జర్నలిస్టు మనోజ్ మృతి: గాంధీ ఆస్పత్రిపై సోదరుడి ఆరోపణలు

జర్నలిస్టు మనోజ్ మృతి: గాంధీ ఆస్పత్రిపై సోదరుడి ఆరోపణలు

కరోనావైరస్‌ సోకిందనే అనుమానంతో పరీక్షలు చేయించుకొనేందుకు మే 31న హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి మనోజ్, ఆయన సోదరుడు సాయినాథ్ వెళ్లారు.

వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వైద్యవర్గాల నుంచి సమాచారం రావడంతో జూన్ 4న ఇద్దరూ గాంధీ ఆస్పత్రిలో చేరారు.

మనోజ్ జూన్ 7 ఉదయం చనిపోయారు. మనోజ్ మరణానికి కారణం గాంధీ ఆస్పత్రేనని అదే రోజు రికార్డు చేసిన వీడియోలో సాయినాథ్ ఆరోపించారు.

ఆరోపణలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందిస్తూ- మనోజ్ మరణానికి కారణం ఆయనకు ముందు నుంచీ ఉన్న మయస్తేనియా గ్రావిస్ అనే వ్యాధి అని చెప్పారు.

మనోజ్‌కు ఏడో తారీఖు ఉదయం గుండెపోటు (కార్డియాక్ అరెస్టు) వచ్చిందని, ఆ తర్వాత ఆయన్ను కాపాడలేకపోయామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)