కరోనావైరస్‌ను గెలిచిన 113 ఏళ్ళ బామ్మ

ఫైల్ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మరియా బ్రన్యస్‌లో కరోనావైరస్‌ లక్షణాలు స్వల్పంగా కనిపించాయి.

స్పెయిన్‌ దేశం మొత్తం మీద అతి పెద్ద వ‌య‌స్కురాలిగా భావిస్తున్న 113 ఏళ్ల మ‌రియా బ్ర‌న్య‌స్‌... క‌రోనావైర‌స్ ఇన్ఫెక్ష‌న్ నుంచి కోలుకున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

మార్చిలో ఇక్క‌డ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన అనంత‌రం మ‌రియాకు క‌రోనావైర‌స్ సోకింది.

స్వ‌ల్ప‌ ల‌క్ష‌ణాలున్న మ‌రియా కొన్ని వారాల‌పాటు ఐసోలేష‌న్‌లో గ‌డిపారు.

1918-19లో ఫ్లూ మ‌హ‌మ్మారి, 1936-1939 స్పానిష్ అంత‌ర్యుద్ధాల‌నూ మ‌రియా చూశారు.

"ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యంగా, చాలా బాగున్నారు. ఆమె మాట్లాడాల‌ని అనుకుంటున్నారు. ఏం జ‌రిగిందో వివ‌రించాల‌ని అనుకుంటున్నారు" అని ఆమె కుమార్తె ట్వీట్ చేశారు.

మ‌రియా 1907లో మెక్సికోలో జ‌న్మించారు. రెండేళ్ల వ‌య‌సులో శాన్‌ఫ్రాన్సిస్కోకు ఆమెను తీసుకెళ్లారు. అనంత‌రం మొదటి ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టు అయిన‌ త‌న‌ తండ్రితో కెట‌లోనియా ప్రావిన్స్ గిరోనాకు వ‌చ్చారు. ఆమెకు ముగ్గురు పిల్ల‌లున్నారు. వారిలో ఒక‌రికి ఇటీవ‌ల 86ఏళ్లు వ‌చ్చాయి. ఆమెకు 11 మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు. పెద్ద మ‌న‌వ‌డి వ‌య‌సు 60. మ‌రియాకు 13 మంది ముని మ‌న‌వ‌ళ్లు కూడా ఉన్నారు.

ఆమె రెండు ద‌శాబ్దాలుగా ఒలాట్ న‌గ‌రంలోని వృద్ధాశ్ర‌మంలో ఉంటున్నారు.

"నేను ఇప్పుడు జీవించ‌‌డం త‌ప్ప ఇంతేమీ చేయ‌ట్లేదు" అని లా వెన్‌గార్డియా ప‌త్రిక‌తో చెప్పారు మరియా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)