బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం #BBCISWOTY

ఈ కంటెంట్ ఇప్పుడు అందుబాటులో లేదు.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం #BBCISWOTY

బీబీసీ మొట్టమొదటిసారిగా ఇవ్వబోతున్న "ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ - 2019" కు ఐదుగురు మహిళా క్రీడాకారులు నామినేట్ అయ్యారు.

వారే... ద్యుతీ చంద్, మానసి జోషి, మేరీకోమ్, పీవీ సింధు, వినేశ్ ఫోగట్.

భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో కూడిన జ్యూరీ ఈ ఐదుగురు నామినీలను ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఈ టాప్ 5 మహిళా క్రీడాకారులు బీబీసీ వెబ్‌సైట్లలో పబ్లిక్ ఓటింగ్ కోసం నామినేట్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం 2020 ఫిబ్రవరి 24వ తేదీ 23.30 (18:00 గ్రీన్‌విచ్ మీన్ టైం) గంటల వరకు ఓటింగ్ జరిగింది.

అత్యధిక ఓట్లు పొందిన పీవీ సింధును 'ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్'గా బీబీసీ ప్రకటించింది.

దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్ హోటల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)