వీడియో: హిజాబ్‌ ధరించి క్రికెట్ ఆడుతున్న ముస్లిం అమ్మాయిలు

ఒకప్పుడు క్రికెట్ పురుషులు మాత్రమే ఆడతారన్న అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. మేము కూడా పురుషులతో దీటుగా క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తామని ఈ అమ్మాయిలు అంటున్నారు. "ఇది పురుషుల ఆట మాత్రమే కాదు. అమ్మాయిల ఆట కూడా" అని అంటున్నారు.

పుణెలోని అజాం కాలేజీ క్యాంపస్‌లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్‌తోనే క్రికెట్ ఆడుతున్నారు.

తాము కూడా మిథాలీ రాజ్, స్మృతి మంధన లాంటి మహిళా క్రీడాకారుల స్ఫూర్తితో రికార్డులు నెలకొల్పుతామని వీళ్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)