కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్... మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

 • 23 మార్చి 2020
కరోనావైరస్ Image copyright Getty Images

అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.

ఈ నియంత్రణలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధానమంత్రి ఏం చెబుతున్నారో వినాలని, లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విటర్‌లో విజ్ఞప్తి చేసింది.

ఈ నియంత్రణలకు సహకరించకుండా, వీటిని అతిక్రమించి కోవిడియట్లు (కోవిడ్-ఇడియట్) కావొద్దని తెలిపింది.

ఇప్పటికీ కొంతమంది లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించట్లేదని, ‘దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబ సభ్యులను కాపాడండి’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

నియంత్రణలను కట్టుదిట్టంగా పాటించాలని ప్రజలకు పిలుపునిస్తూ.. ప్రజలంతా ఈ నియమాలను, చట్టాన్ని పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సందర్భంగా మీరు చేయగలిగిన పనులు, చేయకూడని పనులు ఏంటో తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్:

ఇవి దొరుకుతాయి:

1. ఆహారం, నిత్యావసర వస్తువులు

2. పాలు, బ్రెడ్

3. పండ్లు, కూరగాయలు

4. మాంసం, చేపలు

5. విద్యుత్, నీరు

6. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ సర్వీసులు

7. ఆహారం, మందులు, మెడికల్ సామగ్రి ఆన్‌లైన్ డెలివరీ

8. పెట్రోలు, గ్యాస్, నూనె, వాటికి సంబంధించిన వ్యవహారాలు

9. ఆసుపత్రులు, మందుల షాపులు, కళ్లజోళ్ల షాపులు

10. బ్యాంకులు, ఏటీఎం, టెలికాం, ఇంటర్నెట్, పోస్టల్, ఐటీ సేవలు

పైన పేర్కొన్న వస్తువుల అమ్మకంతో పాటు వాటి నిల్వ, రవాణా వసతులకు కూడా అనుమతి ఉంది.

ఇవి మూసివేత:

1. ప్రజా రవాణా.. అంటే ఆర్టీసీ మూసివేత. కేవలం ఆసుపత్రులు, విమానాశ్రయాలకు వెళ్లే వారికే అనుమతి

2. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు కూడా నిలిపివేత

3. అవసరం లేని వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మూసివేత

4. ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోడౌన్లు మూసివేత. ఒకవేళ నడపాలనుకుంటే అతి తక్కువ సిబ్బందితో నిర్వహించాలి.

5. కనీసం పది మంది కంటే ఎక్కువ మంది కలిసే కార్యక్రమాలు అన్నిటి పైనా నిషేధం

6. ఆహార ఉత్పత్తులు, నిత్యావసర ఉత్పత్తులూ చేసే రైతులు, ఇతర వ్యక్తులు వారి పనులు కొనసాగించవచ్చు. కానీ దూరం పాటించాలి.

వీరికి మినహాయింపు:

1. శాంతి భద్రతలు, న్యాయ సంబంధ విధులు చేసేవారు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో, తహశీల్దార్

2. పోలీసు, వైద్య, స్థానిక సంస్థలు, అగ్నిమాపక సిబ్బంది

3. మీడియా

4. నిత్యావసరాల సరఫరాకు సంబంధించిన అన్ని సేవలు

5. వైద్యానికీ, నిత్యావసర సరకులకు మాత్రమే ప్రైవేటు వాహనాలకు అనుమతి

6. నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉండే తయారీ పరిశ్రమలు కలెక్టర్ నుంచి అనుమతి పొందాలి

7. నిత్యావసర వస్తువుల తయారీ జరిగే కర్మాగారాలు

8. నిత్యావసరాలకు, కోవిడ్ చికిత్సకూ ఉపయోగపడే ప్రైవేటు సేవలు

9. మందుల తయారీ, రవాణా, వాటికి సంబంధించిన వ్యవహారాలు

ఎవరు ఏం చేయాలి?

 1. స్థానిక వైద్య సిబ్బంది చెప్పినట్టుగా విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.
 2. పోలీసులు, మహిళా పోలీసులతో కలసి విదేశాల నుంచి వచ్చిన వారు బయట తిరగకుండా చూడాలి.
 3. సాధారణ ప్రజలు తప్పనిసరి అసవరాల కోసం తప్ప బయటకు రావద్దు. వచ్చినా రెండు మీటర్ల దూరం పాటించాలి.
 4. వీటిల్లో ఏది కొనసాగాలి? ఏది కొనసాగకూడదు? వంటివి నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టరుకు ఉంది.

ప్రభుత్వ ఏర్పాట్లు

 1. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల క్వారంటైన్ సౌకర్యం ఏర్పాటు
 2. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రైవేటుతో సమన్వయం చేసుకుని 200 నుంచి 300 వందల పడకల కరోనా వైద్య చికిత్స ఏర్పాటు
 3. ఎక్కడా మందులు, నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ధరలను ప్రచారం చేయాలి. ఎక్కువ వసూలు చేస్తే ఐపీసీ కింద కేసులు పెట్టాలి.
 4. ఈనెల 29 నాటికి రేషన్‌ సరుకులు ఇస్తారు. కేజీ పప్పుతో పాటు, రేషన్‌ సరకు ఉచితం. మరో వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం. ఏప్రిల్‌ 4న గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వాటిని అందచేస్తారు.
 5. కరోనా బాధితుల కోసం ప్రత్యేక యాప్ తయారీ.

Sorry, your browser cannot display this map

తెలంగాణలో

ఇవి దొరుకుతాయి:

1. ఆహారం, నిత్యావసరాలు

2. పాలు, బ్రెడ్

3. పండ్లు, కూరగాయలు

4. మాంసం, చేపలు

5. విద్యుత్, నీరు

6. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ సర్వీసులు

7. ఆహారం, మందులు, మెడికల్ సామగ్రి ఆన్‌లైన్ డెలివరీ

8. పెట్రోలు, గ్యాస్, నూనె, వాటికి సంబంధించిన వ్యవహారాలు

9. ఆసుపత్రులు, మందుల షాపులు, కళ్లజోళ్ల షాపులు

10. బ్యాంకులు, ఏటీఎం, టెలికాం, ఇంటర్నెట్, పోస్టల్, ఐటీ సేవలు

పైన పేర్కొన్న వస్తువుల అమ్మకంతో పాటు వాటి నిల్వ, రవాణా వసతులకు కూడా అనుమతి ఉంది.

ఇవి మూసివేత:

 1. అత్యవసర సరకుల రవాణాకు తప్ప, రాష్ట్ర సరిహద్దుల మూసివేత. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు కూడా నిలిపివేత
 2. ఆర్టీసీ, సెట్విన్, మెట్రో, టాక్సీలు, ఆటోలు కూడా నిలిపివేత
 3. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడే వాటన్నిటికీ నిషేధం
 4. అన్ని షాపులు, వాణిజ్య సముదాయాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు గోడౌన్లు మూసివేయాలి.
 5. పరీక్ష పేపర్లు దిద్దడం సహా అన్ని విద్యా సంబంధిత కార్యక్రమాల నిలుపుదల

వీరికి మినహాయింపు:

 1. కలెక్టర్, డివిజినల్, మండల అధికారులు
 2. పోలీసులు, వైద్య, స్థానిక సంస్థలు, అగ్నిమాపక, పన్నులు, రవాణా, స్టాంపులు - రిజిస్ట్రేషన్లు శాఖలు, వ్యవసాయం, సంబంధిత శాఖలు, సివిల్ సప్లైస్ సిబ్బంది
 3. కాలుష్య నియంత్రణ మండలి, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్ వంటి నియంత్రణ సంస్థలు
 4. పైవాటికి సంబంధించిన కేంద్ర సర్వీసులు
 5. సెక్యూరిటీ సేవలు (ప్రైవేటు సెక్యూరిటీ సహా)
 6. నిత్యావసరాలకు, కోవిడ్ చికిత్సకూ ఉపయోగపడే ప్రైవేటు సేవలు
 7. ఎయిర్‌పోర్టు సంబంధిత సేవలు
 8. నిత్యావసరాల సరఫరాకు సంబంధించిన అన్ని సేవలు
 9. వైద్యానికి, నిత్యావసర సరకులకు మాత్రమే ప్రైవేటు వాహనాలకు అనుమతి
 10. మందుల తయారీ పరిశ్రమలు, నిత్యావసరాలకు సంబంధించిన రైస్ మిల్లులు, మేత తయారీ యూనిట్లకు అనుమతి

ఎవరు ఏం చేయాలి?

 1. ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు బయటకు వస్తే ప్రభుత్వ క్వారంటైన్‌కి తరలించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
 2. ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకూడదు. అవసరం ఉంటే ఒకరే రావాలి.

ప్రభుత్వ ఏర్పాట్లు

 1. తెల్లకార్డు ఉన్న 87,59,000 మందికి మనిషికి పన్నెండు కేజీల బియ్యం ఇస్తారు. కుటుంబానికి 1500 రూపాయలు ఇతర సరుకులు కొనుక్కోవడానికి ఇస్తారు.
 2. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలన్నీ తమ దగ్గర పనిచేసే వారికి లాక్ డౌన్ సమయంలో కూడా జీతాలు ఇవ్వాలి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారికి కూడా జీతాలివ్వాలి. లేకపోతే చట్టప్రకారం చర్యలుంటాయి.
 3. అంగన్ వాడీలు మూసేసి, మహిళలకు, పిల్లలకు అందాల్సిన రేషన్ ఇంటికే ఇస్తారు.
 4. మార్చి, ఏప్రిల్‌లో ప్రసవం చేసుకోబోయే మహిళలను గుర్తించి వారికి రవాణా సౌకర్యం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.
 5. ధాన్యం కొనుగోళ్లలో కూడా మనుషులు దగ్గరగా ఉండకుండా ఏర్పాట్లు చేస్తారు.
 6. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూనే 3 అడుగుల దూరం పాటించే ఏర్పాట్లు చేయాలి.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: తూర్పు గోదావరి జిల్లాలో 150 మందితో ప్రార్థనలు చేయించిన పాస్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

కరోనావైరస్: కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఎవరెస్ట్ ఎక్కుతున్న చైనా పర్వతారోహకులు

కరోనావైరస్‌: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం

కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా

కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి

కరోనా వైరస్‌: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..

కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా

కరోనావైరస్: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం