ఇండియా లాక్‌డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు

ఇండియా లాక్‌డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు

చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఈ వలస కూలీలు తమిళనాడు నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన బయలుదేరారు.2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ సొంతూళ్లకు వీరు 18 నెలల శిశువుతో రెండోరోజు నడక ప్రారంభించారు.

‘‘మాకు ఎలాంటి వాహనం లేదు. మేమేం చేయగలం? అందుకే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం’’.

మరి ఆహారం, నీళ్లు ఎలా?‘‘ఆహారం మాకు ఎక్కడి నుంచి వస్తుంది? నిన్న బయల్దేరాం... నడుస్తూనే ఉన్నాం. తిండీ లేదు, నీళ్లూ లేవు. దారిలో ఏమైనా దొరుకుతాయేమో చూడాలి.’’

ఎందుకు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు?

‘‘నా భర్త, కుటుంబం అక్కడే ఉన్నారు. ఇక్కడ పని కోసం నా కూతురు, నేను వచ్చాం. లాక్ డౌన్‌కు ముందు నా భర్త అక్కడకు వెళ్లారు. రవాణా లేకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని ఒక మహిళా కూలీ చెప్పారు.

చెన్నై నుంచి బయల్దేరిన వీళ్లంతా ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు దాటారు. కొందరు రాత్రీ పగలూ కూడా నడుస్తుంటే, కొందరు పగలు విశ్రాంతి తీసుకుని, రాత్రి సమయంలో నడుస్తున్నారు.

కొందరు సైకిళ్లపై వెళ్తున్నారు. వాళ్లు ఎలాంటి ఆహారం, విశ్రాంతి లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు.

సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడంతో సైకిళ్లతోపాటు ఆగిపోయిన ఎంతోమంది ఇక్కడ కనిపిస్తున్నారు.

తమ వాళ్లకు దూరంగా ఉండటం చాలా బాధగా ఉందని కొందరంటున్నారు.

వందల సంఖ్యలో మహిళలు తమ పిల్లలను ఎత్తుకుని, తమ స్వగ్రామాల వైపు నడుస్తున్నారు.

కరోనావైరస్‌ను నియంత్రించడంలో ప్రధాని మోదీ ఎలా వ్యవహరించారో వారిలో కొందరు చెప్పారు. వారేం చెప్పారో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)