కలలకు అర్ధం ఏమిటి? భవిష్యత్తుకు సూచికలా? మనో స్థితికి ప్రతీకలా?
- కేథ్ పౌండ్
- బీబీసీ కల్చర్

ఫొటో సోర్స్, Getty Images
కలలకు సంబంధించి హెన్రీ ఫుసెలీ వేసిన సుప్రసిద్ధ '' ది నైట్మేర్'' (1781) గతంలో వచ్చిన కలల విశ్లేషణకు భిన్నంగా ఉంటుంది
ప్రస్తుతం నెలకొన్న చిత్రమైన పరిస్థితుల్లో కలలు కూడా ఇంతకు ముందుకన్నా స్పష్టంగా వస్తున్నాయంటున్నారు చాలామంది. చిత్రకళ ద్వారా మన కలలను, మనల్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు అనే అంశపై సైకోథెరపిస్ట్ ఫిలిప్పా పెర్రీతో మాట్లాడారు కేథ్ పౌండ్.
శతాబ్దాలుగా కలలు తత్వవేత్తలకు, చిత్రకారులకు అత్యంత ఆకర్షణీయమై అంశంగా మిగిలిపోయాయి. స్వప్నాలు దైవిక సందేశాలుగా, మనలోని సృజనాత్మకతను బైటికి తెచ్చేందుకు, ముఖ్యంగా 19వ శతాబ్దంలో వచ్చిన మనస్తత్వ విశ్లేషణ సాయంతో నిద్రాణ ఆలోచనలను అర్ధం చేసుకోడానికి ప్రధాన సాధనాలుగా నిలిచాయి. గత కొద్దివారాలుగా మనలో చాలామందికి చాలా స్పష్టమైన కలలు వస్తున్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా కలలను అర్ధం చేసుకోడానికి, వాటిని విశ్లేషించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. ఇలా చేయడం ద్వారా మన సొంత అనుభవాలను జోడించి కలల్లోని రహస్యాలను కూడా వెలికి తీయవచ్చు.
ఈ రోజుల్లో మనం ఎందుకు స్పష్టమైన కలలను కంటున్నాం? ''మనం ఇప్పుడొక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి'' అన్నారు సైకోథెరపిస్ట్ ఫిలిప్పా పెర్రీ. ప్రస్తుతం ఆమె ''మీ కలలను నా ట్విటర్ ద్వారా పంచుకోండి'' అంటూ తన ఫాలోయర్స్‌కు పెట్టిన పోస్టుతో వరదలా వస్తున్నసమాధానాలను విశ్లేషించే పనిలో బిజీగా ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆల్బ్రేచ్ట్ డ్యూరర్ చిత్రించిన డ్రీమ్విజన్ (1525) వెస్ట్రన్ ఆర్ట్‌లో ఒక కళాకారుడు చిత్రించిన తొలి స్వప్న రూపంగా నిలిచింది
ఆల్బ్రేచ్ట్ డ్యూరర్ చిత్రించిన డ్రీమ్విజన్ (1525) అనే పెయింటింగ్ పశ్చిమ దేశాలలో ఒక చిత్రకారుడి స్వీయ కలకు తొలి చిత్రణగా నిలిచిపోయింది. వాటర్ కలర్‌తో నడుస్తూ చిత్రించినట్లున్న ఈ చిత్రంలో ఆకాశం నుంచి భారీ జలధారలు తనను ముంచేయడానికి వస్తున్నట్లుగా చిత్రించారు. ''శరీరంలో ప్రతి అవయవం వణికిపోతుండగా నిద్రలేచాను. దీన్నుంచి కోలుకోడానికి నాకు చాలా సమయం పట్టింది'' అని డ్యూరర్ రాశారు.
అయితే కలల నిఘంటువులో ఇలాంటి విషయాలేమీ ఉండవని ఆమె తన శిక్షణలో నేర్చుకున్నారు. అయితే దశాబ్దాల తన ప్రాక్టీస్ తర్వాత ''కొన్నివస్తువులకు కొన్ని అర్ధాలుంటాయి'' అని చెప్పగలరామె. ఎవరైనా నీళ్ల గురించి కలగంటే అది ఫీలింగ్స్‌కు సంబంధించింది అని అర్ధం. ఆమె అంచనా ప్రకారం తన కలను చిత్రించిన డ్యూరర్ అనే చిత్రకారుడు కొన్ని ఫీలింగ్స్‌లో మునిగిపోతున్నాడు అని అర్ధం. అయితే ఆ ఫీలింగ్స్ ఏంటో మాత్రం చెప్పడం కష్టం అంటారామె. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, మెలకువ వచ్చాక మర్చిపోయినా, మనలో వినాశనానికి సంబంధించిన భయం మాత్రం ఉంటుంది.
ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే పెర్రీకి వచ్చిన ట్విటర్ మెసేజ్‌లలో కూడా చాలామంది తమ కలల్లో నీరు కనిపించినట్లు చెప్పారు. ముఖ్యంగా తాను సునామీ అలలపై సర్ఫింగ్ చేస్తున్నట్లు కలగన్న ఓ మహిళ, ఫీలింగ్స్ విషయంలో డ్యూరర్ను మించినట్లు కనపించారు.
ఫొటో సోర్స్, Getty Images
పునరుజ్జీవన కాలంలో బైబిల్‌కు సంబంధించిన జాకబ్స్ డ్రీమ్లాంటి చిత్రాలను 1518లో రఫాయిల్ వాటికన్లోని పలాజ్జో అపోస్టలిలో భవనపు సీలింగ్‌పై చిత్రీకరించారు
డ్యూరర్ చిత్రించిన చిత్రానికి మాత్రం కొన్ని మినహాయింపులున్నాయి. ప్రాచీనకాలంనాటి కలల తత్వ అధ్యయనంపై పునరుజ్జీవనకాలం ఆసక్తిని పెంచినా, అది ప్రస్తుతం ఉన్న క్రైస్తవం సంప్రదాయంతో రాజీపడింది. ఈ క్రైస్తవ సంప్రదాయం అన్యమతాల కలల విశ్లేషణలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చాలా స్వప్నచిత్రణలు బైబిల్ తరహాలో ఉంటాయి.
ఈజిప్టు ఫారోల కోసం జోసెఫ్ విశ్లేషించిన జాకబ్ కలల వృత్తాంతాలు విశేషమైన అంశాలు. రఫాయిల్ 1518లో వీటిని వాటికన్లోని పలాజ్జో అపోస్టలికో భవనంలోని సీలింగ్‌పై చిత్రీకరించాడు. ఇవి స్వప్నాలకు స్పష్టమైన రూపాలు. గాలిలో తేలుతూ ఉన్నట్లు కనిపించే ఈ చిత్రాల పరమార్ధం మాత్రం మానవాతీతమైనది.
లోరెంజో లోటో చిత్రించిన ''స్లీపింగ్ అపోలో'', ''మ్యూజెస్ విత్ ఫేమ్'' (1549)లాంటి పౌరాణిక ఇతివృత్తాలు స్వప్నాలకు, ప్రేరణకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేందుకు ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తాయి. ''స్లీపింగ్ అపోలో'' చిత్రం మైదానంలో దుస్తులు విప్పేసి స్వేచ్ఛాయుత ప్రపంచాన్నిఆస్వాదించే తత్వాన్నిగుర్తు చేస్తుంది. మనలోని నిద్రాణ సృజనాత్మకతను నిద్ర వెలికి తీయగలదని ఇది నిరూపిస్తుంది.
హిరోనిమస్ బాష్ వేసిన చిత్రాలు చాలామందిలో కలిగే పీడకలలకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. వారి ఊహాత్మకతను కేవలం చిత్రాలలో కనిపించే స్వర్గం, నరకాలకు ప్రతిరూపాలుగానే అర్ధం చేసుకోకూడదు. ఇవి పాపం చేసిన వారు పశ్చాత్తాపం చెందకపోతే ఏం జరుగుతుందో చెప్పే సూచికలుగా, రాబోయే శిక్షలుగా కనిపిస్తాయి. బాష్ అనుచరుడు చిత్రించిన ''ది విజన్ ఆఫ్ టుండేల్ (1520-30) దీనికి స్పష్టమైన ప్రతిరూపంలా ఉంటుంది. ఇందులో పాపాత్ముడైన ఒక యోధుడు తన కలలో నరకంపై తేలియాడుతున్నట్లు కనిపిస్తాడు.
ఫొటో సోర్స్, Alamy
స్వర్గ నరకాలకు సంబంధించి బాష్ అతని అనుచరులు అనేక పెయింటింగ్స్ వేశారు. అందులో ''విజన్ ఆఫ్ టుండేల్ ( 1520-30) ఒకటి
కళాకారులకు సంబంధించిన అంశంగా మారిన స్వప్నాలకు ఈ జ్జాన, హేతుయుగంలో స్థానం లేకుండా పోయింది. అయితే 18వ శతాబ్ది చివరిలో హెన్రీ ఫుసెలీ చిత్రించిన 'ది నైట్మేర్' (1781) బాగా ప్రసిద్ధిచెందింది. ఇందులో సాహిత్య, దైవిక లేదా కళా చారిత్రక భావాలేవీ లేకుండా, ఇంతకు ముందున్న భాష్యాలను విరుద్ధంగా కనిపించే ఈ రూపంలో కొందరికి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ విశ్లేషణ సిద్ధాంతాలు కనిపించాయి.
పెర్రీ ఈ చిత్రాన్ని కేవలం రాత్రి కలలో కనిపించే భీతావహ దృశ్యాలకు ప్రతిరూపంగానే చూడలేదు. అసహాయంగా పడి ఉన్న మహిళ, ఆమె నడుము భాగంపై వికృతకాంక్షతో చూస్తున్న ఒకగుర్రం, ఆమెపై మల విసర్జన చేస్తున్నట్లు కూర్చున్న ఒక భూతం...ఇవన్నీ ఒక పురుషుడు ఎన్నిసార్లయినా పొందగలిగే స్వప్నస్ఖలనాలను మహిళలకు దూరం చేయడమే. ఇంకా చెప్పాలంటే...సమాజంలో ఒక మహిళలకు ఊహాశృంగారం, స్వప్నాలు చాలా తక్కువగా అంగీకరించబడతాయి.
మీ స్వప్నాలను చిత్రించండి
కలలను కళాత్మక వ్యక్తీకరణగా ముందుకు తెచ్చింది ప్రతీకవాదులే. అయితే గుస్తావ్ మోరీ, ఓడిలిన్ రెడాన్లాంటి చిత్రకారులు స్వప్నాల్ని వాస్తవికతను , రహస్యాలను తెలుసుకునే సాధనాలుగా అభివర్ణించారు. రెడాన్ 1882లో చిత్రించిన ''ది ఐ లైక్ ఏ స్ట్రేంజ్ బెలూన్ మౌంట్స్ టువర్డ్స్ ఇన్ఫినిటీ'' చిత్రంలో ఒక కన్ను హాట్ ఎయిర్ బెలూన్లాగా కనిపిస్తుంది. అది ఒక మనిషిని తీసుకుని ఆకాశంలోకి వెళుతుంటుంది. ఇది కలల్లో తరచూ కనిపించే అసహజమైన రూపం. ఇది సహజంగానే అధివాస్తవికవాదు(సర్రియలిస్టు)లపై ప్రభావం చూపించింది.
అధివాస్తవికవాదం ప్రధానంగా ఫ్రాయిడ్ ప్రతిపాదించిన స్వప్నభాష్యాల నుంచి ప్రేరణ పొందింది. ''వ్యక్తి తన కోరికలపై తనకు తానుగా విధించుకున్న సెన్సార్షిప్ కారణంగా వాటిని స్పప్నాల రూపంలో నెరవేర్చుకుంటాడు. మెలకువ వచ్చిన తర్వాత వాటికి అర్ధం ఉండదు'' అని సిగ్మండ్ ఫ్రాయిడ్ స్వప్నసిద్ధాంతం చెబుతుంది. ఈ కలలలో దాగిన అంతరార్ధాన్ని ఛేదించడం లేదా గుర్తించడం ద్వారా, వ్యక్తుల మానసిక బాధలను మనస్తత్వ విశ్లేషకులు నయం చేయగలుగుతారు.
ఫొటో సోర్స్, Getty Images
కలలకు సంబంధించి హెన్రీ ఫుసెలీ వేసిన సుప్రసిద్ధ '' ది నైట్మేర్'' (1781) గతంలో వచ్చిన కలల విశ్లేషణకు భిన్నంగా ఉంటుంది
అయితే కలలను విశ్లేషించడం ద్వారా బాధలను నయం చేయవచ్చని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెబితే, అధివాస్తవికవాదులు (సర్రియలిస్టులు) మాత్రం అవి మనిషిలోని తెలియని సృజనాత్మకతను వెలికి తీసే సాధనాలుగా కలల్ని పేర్కొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బూర్జువా సంస్కృతికి ప్రతిక్రియగా వారు దాన్ని ఎంచుకున్నారు.
సర్రియలిస్ట్ చిత్రీకరణలో కలలు కనే వ్యక్తి కనిపించడు. దానికి బదులుగా ఆ కళను చూస్తున్నవ్యక్తి స్వప్నాలలోని అంతర్క్రియలను గమనిస్తుంటాడు. 'జార్జియో డీ చిరికో' వేసిన ఆందోళన నిండిన కలల చిత్రాలు, మార్క్స్ ఎర్నెస్ట్ ఆసక్తికర పెయింటింగ్స్, నానారకాల పెయింటింగ్స్‌ను అతికించి చేసిన చిత్రాలు, మల్టిమీడియాపై తయారు చేసిన పెయింటింగ్స్ ఒక పజిల్లా మారి, వాస్తవికతపై వీక్షకుడి అవగాహనను సవాల్ చేస్తాయి.
ఫొటో సోర్స్, Getty Images
రెడాన్ వేసిన ''ది ఐ లైక్ ఏ స్ట్రేంజ్ బెలూన్ మౌంట్స్ టువర్డ్స్ ఇన్ఫినిటీ''(1882) పెయింట్ సర్రియలిస్టుల మీద ప్రభావం చూపింది
ఫ్రాయిడ్ మొదట్లో వారి సిద్ధాంతాలను చూసి అయోమయానికి గురయ్యారు. కానీ 1938లో సాల్వడార్ డాలీని కలిశాక తన సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేశారు. డాలీ మెటామార్ఫోసిస్ ఆఫ్ నార్సిస్సస్ (1937) అనే పెయింటింగ్‌ను ఫ్రాయిడ్‌కు చూపించారు. ఈ పెయింటింగ్‌లో నార్సిస్సస్ అనే గ్రీకువీరుడు ఒక సరస్సులో తన ప్రతిబింబాన్ని చూస్తాడు. అందులో అతని చేతిలో ఒక పగిలిన గుడ్డు, దాని నుంచి నుంచి ఒక పువ్వు బైటికి వచ్చి కనిపిస్తుంటాయి. అంతకు ముందు సర్రియలిస్టులను ఫ్రాయిడ్ పిచ్చివాళ్లుగా భావించేవారు. కానీ డాలీతో సమావేశం తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
2017లో బీబీసీ ఫోర్లో ప్రసారమైన ''హౌ టు బి ఏ సర్రియలిస్ట్ విత్ ఫిలిప్పా పెర్రీ'' అనే డాక్యుమెంటరీలో స్వప్నాలకు సంబంధించి సిద్ధాంతాలను సర్రీయలిస్ట్ కోణంలో ఆవిష్కరించారు పెర్రీ. బ్యూరో ఆఫ్ సర్రియలిస్ట్ రీసెర్చ్‌ను స్థాపించిన ఆమె, ముందుగా ప్రజలను తమకు వచ్చిన కలలను వివరించమన్నారు. ఆ తర్వాత వాటిని చిత్రించమన్నారు.''ఇక్కడ తెలుసుకోవాల్సిందేమిటంటే...కలల నుంచి బైటపడ్డాక వారు ఏం సాధించారు అన్నది కీలకం'' అన్నారామె.
ఫొటో సోర్స్, Alamy
సాల్వడార్ డాలీ వేసిన మెటామార్ఫొసిస్ ఆఫ్ నార్సిస్సస్(1937) కలల్లోని అంతగర్గత క్రియలను చూపిస్తాయి
ఇక పేషెంట్ల విషయానికి వచ్చినప్పుడు జర్మన్ సైకియాట్రిస్ట్ ఫ్రిజ్ పెర్ల్స్ రూపొందించిన గెస్టాల్ట్ థెరపీని పెర్రీ ఉపయోగించేవారు. ఇందులో కలలో కనిపించిన వస్తువుల కోణం నుంచి మీకు మీరే కలలను విశ్లేషించడం అనే విధానం ఉంటుంది. దీని వెనకున్న ఉద్దేశమేంటంటే కలలో కనిపించే ప్రతి వస్తువు, ప్రతిభాగం మీ నుంచి వచ్చిందే. అంటే మీకు వాటి గురించి స్పష్టంగా తెలుసు. అవి ఏం చెబుతాయో కూడా తెలుసు. దీనివల్ల మీ గురించి మీకు అవగాహన ఏర్పడుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భిన్నవిధానాలను అవలంబించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ''మీ కలలను చిత్రించండి. వాటి గురించి రాయండి. ఇవన్నీ మీ కలల్లోని భావాలను తెలుసుకోడానికి ఉపయోగపడతాయి. మీరు వాటిని సొంతం చేసుకుంటే, వాటి మీద మీరు అదుపు సాధించగలరు '' అంటారామె.
ఏమో ఎవరికి తెలుసు. మనం కూడా మనలో మనకు తెలియని సృజనాత్మకతను బైటికి తీసుకురాగలమేమో!
ఇవి కూడా చదవండి:
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- కరోనావైరస్ సైలెంట్ స్ప్రెడర్స్: మన మధ్యే ఉంటూ చాపకింద నీరులా వైరస్‌ను వ్యాపింపచేస్తోంది వీరేనా?
- గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపేశారు
- ఏనుగు మరణం: కేరళలోని గుళ్లలో 600 ఏనుగులను చంపేశారని మేనకా గాంధీ ఆరోపణలు.. అది నిజమేనా?
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)