దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు? ఆయన బదిలీపై చర్చ ఎందుకు?

  • 27 ఫిబ్రవరి 2020
జస్టిస్ ఎస్ మురళీధర్ Image copyright Twitter/NyayaForum
చిత్రం శీర్షిక జస్టిస్ ఎస్ మురళీధర్

దిల్లీ హింసలో గాయపడ్డ బాధితులకు తక్షణం చికిత్సనందించాలని వారికి పోలీసులు రక్షణ కల్పించాలని తీర్పునిచ్చిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ మురళీధర్ తీర్పు ఇచ్చిన మర్నాడే పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చెయ్యడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది . బుధవారం అర్థరాత్రి న్యాయశాఖ ఈ ఉత్వర్యువులను జారీ చేసింది.

అయితే, ఆయనను ఈ సమయంలో బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వం నిర్ణయాన్ని విమర్శించడమే కాదు 2014లో షాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు విచారణ సమయంలో గుండెపోటుతో మరణించిన జస్టిస్ బీహెచ్ లోయా విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ ఆరోపణల్ని కొట్టి పారేసినట్టు ఏఎన్ఐ తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలిజియం ఫిబ్రవరి 12వ తేదీనే ఆయన బదిలీకి ప్రతిపాదించిందని వాటిని పరిగణనలోకి తీసుకునే ఈ బదిలీ జరిగిందని మంత్రి ఏఎన్ఐతో చెప్పారు. ఈ బదిలీని రాజకీయం చేడయం ద్వారా న్యాయ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిన్న చూపు మరోసారి బయట పడిందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

జస్టిస్ మురళీధర్ ఎవరు?

గత కొద్దికాలంగా జస్టిస్ మురళీధర్ చర్చల్లో ఉన్నారు. గత వారం కూడా మురళీధర్ బదిలీపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ఈ బదిలీని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 20వ తేదీన లాయర్లు నిరసన ప్రదర్శన కూడా చేశారు.

ఫిబ్రవరి 12వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ మురళీధర్‌ను బదిలీకి సిఫార్సు చేసింది.

ప్రస్తుతం జస్టిస్ మురళీధర్‌ను దిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు.

ఈ బదిలీని వ్యతిరేకిస్తూ దిల్లీ బార్ అసోసియేషన్ ఒక తీర్మానం చేసింది. అలాగే సుప్రీంకోర్టు కొలీజియంకు కూడా తమ వైఖరిని తెలియజేసింది.

మురళీధర్ చాలా సీనియర్ న్యాయమూర్తి అని, ఆయన్ను ఈ తరహాలో బదిలీ చేయడం సముచితం కాదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహిత్ మయూర్ బీబీసీతో అన్నారు.

దిల్లీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. జస్టిస్ ఎస్ మురళీధర్ 1984లో చెన్నైలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987 నుంచి దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు.

ఆయన రెండుసార్లు సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు.

ఎటువంటి ఫీజు తీసుకోకుండా కేసులు వాదించి ఆయన పేరుతెచ్చుకున్నారు. అలా వాదించిన కేసుల్లో భోపాల్ గ్యాస్ విషాదం, నర్మదా ఆనకట్ట వంటివి ఉన్నాయి.

పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు ఆయన్ను న్యాయ మిత్రగా నియమించింది.

2006లో ఆయన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ఆంధ్రప్రదేశ్‌లో 16 కొత్త కేసులతో 180కి చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: అమెరికా చేసిన తప్పులేంటి... ఒప్పులేంటి?

కరోనావైరస్: ఈ వీడియోలో కనిపిస్తున్నది తబ్లీగీ జమాత్‌కు చెందినవారేనా? - FactCheck

రోజుల బిడ్డ ఉన్నా.. కరోనావైరస్ సమయంలో విధుల్లో చేరిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం

ప్రెస్ రివ్యూ: లక్ష రూపాయలకే ఎమర్జెన్సీ వెంటిలేటర్ తయారు చేసిన హైదరాబాద్ ఐఐటీ అనుబంధ సంస్థ

కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?

ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల‌ కార్మికుల వేదన

కరోనావైరస్: వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం తయారుచేసిన మెర్సిడెస్ ఫార్ములా వన్ టీం