ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ

ద్యుతి చంద్... ప్రపంచ స్థాయి రన్నర్‌గా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారో... ఒకానొక సమయంలో అంతే వివాదాస్పదమయ్యారు.

శిఖర స్థాయికి చేరుకున్న కెరీర్ హైపర్ ఆండ్రోజెనిజం అభియోగాలపై ఒక్కసారిగా నేలకు జారిపోయింది. అయితే చిన్న నాటి నుంచే పోరాడి సాధించడానికి అలవాటు పడిన ఆమె... తనపై వచ్చిన ఆరోపణల విషయంలోనూ అలాగే పోరాడి గెలిచారు.

ప్రస్తుతం దక్షిణాసియాలో వంద మీటర్ల పరుగులో అత్యుత్తమ రన్నర్‌లలో ఒకరిగా నిలిచిన ఆమె రాబోయే టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డు నామినీల్లో ఒకరైన ద్యుతి క్రీడా ప్రయాణం ఎలా సాగిందో పై వీడియోలో చూడండి.

షూట్-ఎడిట్: శుభమ్ కౌల్, కెంజ్ ఉల్ మునీర్

రిపోర్టర్: రాఖీ శర్మ

ప్రొడ్యూసర్: వందన

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)