భార‌త్ - నేపాల్‌ స‌రిహ‌ద్దుల్లో నేపాల్‌ పోలీసుల కాల్పులు; ఒక‌రి మృతి

నేపాల్

ఫొటో సోర్స్, SEETU TIWARI

భారత్‌-నేపాల్‌ స‌రిహ‌ద్దు ప్రాంతమైన‌ బిహార్‌లోని సీతామ‌డీ జిల్లాలో నేపాల్ పోలీసులు కాల్పులు జ‌రిపారు. వీటిలో ఒకరు‌ మృత్యువాత‌ప‌డ్డారు. మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి.

"నేపాల్‌లోని నారాయ‌ణపూర్, భార‌త్‌లోని జాన‌కీన‌గ‌ర్ మ‌ధ్య ఉద‌యం 8.30 నుంచి తొమ్మి‌ది మ‌ధ్య‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. భార‌త్‌లోని స్థానికులు, నేపాల్ పోలీసుల మ‌ధ్య వాగ్వాదం అనంత‌రం తూటాలు పేలాయి. వీటిలో ఒక‌రు మ‌ర‌ణించారు. గాయాల‌పాలైన ఇద్ద‌రూ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాల‌కు ఎలాంటి ప్ర‌మాద‌మూ లేదు" అని సీతామ‌డి సితామ‌డీ ఎస్పీ అనిల్ కుమార్ బీబీసీకి వెల్ల‌డించారు.అయితే నేపాల్ పోలీసుల‌తో స్థానికుల వాగ్వాదానికి కార‌ణ‌మేంటో తెలియ‌ద‌ని ఆయ‌న అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/ANI

ఫొటో క్యాప్షన్,

బిహార్‌లోని సీతామ‌డీ జిల్లాలోని స‌రిహద్దు ప్రాంతంలో నేపాలీ పోలీసులు కాల్పులు జ‌రిపారు.

నేపాల్‌లోకి ప్ర‌వేశించాల‌ని కొంద‌రు భార‌తీయులు ప్ర‌య‌త్నించ‌డంతో కాల్పులు జ‌రిపామ‌ని నేపాల్ చెబుతున్న‌ట్లు వార్తా సంస్థ‌లు వెల్ల‌డించాయి.

"మొద‌ట కొంత‌మంది స్మ‌గ్ల‌ర్లు వ‌చ్చారు. కొద్దిసేప‌టికే వారి సంఖ్య పెరిగింది." అని నేపాల్‌లోని సప్త‌రీ జిల్లా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీస‌ర్ శంక‌ర్ హ‌రి ఆచార్య వివ‌రించారు.

మ‌రోవైపు త‌మ దగ్గ‌ర నుంచి తూపాకీలు లాక్కోవ‌డానికి కొంద‌రు భార‌తీయులు ప్ర‌య‌త్నించడంతో కాల్ప‌లు జ‌రిపామ‌ని నేపాల్ పోలీసులు చెబుతున్న‌ట్లు స్థానిక విలేక‌రి జ్ఞాన్ రంజ‌న్.. బీబీసీకి చెప్పారు.

"నాకు అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఐదుగురు భార‌తీయులకు తూటాలు త‌గిలాయి. వారిలో వికాస్ అనే వ్య‌క్తి మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న నేపాల్ ప్రాంతంలోనే జ‌రిగింది"అని రంజ‌న్ వివ‌రించారు."లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ఇక్క‌డ‌ స్వ‌ల్ప ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఎలాంటి పెద్ద ఘ‌ట‌నా జ‌ర‌గ‌లేదు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)