హీరోయిన్ ప్రణీత ఇంటర్వ్యూ: ‘ఎంతో మంది బాధపడుతున్నారు.. కరోనాతో కాదు, ఆకలితో.. అందుకే నేను ఇల్లు దాటాను’

హీరోయిన్ ప్రణీత ఇంటర్వ్యూ: ‘ఎంతో మంది బాధపడుతున్నారు.. కరోనాతో కాదు, ఆకలితో.. అందుకే నేను ఇల్లు దాటాను’

''లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత నా స్టాఫ్, మరికొందరు సినీ కార్మికులు ఇబ్బంది పడ్డారు. వారితో పాటు బయట ఉన్నవారు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని గుర్తించాను. వారికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.

దాంతో నేను రూ.లక్ష విరాళమిచ్చి మరికొందరి నుంచి విరాళాలు సేకరించి సాయం చేశాను.. వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించాను'' అని చెప్పారు ప్రణీత.

కరోనావైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావడం రిస్కే అయినప్పటికీ ఉపాధి లేక ఎంతోమంది ఆకలి బారిన పడడంతో తాను బయటకు వచ్చి సాయం చేసినట్లు చెప్పారామె.

కొందరు తెలుగు హీరోలు, కన్నడ హీరోల అభిమానులు కూడా తనతో కలిసి వచ్చి ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని ప్రణీత చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)