గాంధీ కళ్లద్దాల వేలం: రూ. 2.55 కోట్లకు అమ్ముడుపోయిన మహాత్ముడి బంగారు కళ్లద్దాలు

ఫొటో సోర్స్, EAST BRISTOL AUCTIONS LTD
ఈ కళ్లద్దాలను ఓ సాదా సీదా కవర్లో ఉంచి లెటర్ బాక్స్‌లో పెట్టారు
మహాత్మాగాంధీ కళ్లద్దాలు లండన్‌లో శుక్రవారం నిర్వహించిన వేలంలో 2,60,000 పౌండ్ల(సుమారు రూ. 2.55 కోట్లు) ధరకు అమ్ముడుపోయాయి.
బ్రిస్టన్‌లోని "ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్'' అనే వేలం సంస్థ లెటర్ బాక్స్‌లో తెలుపు రంగు కవరులో చుట్టి పడేసి ఉన్న ఈ కళ్లద్దాలను ఆ సంస్థ ఉద్యోగి ఒకరు గుర్తించడంతో వెలుగులోకి వచ్చాయి.
ఇది తమ కంపెనీ చరిత్రలోనే అతి విలువైన వస్తువని వేలం సంస్థకు చెందిన అధికారి ఆండ్రూ స్టోవ్ అన్నారు.
"వాటి విలువ ఎంతో చెప్పినప్పుడు, దాని యజమానికి గుండె ఆగినంత పనైంది'' అని స్టోవ్ చెప్పారు.
"శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి వచ్చి ఈ కళ్లద్దాలను లెటర్ బాక్స్‌లో పెట్టారు. సోమవారం వరకు అతను అక్కడే వేచి ఉన్నారు. మా ఉద్యోగి ఒకరు ఆ కళ్లద్దాలను నాకు అందజేశారు. అందులో ఉన్న ఒక నోట్లో ఇవి గాంధీ కళ్లద్దాలు అని రాసి ఉంది'' అని స్టోవ్ వెల్లడించారు.
"ఇదేదో బాగుందనిపించింది. రోజంతా దాని గురించే ఆలోచించాను'' అని చెప్పారు స్టోవ్. దాని గురించి ఆరా తీయగా బంగారు తాపడం చేసిన ఈ గుండ్రని కళ్లజోడు భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీది అని తేలింది.
"ఈ విషయం నాకు అర్దమయ్యాక కుర్చీలో నుంచి కింద పడిపోయినంత పనయ్యింది'' అని స్టోవ్ చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
"నేను ఆ తర్వాత ఆ కళ్లద్దాలు అందించిన వ్యక్తికి ఫోన్ చేసి వాటి విలువ చెప్పాను. బహుశా అతనికి గుండెపోటు వచ్చి ఉంటుంది" అని స్టోవ్ వ్యాఖ్యానించారు.
ఇవి కొన్ని తరాలుగా తమ ఇంట్లో ఉంటున్నాయని, తమ బంధువులలో ఒకరు 1920లో గాంధీని దక్షిణాఫ్రికాలో కలిశారని ఆ కళ్లజోడు తెచ్చిన వ్యక్తి వెల్లడించారు.
"ఆయన చెప్పిన తేదీలు, సంఘటనల వివరాలు పోల్చుకున్నాం. ఆ తేదీల్లో గాంధీ ఆ కళ్లజోడు ధరించి కనిపించారు'' అని స్టోవ్ వెల్లడించారు.
"చూడటానికి చాలా బలహీనంగా కనిపిస్తున్న ఆ కళ్లజోడు గాంధీ వాడిన మొదటి కళ్ల జోళ్లలో ఒకటి అయ్యుండవచ్చని స్టోవ్ చెప్పారు.
"ఆయనకు తన వస్తువులను ఇతరులకు ఇచ్చే అలవాటుంది'' అన్నారు.
ఫొటో సోర్స్, Google
మహాత్మా గాంధీ కళ్లద్దాలను ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని లెటర్ బాక్స్‌లో పెట్టారు
ఈ కళ్లద్దాల గురించి చాలామంది అడుగుతున్నారని, ముఖ్యంగా ఇండియా నుంచి చాలా మంది వాకబు చేస్తున్నారని, ఇవి తన దగ్గరకు చేరడం అదృష్టంగా భావిస్తున్నానని స్టోవ్ అన్నారు.
"చిన్న కవర్లో పెట్టి ఉన్నాయి... సులభంగా వాటిని ఎత్తుకుపోవచ్చు, లేదంటే జారిపోవచ్చు, లేదంటే చెత్తబుట్టలో కూడా పడేయవచ్చు. కానీ ఇది మా కంపెనీకి వచ్చిన అతి విలువైన వస్తువు'' అన్నారు స్టోవ్.
ఇవి కూడా చదవండి:
- గాంధీలో జాత్యహంకారం ఉండేదా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)