ఇవాంకా ట్రంప్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషాప్ ఎడిట్ ఫొటోలు..

సైకిల్‌పై ఇవాంకా ట్రంప్.. ఫొటోషాప్ చేసిన చిత్రం

ఫొటో సోర్స్, Twitter

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన ముగిసినప్పటికీ ఆ పర్యటనలో ఆయనతోపాటు వచ్చిన ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో భారతీయుల అనుబంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది.

భారత్‌లో సోషల్ మీడియాలో ఇవాంకా ట్రంప్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ ఫొటోలు ఇవాంకా ట్రంప్ ఒక్కరే దిగినవో, తన కుటుంబంతో తీసుకున్నవో కాదు.

ఇవన్నీ ఫొటోషాప్ చేసిన ఫొటోలు. వీటిని ఫేస్‌బుక్, ట్విటర్, ఇతర సోషల్ మీడియా వేదికలపై వేల మంది షేర్ చేస్తున్నారు.

ఒక ఫొటోలో తాజ్‌మహల్ ఎదురుగా డయానా బెంచ్‌పైన కూర్చున్న ఇవాంకా ట్రంప్‌తో పాటు ఫొటోషాప్ చేసిన మరొకరు కూడా ఉన్నారు.

మరొకరు తన సైకిల్‌పై అమెరికా అధ్యక్షుడి కుమార్తెను ఎక్కించుకుని వెళ్తున్నట్లు ఫొటోషాప్ చేశారు.

ఈ ఫొటోలను ఆదివారం ఇవాంకా ట్రంప్ రీట్వీట్ చేశారు. ''భారతీయ ప్రజల ఆప్యాయతను అభినందిస్తున్నాను. చాలా మంది కొత్త స్నేహితుల్ని పొందాను'' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారామె.

ఈ ఫొటోల్లో ఒకటి ప్రముఖ నటుడు దల్జీత్ దొసాంజాది కూడా ఉంది. ఇవాంకాతో కలసి ఉన్నట్లుగా ఫొటోషాప్ చేసిన ఈ ఫొటోను ఆయన ట్వీట్ చేస్తూ.. ''నా వెనకాలే పడింది.. తాజ్‌మహల్ తీసుకెళ్లు, తాజ్‌మహల్ తీసుకెళ్లు అంటూ..'' అని పేర్కొన్నారు.

ఇవాంకా స్పందిస్తూ.. ''నన్ను తాజ్‌మహల్‌కు తీసుకెళ్లినందుకు థాంక్యూ. నేను ఎన్నటికీ మర్చిపోలేని అనుభవం అది'' అని పేర్కొన్నారు.

''ఎవరో వీటిని సరదా కోసం తయారు చేసినట్లున్నారు. కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు, మీరు బాధపడాల్సిందేమీ లేదు. మిమ్మల్ని భారతీయ సమాజం ఎంతగానో ప్రేమిస్తోంది'' అని రాధికా మీనా అనే ఒక ట్విటర్ యూజర్ మరికొన్ని ఫొటోషాప్ చేసిన ఫొటోలను ట్వీట్ చేస్తూ ఇవాంకా ట్రంప్‌ను ట్యాగ్ చేశారు.

సునీల్ కుమార్ యోగి అనే మరొక యూజర్ సైతం ఇలాంటి ఫొటోలనే పెట్టి.. ''లక్షల మంది భారతీయ హృదయాలను గెల్చుకున్న ఒక అమ్మాయి. లవ్‌యూ ఇవాంకా ట్రంప్. దయచేసి మరోసారి భారత పర్యటనకు రా'' అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ భారీతనం, సౌందర్యం ఇవాంకా ట్రంప్‌ను కట్టిపడేసినట్లున్నాయి. గత ఆరు రోజులుగా తన ట్విటర్ ఖాతాలో తాజ్‌మహల్ వద్ద దిగిన ఫొటోల ట్వీట్‌ను ఆమె పిన్ చేసి ఉంచడమే దీనికి నిదర్శనం.

తాజ్‌మహల్ పునాదులను.. 180 బావులు, కొయ్య మూలాల మీద నిర్మించారు. వీటికి ఏడాది అంతటా నీరు అవసరం. నీరు తగ్గితే చెక్కలో పగుళ్లు మొదలవుతాయి.

తాజ్‌మహల్‌పై బీబీసీ ప్రతినిధి రిపోర్టర్: సల్మాన్ రావి అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఫొటో సోర్స్, TWITTER

భారత పర్యటనకు ముందు డోనల్డ్ ట్రంప్‌ను బాహుబలితో పోలుస్తూ ఒక వీడియో స్పూఫ్‌ ట్విటర్‌‌లో వైరల్ అయ్యింది. దానిని ట్రంప్ కూడా రీట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)