నగరం వాలెంటైన్స్ డే జరుపుకొంటోంది.. ఆమె మాత్రం గదిలో ఒంటరిగా నిరీక్షిస్తోంది

  • 14 ఫిబ్రవరి 2020
బీచ్ లో ప్రేమికులు Image copyright iStock

వాలెంటైన్స్ డే ముందు రోజు రాత్రి. దేశ రాజధానిలో సోనియాకు తెలిసినవారెవరూ లేకపోవడం వల్ల అక్కడ ఉండే సల్సా, కిహుంబా, బకాట డాన్స్ క్లబ్‌లకు ఒంటరిగా వెళ్లి ఎవరితోనైనా డాన్స్ చేయడానికి తగినంత స్వేచ్ఛ దొరుకుతోంది.

ఈ డాన్స్ ఫ్లోరే ఇప్పుడామె ప్రపంచం. "ఇక్కడ రకరకాల కొత్త వ్యక్తులను కలుస్తాం, రకరకాల పాటలకు డాన్స్ చేస్తాం. మళ్లీ ఇంటికి వెళతాం."

నగరాలలో ఉండే ఒంటరితనానికి అలవాటు ఆమె పడిపోయారు.

ఎప్పుడూ ఒక సల్సా డాన్స్ క్లబ్‌కి వెళుతుంది. ఒంటరిగా వెళ్లడం, నవ్వడం, ఎవరో తెలియని వ్యక్తిని డాన్స్ చేయమని అడగడానికి చాలా ధైర్యం కావాలి. కానీ, సల్సా డాన్స్‌తో కలిగే ఉత్తేజంలో ఏదో ఆశ ఉంటుంది.

ఒక కొత్త వ్యక్తితో డాన్స్ చేయడం ఎలా ఉంటుంది? ఒక కొత్త వ్యక్తి మిమ్మల్ని సుతిమెత్తగా స్పర్శించినపుడు ఏదో తెలియని ఆనందం ఉంటుంది.

ఒంటరిగా ఉండేటప్పుడు తోడు కోరుకునేవాళ్ళకు సల్సా డాన్స్ ఒక సాంత్వన ఇస్తుంది.

"నాకు అక్కడ ఎవరైనా తెలుసా లేదా అనే విషయం పెద్దగా పట్టించుకోను. వెళ్లి డాన్స్ చేస్తాను. అంతే!"

ఒంటరితనం అధిగమించడానికి సల్సా ఒక మంచి మార్గంలా అనిపిస్తుంటుంది.

Image copyright Getty Images

నగర జీవితంలో తాను చేసిన ఎన్నో పోరాటాల్లో ఒంటరితనాన్ని అధిగమించడం ఒకటి. ఒక పక్క గులాబీ పూలు, స్టఫ్ఫ్డ్ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్‌తో నిండిన వీధులు, మరోవైపు వాలెంటైన్స్ డే నాడు ఒంటరితనాన్ని ఎలా జయించాలనే సలహాలు వినిపిస్తూ ఉంటాయి.

మనసు చాలాసార్లు విరిగిపోయింది. ఒక్కొక్కసారి ప్రేమను పొందడంలో విఫలమయ్యామని దిగులుగా ఉంటుంది. ఒంటరితనం మనిషిని కుంచించుకుపోయేలా చేస్తుంది. ఒకప్పుడు తనకు నచ్చిన వ్యక్తులకు గిఫ్ట్‌లు పంపేది. కానీ, ఇపుడు ఈ గిఫ్టులు ఇచ్చి పుచ్చుకునే మార్కెటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది సోనియా.

కళలు-సాంస్కృతిక రంగంలో సలహాదారుగా పనిచేస్తున్న సోనియా... భారత్‌లో ఉన్న లక్షల మంది ఒంటరి మహిళల్లో ఒకరు.

"ఇక నాకు ఇపుడు వాలెంటైన్స్ డే అనే ఆలోచనే మనసులోకి రాదు. అది నా జీవితంలో మామూలు రోజులాగే గడిచిపోతుంది. అంతే! మహా అయితే నా కోసం నేను ఒక పూల గుత్తి కొని నాకు నేనే బహుకరించుకుంటాను" అంటారామె.

Image copyright Getty Images

"1990లలో నాకు ఒక కలం స్నేహితుడు (పెన్ ఫ్రెండ్) ఉండేవాడు. తను నాకు ఒకసారి వాలెంటైన్స్ రోజుకి గ్రీటింగ్ కార్డు పంపాడు. అప్పట్లో వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులకి మాత్రమే పరిమితం అయ్యేది.

40 సంవత్సరాలు వచ్చినా ఒంటరిగా ఉంటున్న మహిళకు, ఆరు వందల కోట్ల ప్రపంచ జనాభాలో ప్రేమ దొరకకపోవడం అనే విషయాన్ని వాలెంటైన్స్ డే గుర్తుచేస్తూ ఉంటుంది.

ఒక వైపు వీధుల్లో గులాబీ పూల గుత్తులు గుభాళిస్తుంటే... మరో వైపు ఒంటరిగా అపార్ట్మెంట్‌లో కూర్చుని తనని ధిక్కరించిన పరిస్థితులతో యుద్ధం చేస్తూ ఉంటుంది.

ఒంటరిగా ఉండటం అంటే, నీ పనులు నువ్వు చేసుకోవడం, నీ ఇంటికి కావాల్సిన సరకులు అమకూర్చుకోవడం, నీ కోసం నువ్వు వండుకోవడం, నీ మందులు నీవు కొనుక్కోవడం.

ఇంటర్నెట్ ఒంటరితనానికి పరిష్కారం అనుకుంటారు, కానీ కాదు. ఎవరైనా భాగస్వామి గురించి వెతుకులాటలో ఉంటే చాలా డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, ఒక బంధానికి కట్టుబడి ఉండటం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది.

ఒక్కొక్కసారి ఈ డేటింగ్ యాప్స్ లో చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. పనికి రాని సంభాషణలు, ప్రేమ కోసం వెతుకులాట, మళ్ళీ థెరపిస్ట్ తో సెషన్ లు. జీవితంతో ఇపుడిపుడే ఒక అంగీకారానికి వస్తున్నా.

ఎన్ని చేసినా ఒక్క డాన్స్ మాత్రమే తనకి ఆనందాన్ని ఇస్తుంది.

Image copyright DIBYANGSHU SARKAR

మంచం మీద నా పక్కన ఉండే స్థలం పూర్తిగా నాదే. కఫ్కా రచనలు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను.

నాకు రేపటిపై ఆశ ఎక్కువ. నాలోనే ఎన్నో వ్యతిరేకతలు. ఎన్నో సార్లు లైట్లు వేసి పడుకుంటాను. ఒంటరితనం గురించి ఆలోచిస్తూ చీకట్లో గడిపేస్తూ ఉంటాను.

ఒక సారి నేను నా నోట్ బుక్‌లో రాసుకున్నాను. కారు అద్దాలపై పడిన మంచు బిందువుల మీద అపుడపుడూ నా పేరు రాసుకున్నాను. అవి చెరిగిపోయేలోపు ఆ రాతల్లో దాగిన కథలని ఎవరైనా చదువుతారేమో అని ఒక ఆశ ఉండేది ఇంతకు ముందు.

చాలా రోజులు నేను ఈ ఆలోచనకి బానిసనైపోయాను. కానీ, ఒక మంచు కురిసే రాత్రి నేను ఆ ఆలోచనని దాటుకుంటూ నడిచి బయటకి వచ్చేశాను.

మరో నగరంలో నివసిస్తున్న నా స్నేహితురాలు ఒంటరితనం అధిగమించడానికి క్విజ్ క్లబ్‌లో చేరినట్లు చెప్పింది. తను పేపర్ల మీద డ్రెస్సుల స్కెచ్ చేస్తుంది. తను ఒంటరితనాన్ని తనకి ఇష్టమైన కళతో జయించింది.

కాలం గడుస్తున్న కొద్దీ ఒంటరితనాన్ని లోపల బంధించేసి , ఉద్యోగాలు, స్నేహితులు, కప్ బోర్డు అంతా నిండిపోయిన డ్రెస్‌లు, డాన్సింగ్ షూలతో ధీమాగా ముందుకి నడుస్తున్న మహిళలుగా కనిపిస్తాం.

Image copyright Getty Images

భారత జనాభాలో ఒంటరిగా నివసిస్తున్న మహిళల సంఖ్య 7.2 కోట్లకు పైగా ఉండగా అందులో 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న చాలా మంది మహిళలు అవివాహితులు.

నేను ఈ ఆర్టికల్ రాస్తూ ఉండగా, మంగళవారం రాత్రి అకస్మాత్తుగా నాకు 'ఫర్ లోన్లీ ఫిమేల్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఫాలో రిక్వెస్ట్ వచ్చింది. ప్రొఫైల్‌లోకి వెళ్లి చూడగానే నాకు కనిపించిన సమాచారం ఇలా ఉంది.

'అద్దెకి బాయ్ ఫ్రెండ్, ఈ వాలెంటైన్స్ డే నాడు మీ బాయ్ ఫ్రెండ్‌ని మిస్ అవుతున్నారా? అయితే నన్ను అద్దెకి తీసుకోండి.'

'నేను మీ ప్రేమికుడి స్థానాన్ని భర్తీ చేయలేకపోవచ్చు కానీ మీతో మాట్లాడడానికి, మీ మనసు ఊసులు వినడానికి, మీతో సమయం గడపడానికి ఎపుడూ సంసిద్ధంగా ఉంటాను.'

'గోప్యతకి ఎటువంటి భంగం ఉండదు' అనే వాక్యాలు నాకు కనిపించాయి.

ముంబయిలో నివసిస్తున్న 34 సంవత్సరాల రాహుల్ ఈ ఖాతాను ప్రారంభించారు.

ఒంటరితనంతో బాధపడుతున్న చాలా మంది మహిళలను చూశాక ఇది మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చిందని రాహుల్ చెప్పారు.

Image copyright Getty Images

29 ఏళ్ల కౌశిక్ ప్రకాష్... 2018 లో 'రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్' అనే యాప్‌ని ముంబై లో ప్రారంభించారు.

'అన్ని వైపుల నుంచి ఎరుపు రంగు నిన్ను కవ్విస్తుంటే ప్రపంచం ఈ యాప్‌ల ద్వారా ఒంటరితనానికి పరిష్కారాలు వెతుకుతోంది'.

ప్రేమ లాగే, ఒంటరితనం కూడా ఒక స్టార్ట్-అప్ వ్యాపార అవకాశంగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆర్మీలో మహిళాధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులన్న సుప్రీం కోర్టు తీర్పుతో జరిగేదేంటి

టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు

ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

ఐఫోన్లకు కరోనా వైరస్ దెబ్బ.. ఉత్పత్తి, అమ్మకాలు, ఆదాయంపై ప్రభావం పడిందన్న ఆపిల్

పంటకు నష్టం చేసిన కలుపుమందు.. బేయర్ సంస్థకు రూ. 1,890 కోట్ల జరిమానా విధించిన కోర్టు

కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది

సచిన్ తెందుల్కర్‌కు ప్రఖ్యాత లారియస్ పురస్కారం: ‘ఇరవై ఏళ్లలో ఇదే బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్’