టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్ చేయాల‌ని ఎందుకు డిమాండ్లు వ‌స్తున్నాయి? తాజా వివాదం ఏంటి?

  • రాజేశ్ పెదగాడి
  • బీబీసీ ప్రతినిధి
టిక్ టాక్

ఫొటో సోర్స్, Reuters

చిన్న చిన్న వీడియోలను షేర్ చేసుకునే వేదిక అయిన టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలంటూ ట్విట‌ర్‌లో #Tiktokbanindia, #Tiktokdown లాంటి హ్యాష్‌ట్యాగ్‌లను నెటిజ‌న్లు ట్రెండ్ చేస్తున్నారు.

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ (ఎన్‌సీడ‌బ్ల్యూ) సైతం ఈ యాప్‌ను బ్యాన్ చేయాల‌ని కేంద్రానికి లేఖ రాస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ప్ర‌ముఖ యూట్యూబ‌్ ఫాలోవ‌ర్లు కూడా టిక్‌టాక్‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రోవైపు గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ యూజ‌ర్‌ రేటింగ్ కూడా 4.5 నుంచి 1.3కి ప‌డిపోయింది.

ఇంత‌కీ తాజాగా టిక్‌టాక్ వివాదాల సుడిలో మున‌గ‌డానికి కార‌ణం ఏమిటి? దీన్ని బ్యాన్ చేయాలంటున్న‌ కొంద‌రు నెటిజ‌న్ల డిమాండ్‌కు ఎన్‌సీడ‌బ్ల్యూ ఎందుకు మ‌ద్ద‌తు ప‌లుకుతోంది?

భారత్‌లో టిక్ టాక్ డౌన్‌లోడ్లు 60 కోట్లు

చైనాకు చెందిన ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్ భారత్‌లోని టీనేజర్ల నుంచి అన్ని వయసులవారినీ ఆకట్టుకుంటోంది.

గ్రామాల నుంచీ పెద్ద పెద్ద నగరాల వరకూ ఈ యాప్‌ ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది.

టిక్‌టాక్ వివరాల ప్రకారం.. 2020 ఆరంభంనాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా టిక్‌టాక్ డౌన్‌లోడ్ల సంఖ్య‌ రెండు వంద‌ల కోట్లకు చేరింది. ఒక్క‌ భార‌త్ నుంచే 60 కోట్ల డౌన్‌లోడ్లు జ‌రిగాయి.

గ‌త అక్టోబ‌రు-డిసెంబ‌రు త్రైమాసికంలో టిక్‌టాక్ దాదాపు రూ.25 కోట్ల రెవెన్యూను ఆర్జించిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ జులై-సెప్టెంబ‌రులో రూ.వంద కోట్లు ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న‌ట్లు తెలిపింది.

యూజ‌ర్ల కోసం ఏఆర్ ఫిల్ట‌ర్లు, లెన్స్‌లు లాంటి స‌రికొత్త హంగుల‌ను ప్ర‌వేశ‌పెడుతూ ప్ర‌ముఖ‌ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ల ప్ర‌క‌ట‌న‌ల‌ను ఇది ఆక‌ర్షిస్తోంది.

2018లో ప్రపంచంలో ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్స్‌లో టిక్‌టాక్ నంబర్ వన్‌గా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images

వివాదాలు

పాపులారిటీ పెరగడంతోపాటే భారత్‌లో ఈ యాప్‌ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.

టైమ్‌ మ్యాగ‌జైన్ నెక్స్ట్ జ‌న‌రేష‌న్ లీడ‌ర్స్ 2019లో చోటు సంపాదించిన ప‌ది మందిలో ఒక‌రైన భార‌త యూట్యూబ‌ర్ క్యారీ మినాటీ (అజ‌య్ నాగ‌ర్‌) వీడియోతో తాజాగా ఈ వివాదం మొద‌లైంది.

నెల రోజుల క్రితం టిక్‌టాక్‌లో 3.7 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్న ఆమీర్ సిద్దిఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దానిలో త‌మ టిక్‌టాక్ వీడియోల‌ను రోస్ట్ చేస్తున్న యూట్యూబ‌ర్ క్యారీ మినాటీని ల‌క్ష్యంగా చేసుకుని ఆరోప‌ణ‌లు గుప్పించారు.

త‌మ టిక్‌టాక్ కంటెంట్‌ను క్యారీ మినాటీ చౌర్యం చేస్తున్నార‌నీ అంటూ.. యూట్యూబ‌ర్ల కంటే టిక్ టాక‌ర్లే ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వార‌ని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోను ఆమీర్ డిలీట్‌ చేశారు.

దీనికి స్పంద‌న‌గా యూట్యూబ్‌లో 16.7 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్లున్న‌ క్యారీ మినాటీ ఓ వీడియో చేశారు. దీనిలో ఆమీర్ చెసిన ప్ర‌తి వ్యాఖ్య‌పైనా క్యారీ మినాటీ స్పందించారు. వ్యాక‌ర‌ణ దోషాలతోపాటు ఇత‌ర లోపాల‌నూ ఎత్తిచూపుతూ మ‌రోసారి తీవ్రంగా రోస్ట్ చేశారు. ఈ వీడియో మే 7న క్యారీ మినాటీ అప్‌లోడ్ చేశారు.

అయితే క్యారీ మినాటీ వీడియో త‌మ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని యూట్యూబ్ దానిని తొల‌గించింది. దీంతో చాలా మంది నెటిజ‌న్లు క్యారీ మినాటీకి మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేశారు. ఆమీర్‌తోపాటు టిక్‌టాక్ మొత్తాన్ని నిషేధించాల‌ని హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేశారు.

యాసిడ్ వీడియోతో తీవ్ర స్థాయికి...

ఇదే స‌మ‌యంలో ఆమీర్ సోద‌రుడు ఫైజ‌ల్ సిద్ధిఖీ చేసిన ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

టిక్‌టాక్‌లో 13 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్న ఫైజ‌ల్ నెల రోజుల క్రితం ఓ వీడియో చేశారు.

"అత‌డి కోస‌మేనా న‌న్ను వ‌దిలేశావు? ఇప్పుడు అత‌డు నిన్ను వ‌దిలేశాడు.." అని వీడియోలో ఫైజ‌ల్ వ్యాఖ్యానించాడు. అనంత‌రం చేతిలో ఉన్న ఓ పానీయాన్ని అమ్మాయిపై అత‌డు పోసాడు.. దీంతో ఆమె మొహం వికృతంగా మారుతుంది.

ఈ వీడియో.. యాసిడ్ దాడుల‌ను ప్రోత్స‌హించేలా ఉంద‌ని తాజాగా దుమారం చెల‌రేగింది.

‘ఫాలోవర్ల కోసమే బతుకుతున్నారు’ - ఎన్‌సీడ‌బ్ల్యూ

ఈ వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో జాతీయ మ‌హిళా క‌మిష‌న్ (ఎన్‌సీడ‌బ్ల్యూ) ఛైర్‌ప‌ర్స‌న్ రేఖా శ‌ర్మ‌ను ట్యాగ్‌చేస్తూ బీజేపీ నాయ‌కుడు తేజేంద‌ర్ సింగ్ బ‌గ్గా ట్వీట్‌చేశారు. అనంత‌రం కొద్ది‌సేప‌టికే ఈ వీడియోను డిలీట్ చేయాల‌ని టిక్‌టాక్‌ను కోరుతూ ఎన్‌సీడ‌బ్ల్యూ ట్విట‌ర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వ‌చ్చింది.

"ఫైజ‌ల్ సిద్దిఖీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర డీజీపీని కోరాం. ఎన్‌సీడ‌బ్ల్యూ స్పందించ‌డంతో ఫైజ‌ల్ వీడియోను టిక్‌టాక్ డిలీట్ చేసింది. అయితే అత‌న్ని బ్లాక్ చేయాల‌ని సూచించాం" అని రేఖ కూడా ట్వీట్ చేశారు.

ఫైజ‌ల్‌పై సైబ‌ర్ పోలీసులకు ఆశిష్ అనే నెటిజ‌న్ ఫిర్యాదు కూడా చేశారు.

ఫైజ‌ల్ వీడియో అనంత‌రం అత్యాచారాల‌ను ప్రోత్స‌హించేలా క‌నిపించే మ‌రొక వీడియోను షేర్‌చేస్తూ.. ట్విట‌ర్‌లో రేఖ‌ను బ‌గ్గా ట్యాగ్‌చేశారు. దీనిపై రేఖ స్పందించారు.

"అస‌లు ఈ టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాల‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వానికి లేఖ రాస్తున్నా. అభ్యంత‌ర‌క‌ర వీడియోల‌తోపాటు యువ‌త‌ను వ్య‌ర్థంగా జీవితాన్ని గ‌డిపేందుకు టిక్‌టాక్ కార‌ణ‌మ‌వుతోంది. కొంద‌రు ఫాలోవ‌ర్స్ కోస‌మే బ‌తుకుతున్నారు. ఫాలోవ‌ర్స్ త‌గ్గితే చచ్చిపోతున్నారు కూడా"అని ఆమె ట్వీట్ చేశారు.

ఈ వివాదాల న‌డుమ టిక్‌టాక్ ఇండియా స్పందించింది.

"సుర‌క్షితమైన‌‌, సానుకూల వాతావ‌ర‌ణాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే టిక్‌టాక్ మొద‌టి ప్రాధాన్యం. సామాజిక మార్గ‌ద‌ర్శ‌కాల విష‌యంలో మా బృందాలు క‌చ్చితంగా ఉంటాయి. కొన్ని విష‌యాల్లో మేం అస‌లు రాజీప‌డం. మా నిబంధ‌న‌ల‌కు వినియోగ‌దారులు క‌ట్టుబ‌డి ఉండాలి"

"గ‌త కొన్ని రోజులుగా మా నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మైన కొంత స‌మాచారం మాకు క‌నిపించింది. దాన్ని తొల‌గించ‌డంతోపాటు ఆ వినియోగ‌దారుల్నీ బ్లాక్‌చేశాం. ఈ విష‌యంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాం" అని వివ‌రించింది.

ఈ ప‌రిణామాల న‌డుమ టిక్‌టాక్‌ను బ్యాన్‌చేయాలంటూ ట్విట‌ర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

ఇప్ప‌టికే కోర్టు ఆదేశాలు

టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు రావ‌డం, ట్విట‌ర్‌లో టిక్‌టాక్ హ్యాష్‌‌ట్యాగ్‌లు ట్రెండ్ కావ‌డం ఇదేమీ తొలిసారి కాదు.

చిన్నారులు లైంగిక వేధింపులు ఎదుర్కొనేందుకు టిక్‌టాక్ కార‌ణ‌మ‌వుతోంద‌ని, దీన్ని బ్యాన్ చేయాల‌ని గ‌త ఏడాది ఏప్రిల్‌లో మ‌ద్రాస్ హైకోర్టును త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆశ్ర‌యించింది.

దీంతో టిక్‌టాక్ డౌన్‌లోడ్ చేసుకోకుండా తాత్కాలికంగా నిషేధం విధించాల‌ని కేంద్రానికి సూచించింది. అయితే, వేధింపుల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కంపెనీ హామీ ఇవ్వ‌డంతో ఈ నిషేధం ఎత్తివేసింది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)