: టోక్యో ఒలింపిక్స్ 2021లోనే... తేదీలు ఖరారు

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?

కరోనావైరస్: దిల్లీలో వలస కార్మికులు ఇంత భారీ సంఖ్యలో పోగవ్వడానికి బాధ్యులు ఎవరు?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

క‌రోనావైర‌స్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో న‌ష్టం ఎంత‌

కరోనావైరస్: సరకులు కొనుక్కోవడానికి ఏది సురక్షిత మార్గం? సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళడమా... ఆన్‌లైన్లో ఆర్డర్ చేయడమా?

కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి.. అవి ఎందుకు ముఖ్యం

దిల్లీ: కరోనావైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి.. ‘మొదటి మూడు రోజులు మాటలు కూడా సరిగా రాలేదు’