వీడియో: వయసు 85 ఏళ్లు.. రన్నింగ్‌లో రికార్డులు సృష్టిస్తున్న ఏపీ పరుగుల తాత

వీడియో: వయసు 85 ఏళ్లు.. రన్నింగ్‌లో రికార్డులు సృష్టిస్తున్న ఏపీ పరుగుల తాత

వి శంకర్, బీబీసీ కోసం

ఈయన వయసు 85 ఏళ్లు. అయినా, కుర్రకారుకు ఏమాత్రం తీసిపోని విధంగా రన్నింగ్‌లో రికార్డులు సృష్టిస్తున్నారీ పెద్దాయన.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా కోడూరు మండ‌లం పిట్ట‌ల్లంక గ్రామానికి చెందిన చింతా రామ‌స్వామి.. పరుగు పందేలలో పతకాలు సాధిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రిజ‌ర్వ్ పోలీస్ విభాగంలో స‌బ్‌ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేసిన రామ‌స్వామి... 1993లో పదవీ విరమణ చేశారు. ఆ త‌ర్వాత ర‌న్నింగ్ మొద‌లుపెట్టి ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో దాదాపు 40 ప‌త‌కాలు సాధించారు.

ఇటీవలే మణిపూర్‌లో జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పందెంలో రామస్వామి బంగారు పతకం సాధించారు.

రామస్వామి రోజూ ఉదయం క్రమం తప్పకుండా రన్నింగ్, వాకింగ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎంత దూరమైనా సరే సైకిల్ మీదే వెళ్తానని ఆయన చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉండేందుకే రన్నింగ్ చేస్తున్నానని రామస్వామి అంటున్నారు. తనకిప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని, పది కిలోమీటర్ల దూరమైనా ఎలాంటి ఆయాసం లేకుండా పరిగెత్తగలనని ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)